ధ్రువ ప్రభల గుట్టు అదే

ధ్రువాల వద్ద రాత్రిపూట ఆకాశం ఎరుపు, ఆకుపచ్చ రంగులతో అలరారటం తెలిసిందే. వీటినే ధ్రువ ప్రభలు (ఆరోరా) అంటారు. వీటి గుట్టును తెలుసుకోవటానికి శాస్త్రవేత్తలు మొదట్నుంచీ ప్రయత్నిస్తూనే ఉన్నారు. అంతరిక్షం నుంచి వచ్చే ..

Updated : 18 Aug 2021 05:23 IST

ధ్రువాల వద్ద రాత్రిపూట ఆకాశం ఎరుపు, ఆకుపచ్చ రంగులతో అలరారటం తెలిసిందే. వీటినే ధ్రువ ప్రభలు (ఆరోరా) అంటారు. వీటి గుట్టును తెలుసుకోవటానికి శాస్త్రవేత్తలు మొదట్నుంచీ ప్రయత్నిస్తూనే ఉన్నారు. అంతరిక్షం నుంచి వచ్చే ఎలక్ట్రాన్ల తరంగాలు పై వాతావరణంలో భూ అయస్కాంత క్షేత్రంలోకి ప్రవేశించి.. ఆక్సిజన్‌, నత్రజని మూలకాలతో ఢీకొట్టటం వల్ల ఆకాశం ఎరుపు, ఆకుపచ్చ రంగుల్లో ప్రకాశిస్తూ కనిపిస్తుందని చాలాకాలంగా ఊహిస్తున్నారు. కానీ ఉపగ్రహాలేవీ దీన్ని గుర్తించలేకపోయాయి. అందుకే శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో అచ్చం అంతరిక్షంలోని పరిస్థితులనే సృష్టించి పరీక్షించారు. ప్లాస్మాతో నిండిన గొట్టంలోకి అయస్కాంత క్షేత్ర తరంగాలను పంపించి పరిశీలించారు. ఇవి ప్లాస్మాలోని ఎలక్ట్రాన్లను ప్రేరేపించి.. ధ్రువ ప్రభలు ఏర్పడటానికి అవసరమైన పరిస్థితులనే సృష్టించటం విశేషం. దీంతో ధ్రువ ప్రభల గుట్టు వీడినట్టయ్యింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని