మంచి వీడియోకాల్స్ కోసం
కరోనా మహమ్మారి మన జీవితాలనే కాదు.. చదువులు, ఉద్యోగాల తీరునూ మార్చేసింది. ఉన్నట్టుండి వీడియో కాల్స్, సమావేశాల ప్రాధాన్యం పెరిగిపోయింది. పాఠాలైనా, సమావేశాలైనా అన్నీ వీటితోనే. కానీ టెక్ కంపెనీలే దీనికి అంతగా సిద్ధం కాలేదు.
కరోనా మహమ్మారి మన జీవితాలనే కాదు.. చదువులు, ఉద్యోగాల తీరునూ మార్చేసింది. ఉన్నట్టుండి వీడియో కాల్స్, సమావేశాల ప్రాధాన్యం పెరిగిపోయింది. పాఠాలైనా, సమావేశాలైనా అన్నీ వీటితోనే. కానీ టెక్ కంపెనీలే దీనికి అంతగా సిద్ధం కాలేదు. నిరంతర వీడియో సమావేశాల మూలంగా జూమ్ అలసటతో, ల్యాప్‌టాపుల్లో నాసిరకం వెబ్‌క్యామ్‌లతో విసిగిపోవటం తరచూ చూస్తున్నదే. ఇప్పుడిప్పుడే కొత్త సాధనాలు పుట్టుకొస్తున్నాయి. వీటి వెల్లువ ఇప్పటితో ఆగేది కాదు. కరోనా మహమ్మారి చరిత్ర పుటల్లో కలిసిపోయినా కొనసాగుతూనే వస్తుంది. వీడియో సమావేశాలను సులభతరం చేసే అలాంటి సాధనాల్లో కొన్ని ఇవీ..
సెంటర్ స్టేజ్ తీసుకోండి
ఎప్పుడూ కెమెరా ముందు కూర్చొని మాట్లాడటమేనా? స్వేచ్ఛగా అటూ ఇటూ తిరుగుతూ, పనులు చేస్తూ, చేసే పనులను చూపిస్తూ మాట్లాడొచ్చు కదా. అలా చేయాలంటే ఫోన్‌నో, ట్యాబ్లెట్నో పట్టుకొని వెంట వచ్చేవాళ్లు ఉండాల్సిందేనని అనుకుంటున్నారా? కొత్త ఐప్యాడ్ ప్రోతో అలాంటి అవసరమేమీ లేదు. మనం ఎక్కడుంటే అక్కడే కెమెరా కన్ను కేంద్రీకృతమవుతుంది మరి. అంతా సెంటర్ స్టేజ్ ఫీచర్ మహత్తు. ఇది మెషిన్ లెర్నింగ్ సాయంతో పనిచేస్తుంది. ముందు భాగాన ఉన్న 112 డిగ్రీ ఫీల్డ్ వ్యూ అల్ట్రావైడ్ కెమెరాను తనకు తానే అడ్జస్ట్ చేసుకుంటుంది. కదలికలను పసిగడుతూ మనం ఉన్నచోటును కేంద్రీకృతమయ్యేలా చేస్తుంది. వంటగదిలో వంట చేస్తూ మాట్లాడుతున్నా కెమెరా మనల్ని అనుసరిస్తుంది. మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఎవరైనా వచ్చి చేరినా దానంతటదే జూమ్ అవుతుంది. అవతలివాళ్లకు అందరూ కనిపించేలా చేస్తుంది. సెంటర్ స్టేజ్ ఒక్క ఫేస్ టైమ్‌కు మాత్రమే పరిమితమని అనుకుంటున్నారేమో. జూమ్, మైక్రోసాఫ్ట్ టీమ్స్, వెబ్ఎక్స్ వంటి వాటికీ ఉపయోగపడుతుంది. అయితే వీడియోకాల్ చేస్తున్న ప్రతిసారీ సెంటర్ స్టేజ్ ఫీచర్ అవసరం ఉండకపోవచ్చు. అలాంటప్పుడు సెటింగ్స్ ద్వారా దీన్ని ఆఫ్ చేసుకోవచ్చు. మామూలుగానే మాట్లాడుకోవచ్చు.
* సామ్సంగ్ కొత్త ట్యాబ్లెట్లలో ముందు కెమెరాను పైన కాకుండా కుడి వైపున మధ్యలో అమర్చటమూ బాగా ఉపయోగపడనుంది. సాధారణంగా ట్యాబ్లెట్‌ను అడ్డంగా పెట్టి, అవతలివాళ్లను చూస్తూ వీడియోకాల్స్‌లో మాట్లాడుతుంటాం. పరికరం పైన కెమెరా ఉంటే పక్కకు చూసి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. అదే మధ్యలో ఉంటే నేరుగా చూస్తున్నట్టుగా కనిపిస్తుంది. అవటానికి చిన్న మార్పే గానీ మంచి ప్రభావమే చూపుతుంది.
ఎకో షో ప్రదర్శించండి
తేలికగా వీడియోకాల్స్ చేసుకోవటానికి వీలుగా అమెజాన్ తాజా ఎకో షో 10 కొత్త సొబగులను అద్దుకొని వచ్చింది. నిజానికి ఎకో పరికరం మొదట్లో స్థూపాకారంలో ఉండేది. తర్వాత గుండ్రంగా మారింది. ఇప్పుడు అడుగు భాగాన మోటారుతోనూ వస్తోంది. దీంతో కెమెరా అన్ని వైపులకు తిరగటానికి వీలవుతుంది. ఇది ఆల్గోరిథం సాయంతో మన ముఖం వైపునకే కెమెరా కన్నును కేంద్రీకృతం చేయగలదు. ఒకసారి అలెక్సాకు చెప్పి మోషన్ ఫీచర్‌ను ఆన్ చేస్తే చాలు. అలెక్సాను ఏదైనా అడిగినప్పుడు తెర మన ముఖం వైపునకు తిరుగుతుంది. వాయిస్ సెన్సర్లు, కెమెరా సమన్వయంతో పనిచేస్తూ మాట్లాడేవారిని గుర్తిస్తాయి. ఫాలో అని అలెక్సాకు చెబితే గదిలో ఎక్కడున్నా కెమెరా మనల్నే అనుసరిస్తుంది. ఎకో షో 10 సుమారు 360 డిగ్రీల కోణంలో తిరగగలదు. హై-రెజల్యూషన్ కెమెరాతో కూడిన ఇది డిజిటల్‌గా జూమ్ అవుతుంది కూడా. ఇలా వీడియో కాల్స్ చేస్తున్నప్పుడు ఫ్రేమ్‌లో మనం ప్రముఖంగా కనిపించేలా చేస్తుంది. సపోర్టు అందుబాటులో ఉంటే గ్రూప్ కాలింగ్, స్కైప్, జూమ్తోనూ పనిచేస్తుంది. ఒకవేళ స్థిరంగా ఉండాలనుకుంటే ‘అలెక్సా టర్న్ ఆఫ్ మోషన్’ అని ఆదేశిస్తే సరి.
అల్ట్రాషార్ప్ అవ్వండి
స్పష్టమైన ప్రత్యక్ష వీడియో దృశ్యాలు కావాలనుకునే వారి కోసం డెల్ అత్యంత నాణ్యమైన అల్ట్రాషార్స్ 4కే వెబ్‌క్యామ్‌ను ప్రవేశపెట్టింది. ఆటో ఫ్రేమింగ్, 1080/60 ఎఫ్‌పీఎస్ వంటి ఫీచర్లు దీని సొంతం. తక్కువ కాంతిలో లేదా వెనకభాగాన ఎక్కువ కాంతి ఉన్నప్పుడూ స్పష్టంగా దృశ్యాలు చిత్రీకరించే హెచ్డీఆర్ సదుపాయమూ ఉంటుంది. మూడు రకాలుగా.. 65, 78, 90 డిగ్రీల ఫీల్డ్ వ్యూలను ఎంచుకోవచ్చు. సోనీ స్టార్విస్ కామ్స్ 8.3 మెకాపిక్సల్ సెన్సర్, ఆటోలైట్ కరెక్షన్ ఉండటం వల్ల లైటింగ్‌తో నిమిత్తం లేకుండా దృశ్యాలు స్పష్టంగా కనిపించేలా చేస్తుంది. 5ఎక్స్ డిజిటల్ జూమ్‌తో పాటు ఆటోఫోకస్ ఫీచర్లతోనూ అలరిస్తోంది. ఇది విండోస్ పీసీ, మ్యాక్ రెండింటితోనూ పనిచేస్తుంది. కాకపోతే మ్యాక్‌లో కొన్ని ఫీచర్లు పనిచేయవు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మానవ రోబో దండు!
రోబో అనగానే ఏం గుర్తుకొస్తుంది? లోహ చట్రంతో కదిలే మర యంత్రమో, కదిలే లోహం బొమ్మో మదిలో కదలాడుతుంది. రబ్బరు కండరాలతో చేసినదైతే మనిషి మాదిరిగానూ కనిపిస్తుంది. చూపు, మాట మనిషిని పోలి ఉంటాయి. -
కొత్త సర్ఫేస్ ల్యాప్‌టాప్‌లు
వాణిజ్య అవసరాలను దృష్టిలో పెట్టుకొని మైక్రోసాఫ్ట్ సంస్థ ఏఐ ఆధారిత సర్ఫేస్ ప్రొ 10, సర్ఫేస్ ల్యాప్‌టాప్ 6 పరికరాలను పరిచయం చేసింది. ఇంటెల్ కోర్ అల్ట్రా ప్రాసెసర్‌తో కూడిన ఇవి విండోస్ 11 ప్రొ మీద పనిచేస్తాయి. 5జీ కనెక్టివిటీ కూడా ఉంటుంది. -
జంతువుల రంగుల లోకాన్ని చూపించే కెమెరా
జంతువులు, పక్షులు, తేనెటీగలకు ఈ ప్రపంచం ఏ విధంగా కనిపిస్తుంది? మనం చూసే రంగులు వాటికీ కనిపిస్తాయా? చాలామందికి ఇలాంటి సందేహం వచ్చే ఉంటుంది. -
వాట్సప్ కొత్త ఇమేజ్ ఎడిటర్
వాట్సప్ త్వరలో ఏఐ ఆధారిత కొత్త ఇమేజ్ టూల్‌ను ప్రవేశపెట్టనుంది. ఇది ఫొటోలను తేలికగా ఎడిట్ చేసుకోవటానికి వీలు కల్పిస్తుంది. ఈ ఫీచర్ ఇమేజ్‌లను షేర్ చేసుకునే పేజీలో పైన కనిపిస్తుందని చెబుతున్నారు. -
లాలీపాప్తో నోటి క్యాన్సర్ జాడ
క్యాన్సర్లను నిర్ధరించటానికి కణజాలం నుంచి చిన్న ముక్కను తీసి పరీక్ష చేస్తుంటారు (బయాప్సీ). ఇందుకోసం శరీరానికి కోత పెట్టాల్సి ఉంటుంది. నొప్పి పుడుతుంది. బయాప్సీ చేయటానికి నిపుణులు అవసరం. -
వరదొచ్చే.. వరదొచ్చే.. వారం ముందే అంచనా
కృత్రిమ మేధ (ఏఐ) రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. కంపెనీలు వినూత్న టూల్స్‌ను సృష్టిస్తూ సత్తాను చాటుకోవటానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయంలో గూగుల్ ఇటీవల గొప్ప పురోగతిని సాధించింది. -
ఏఐ వీడియోకు సౌండ్ ట్రాక్ సొబగులూ
ఏఐతో వీడియోలు సృష్టించటం తేలికైపోయింది. ఎలాంటి వీడియో కావాలో పదాల్లో వర్ణిస్తే చాలు. దానికి తగ్గట్టుగా వీడియోలు రూపొందించే ఏఐ వేదికలు చాలానే ఉన్నాయి. -
ఉంగరమే న్యూట్రిషనిస్ట్
సామ్సంగ్ ఇటీవల గెలాక్సీ రింగ్‌ను పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఇది రోజూ తినే ఆహారం విషయంలోనూ సూచనలు ఇవ్వగలదని చెబుతున్నారు. యూజర్ల శరీర ఎత్తు బరువుల నిష్పత్తి (బీఎంఐ) ఆధారంగా ఎన్ని కేలరీల శక్తినిచ్చే ఆహారం తినాలో సూచిస్తుంది. -
paul alexander: ఇనుప ఊపిరితిత్తి!
ఓ పొడవైన పెట్టె. శరీరమంతా అందులోనే. తల మాత్రమే బయటకు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 72 ఏళ్లు అందులోనే గడిపితే? అమెరికాకు చెందిన పాల్ అలెగ్జాండర్ అలాగే గడిపారు -
వాట్సప్‌లో మరిన్ని మెసేజ్‌లు పిన్
వాట్సప్ ప్రియులకు శుభవార్త. ఇకపై ఒకే సమయంలో మూడు కన్నా ఎక్కువ ఛాట్స్, మెసేజ్‌లను పిన్ చేసుకోవచ్చు. కొత్త ఫీచర్లలో భాగంగా వాట్సప్ దీన్ని ఇటీవలే పరిచయం చేసింది. -
మీ అభ్యర్థి చరిత్రేంటి?
మీ నియోజకవర్గం అభ్యర్థి ఎలాంటివారు? నేర చరిత్ర ఏమైనా ఉందా? తెలుసుకోవాలంటే ‘నో యువర్ క్యాండిడేేట్’ (కేవైసీ) యాప్‌లో చూసుకోండి. ప్రధాన ఎన్నికల కమిషనర్ ఇటీవల ఎన్నికల క్రమాన్ని ప్రకటించటంతో పాటు ఈ యాప్‌నూ పరిచయం చేశారు -
గేమింగ్‌లో కృత్రిమ నేస్తం!
ఎక్కడికి, ఎలా దారితీస్తుందో తెలియదు గానీ కృత్రిమ మేధ (ఏఐ) రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఇటీవల వృద్ధుల్లో ఒంటరితనాన్ని పోగొట్టటానికి తోడ్పడే ఏఐ రోబో, పూర్తిస్థాయి ఏఐ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆవిష్కరణ ఆశ్చర్యచకితులను చేస్తే.. తాజాగా ఏఐ గేమింగ్ ఏజెంట్ పుట్టుకొచ్చింది -
గూగుల్ సెర్చ్ తెలివిగా..
స్మార్ట్ఫోన్లలో గూగుల్ సెర్చ్‌ను వాడనివారుండరంటే అతిశయోక్తి కాదు. కానీ తేలికగా, త్వరగా ఆయా అంశాలను శోధించటానికి కొన్ని చిట్కాలు ఉన్నాయనే సంగతి తెలుసా? అలాంటి కొన్ని ఉపాయాల గురించి తెలుసుకుందాం. -
ఏఐ పాట
కృత్రిమమేధ (ఏఐ) సాయంతో కొత్త పాటలను సృష్టించాలని అనుకుంటున్నారా? అయితే సునో ఏఐ (https://www.suno.ai/) సాయం తీసుకోండి. ఇదో ఏఐ మ్యూజిక్ జనరేటర్ వేదిక. -
రియల్మీ నుంచి నార్జో 70 ప్రొ 5జీ ఫోన్లు
రియల్మీ సంస్థ నార్జో 70 ప్రొ 5జీ ఫోన్‌ను పరిచయం చేసింది. ఎయిర్ జెశ్చర్స్ శ్రేణిలో ఇదే తొలి ఫోనని కంపెనీ పేర్కొంటోంది. -
భూగర్భంలో నీరెంత?
భూమి మీద మూడొంతుల మేర ఉండేది నీరే. మరి భూగర్భంలో ఎంత నీరుంటుంది? ఎంతుంటే ఏంటని మనం అనుకుంటామేమో గానీ శాస్త్రవేత్తలు అలా కాదు. -
డ్యూగూ.. సూర్యుడికే అన్న!
డ్యూగూ గ్రహ శకలం సూర్యుడి కన్నా ముందే పుట్టిందా? దీని నమూనాల ప్రాథమిక విశ్లేషణలో ఈ విషయమే వెల్లడైంది. ఇప్పుడిదే ఆశ్చర్యం కలిగిస్తోంది. -
గూగుల్ లెన్స్‌లో సెర్చ్ హిస్టరీ సేవ్
గూగుల్ లెన్స్‌తో ఇమేజ్‌లను వెతికేవారికి శుభవార్త. ఇకపై వెతికిన ఇమేజ్‌లను తేలికగా తెలుసుకోవచ్చు. అవసరమైతే అక్కడి నుంచే డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
గది ఉష్ణోగ్రత వద్దే క్యూబిట్లు స్థిరంగా..
క్వాంటమ్ కంప్యూటింగ్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. సమాచార పరిశీలన, విశ్లేషణ ప్రక్రియలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోంది. -
నిర్ధరణ తీరునూ వివరించే ఏఐ
వైద్యరంగంలో కృత్రిమ మేధ (ఏఐ) రోజురోజుకీ విస్తరిస్తోంది. జబ్బుల నిర్ధరణ దగ్గరి నుంచి చికిత్సలను నిర్ణయించుకోవటం వరకూ ఉపయోగపడుతుంది. -
యాపిల్ పాడ్‌కాస్ట్‌లు అక్షరాల్లో..
పాడ్‌కాస్ట్‌లు ఎంత పాపులర్ అవుతున్నాయో చూస్తూనే ఉన్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకునే యాపిల్ సంస్థ పాడ్‌కాస్ట్‌లను మరింత విస్తృతంగా అందుబాటులోకి తేవటానికి, వాటిల్లోని అంశాలను, విషయాలను తేలికగా కనుక్కోవటానికి ఓ వినూత్న ఫీచర్‌ను ప్రవేశపెట్టింది
తాజా వార్తలు (Latest News)
-
టీసీఎస్‌లో 3.5 లక్షల మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐలో శిక్షణ
-
సీ-విజిల్‌కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి
-
లోక్‌సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్
-
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు
-
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం