‘స్మార్ట్’ చేదోడు!
ఒకప్పుడు ఫోనంటే మాట్లాడుకోవటానికే. మరిప్పుడో సమస్త ప్రపంచమూ స్మార్ట్ఫోన్లలోనే నిక్షిప్తమైపోయింది. ఫొటోలు, వీడియోలు తీయటం దగ్గర్నుంచి సామాజిక మాధ్యమాల విహారం వరకూ అన్నీ ఫోన్లతోనే సాగుతున్నాయి. కొత్త కొత్త యాప్‌ల వెల్లువతో సౌలభ్యమూ పెరిగింది. నిజానికి వీటి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. యాప్‌లతోనే కాదు.. మొబైల్ ఫోన్‌తోనూ కొన్ని పనులు చక్కబెట్టుకోవచ్చు. అంటే చేదోడుగా వాడుకోవచ్చన్నమాట.
ఒకప్పుడు ఫోనంటే మాట్లాడుకోవటానికే. మరిప్పుడో సమస్త ప్రపంచమూ స్మార్ట్ఫోన్లలోనే నిక్షిప్తమైపోయింది. ఫొటోలు, వీడియోలు తీయటం దగ్గర్నుంచి సామాజిక మాధ్యమాల విహారం వరకూ అన్నీ ఫోన్లతోనే సాగుతున్నాయి. కొత్త కొత్త యాప్‌ల వెల్లువతో సౌలభ్యమూ పెరిగింది. నిజానికి వీటి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. యాప్‌లతోనే కాదు.. మొబైల్ ఫోన్‌తోనూ కొన్ని పనులు చక్కబెట్టుకోవచ్చు. అంటే చేదోడుగా వాడుకోవచ్చన్నమాట. మన రోజువారీ వ్యవహారాల్లో ఇది ఎంతగానో ఉపయోగపడుతుందనటంలో సందేహం లేదు.
ఎత్తు కొలవటం
పిల్లలను గోడకు నిలబెట్టి, తల మీద పెన్సిల్‌ను పెట్టి, గోడకు గీత గీసి, ఎత్తును కొలవటం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు అంత తతంగం అవసరం లేదు. ఫోన్‌తోనే కానిచ్చేయొచ్చు. కాకపోతే అధునాతన ఐఫోన్ కావాలి. ఐఫోన్ 12 ప్రొ లేదా ఐఫోన్ 12 ప్రొ మ్యాక్స్ మీ చేతిలో ఉంటే మెజర్ యాప్‌ను ఓపెన్ చేసి ఎవరి ఎత్తునైనా ఇట్టే కొలవచ్చు. ముందుగా ఎత్తు కొలవాలని అనుకున్నవారిని ఫ్రేమ్‌లో ఉండేలా చూసుకోవాలి. అప్పుడు వారి తల మీద ఒక తెల్లటి గీత, దాని కింద ఎత్తు కనిపిస్తుంది. తెల్ల వృత్తాన్ని నొక్కితే కొలత నమోదవుతుంది. ఫొటోను సేవ్ చేసుకోవాలనుకుంటే కింద కుడివైపు మూలన పాపప్ అయ్యే స్క్రీన్‌షాట్‌ను ట్యాప్ చేసి డన్ బటన్‌ను నొక్కాలి. ఇలా ఫొటోస్‌లో లేదా ఫైల్స్‌లో సేవ్ చేసుకోవచ్చు. మరి అండ్రాయిడ్ ఫోన్ల సంగతేంటని అంటారా? వీటి కోసం థర్డ్ పార్టీ యాప్‌లు ఉన్నాయిగా. వీటిల్లో మంచి రేటింగ్ ఉన్నది స్మార్ట్ మెజర్. దీన్ని ఓపెన్ చేయగానే ఎదుటి వాళ్ల ఫొటో మీద ప్లస్ గుర్తు కనిపిస్తుంది. దీన్ని పాదాల నుంచి మొదలు పెట్టి తల మీదికి తీసుకొస్తే ఎత్తు తెలుస్తుంది. ఇందులో మన నుంచి వాళ్లు ఎంత దూరంలో ఉన్నారో కూడా కనుక్కోవచ్చు.
మెనూ స్కాన్
క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయటానికి ఒకప్పుడు థర్డ్ పార్టీ యాప్‌లను వాడేవారు. ఇవి మెమరీలో ఎక్కువ స్పేస్ తీసుకునేవి. చేసే పని కన్నా ఎక్కువ సమాచారం సేకరించేవి. ఇప్పుడు వీటి అవసరమేమీ లేదు. ఫోన్ కెమెరా చాలు. ఐఫోన్ కెమెరా ఓపెన్ చేసి క్యూఆర్ కోడ్‌ను ఫోకస్ చేస్తే చాలు. దానంతటదే స్కాన్ చేసి పెడుతుంది. పాపప్ అయ్యే నోటిఫికేషన్‌ను ట్యాప్ చేస్తే ఆయా వెబ్సైట్లను చూడొచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్లలోనైతే మోడల్, కంపెనీలను బట్టి ఆధారపడి ఉంటుంది. కెమెరా యాప్ క్యూఆర్ కోడ్‌ను స్కానింగ్‌తో కూడుకున్నది ఎంచుకుంటే మంచిది. ఉదాహరణకు- సామ్సంగ్ గెలాక్సీలో హోంస్క్రీన్ ద్వారా క్విక్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ‘క్యూఆర్ స్కానర్’ను ఎంచుకొని ఓకే బటన్ నొక్కాలి. ఇది కెమెరా యాప్‌ను ఓపెన్ చేస్తుంది. ఇది పనిచేయకపోతే కెమెరా సెటింగ్స్‌లో స్కాన్ క్యూఆర్ కోడ్ ఆప్షన్ ఉందేమో చూడొచ్చు.
గుండె వేగం కొలతకు
గుండె వేగాన్ని తెలుసుకోవటానికి స్మార్ట్‌వాచే అవసరం లేదు. స్మార్ట్‌ఫోన్ అయినా చాలు. ఐఫోన్ యాప్ ‘కార్డియో: హార్ట్ రేట్ మానిటర్’ కెమెరాతోనే గుండె వేగాన్ని లెక్కిస్తుంది. కెమెరా వెనకాల చూపుడు వేలును ఆనిస్తే చాలు. మారుతున్న రంగులను బట్టి గుండె వేగాన్ని చూపిస్తుంది. ఫోన్ కదలకుండా గట్టిగా పట్టుకోవటం మరవద్దు. అండ్రాయిడ్ ఫోన్లలో హార్ట్ రేట్ మానిటర్ యాప్ సరిగ్గా ఇలాగే పనిచేస్తుంది. అయితే ఇవేవీ డాక్టర్లకు ప్రత్యామ్నాయం కావని తెలుసుకోవాలి. ఒక అంచనాకు మాత్రమే పనికొస్తాయి.
రిమోట్ కంట్రోల్ తనిఖీ
రిమోట్ కంట్రోల్ అందరూ వాడేదే. ఇది సరిగా పనిచేయకపోవటానికి చాలావరకు బ్యాటరీల కాలం చెల్లటమే కారణమై ఉంటుంది. కొన్నిసార్లు రిమోట్ చెడిపోయి ఉండొచ్చు కూడా. దీన్ని తెలుసుకోవటానికీ ఫోన్‌ను వాడుకోవచ్చు. కెమెరా యాప్‌ను ఓపెన్ చేసి రిమోట్ వైపు ఫోకస్ చేసి, ఏదైనా బటన్‌ను నొక్కుతూ తెర వైపు చూడండి. రిమోట్ అంచు నుంచి ఏదైనా సన్నటి కాంతి రేఖ వస్తున్నట్టు కనిపిస్తే ఇన్ఫ్రారెడ్ సిగ్నల్ పనిచేస్తున్నట్టే. అంటే బ్యాటరీల కాలం చెల్లిందని, మార్చాల్సి ఉందనే అర్థం. కాంతి రేఖ కనిపించకపోతే కొత్త రిమోట్‌ను కొనుక్కోవాల్సిందే.
సెక్యూరిటీ కెమెరాగా..
ఇప్పుడు చాలామంది ఇంట్లో ఒకటో రెండో సెక్యూరిటీ కెమెరాలు ఉంటున్నాయి. ఒకవేళ లేకపోతే స్మార్ట్‌ఫోన్‌నే సెక్యూరిటీ కెమెరాగా వాడుకోవచ్చు. కాకపోతే ఆ ఫోన్‌తో ఇంకేమీ పనులు చేయలేం. ఇంటికి దూరంగా ఉన్నప్పుడు, ఇంటి మీద నిఘా పెట్టాల్సివస్తే దీన్ని తాత్కాలికంగా ఉపయోగించుకోవచ్చు. ఇందుకోసం https://critter.camera/ సాయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఫోన్, కంప్యూటర్, ట్యాబ్లెట్, ల్యాప్‌టాప్ వంటి వాటిని మోషన్ యాక్టివేటెడ్ కెమెరాగా మార్చేస్తుంది. పరికరంలోని కెమెరా ద్వారా కదలికలను పసిగడుతుంది. ఇందుకోసం కాసేపు క్యాలిబరేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది సురక్షితం కూడా. ఇంటర్నెట్ ద్వారా ఎలాంటి సమాచారాన్ని పంపించదు. తీసిన దృశ్యాలన్నీ పరికరంలోనే సేవ్ అవుతాయి.
వస్తువుల ఆచూకీ
సాక్స్ ఎక్కడెక్కడో పడేస్తుంటాం. అవసరానికి దొరక్క తెగ ఇబ్బంది పడుతుంటాం. కొన్నిసార్లు ఇవి మంచం కిందో, సోఫా వెనకాలో పడిపోవచ్చు. అవి అక్కడున్నాయో లేదో తెలుసుకోవటమెలా? నడుం వంచితే చాలంటారా. కొన్నిసార్లు నడుం వంచినా కనిపించకపోవచ్చు. ఇక్కడే ఫోన్ సాయం చేస్తుంది. కెమెరాతో ఫోన్ తీసి చూస్తే సరి. ఇది మనకు కనిపించని వాటినీ ఫొటో తీసి చూపిస్తుంది. కావాలంటే వీడియో తీసి కూడా చూసుకోవచ్చు. అటక మీద మన చేతికి అందని చోట ఉన్న వస్తువులనూ వీటితో గుర్తించొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మెదడులాంటి కంప్యూటర్!
మనిషి మెదడులా పనిచేసే, ఒకే సమయంలో వేర్వేరుగా స్పందించే కంప్యూటర్లను రూపొందించాలని చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. ఈ దిశగా ఇంటెల్ శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు. ప్రపంచంలోనే అతి పెద్ద న్యూరోమార్ఫిక్ కంప్యూటర్ను రూపొందించారు. -
నాచులో నత్రజని ఫ్యాక్టరీ
ప్రకృతిలో బ్యాక్టీరియా, ప్రాణులు ఒకదాని మీద మరోటి ఆధారపడటం (సింబయోటిక్) మామూలే. కానీ ఆ బ్యాక్టీరియా ప్రాణిలో భాగంగా మారితే? శక్తినందించే వనరుగా పరిణమిస్తే? అలాంటి విషయాన్నే శాస్త్రవేత్తలు గుర్తించారు. -
లిథియం బ్యాటరీ పేలకుండా..
ఇప్పుడు లిథియం-అయాన్ బ్యాటరీలు లేని డిజిటల్ పరికరాలను ఊహించుకోలేం. సెల్ఫోన్ల దగ్గరి నుంచి స్మార్ట్‌వాచ్‌ల వరకూ అన్నింటికీ ఇవే ఆధారం. ఐప్యాడ్, మ్యాక్, ఎలక్ట్రిక్ టూత్‌బ్రష్, ట్రిమ్మర్ వంటివీ వీటితోనే పనిచేస్తాయి. -
‘కీప్’ గోయింగ్!
రోజురోజుకీ నోట్-టేకింగ్ యాప్స్‌కు ఆదరణ పెరుగుతోంది. వివిధ ప్రయోజనాలు ఉండటంతో యువత వీటిని ఎక్కువగా వాడుతున్నారు. ఇప్పుడు బోలెడన్ని ఉచిత నోట్ టేకింగ్ యాప్‌లూ అందుబాటులో ఉన్నాయి. -
అణువు మందం బంగారు పొర
బంగారాన్ని పొరలుగా మలచటం తెలుసు. కానీ అతి పలుచటి.. ఆ మాటకొస్తే కేవలం అణువు మందం పొరగా మలచటం చాలా కష్టం. ఇందుకోసం శాస్త్రవేత్తలు చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. -
అమెజాన్ మ్యూజిక్‌లో ఏఐ ప్లేలిస్టు ఫీచర్
సంగీత ప్రియులను ఆకట్టుకోవటానికి మ్యూజిక్ యాప్‌లు కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో కొత్త పుంతలు తొక్కుతున్నాయి. స్పోటిఫై ఇటీవల ప్రీమియం యూజర్ల కోసం ఏఐ ఆధారిత ప్లేలిస్ట్ జనరేటర్‌ను అందుబాటులోకి తెచ్చింది. -
వాట్సప్ ఛాట్ ఫిల్టర్
వాట్సప్ గత కొన్నిరోజులుగా గోప్యతను కాపాడుతూనే ఎన్నో వినూత్న ఫీచర్లు పరిచయం చేస్తోంది. ఎక్కువ మందికి మెటా ఏఐని అందుబాటులోకి తేవటం దగ్గరి నుంచి యాప్ నుంచే బస్ టికెట్లు కొనుక్కోవటానికి వీలు కల్పించటం వరకూ ఎన్నో సదుపాయాలను ఆరంభించింది. -
వెబ్‌లోనూ ట్రూకాలర్
స్మార్ట్ఫోన్లలో ట్రూకాలర్‌ను చాలాకాలంగా వాడుతూనే ఉన్నాం. అజ్ఞాత, స్పామ్ కాల్స్‌ను గుర్తించటానికిది బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడిది వెబ్ బ్రౌజర్ రూపంలోకీ మారింది. -
నక్షత్రాలూ సంచరిస్తాయి!
నక్షత్ర మండలంలో కోట్లాది నక్షత్రాలుంటాయి. సాధారణంగా ఇవి తమ నక్షత్ర మండలానికే పరిమితమవుతాయి. కానీ కొన్ని మాత్రం నక్షత్ర మండలాల మధ్య తిరుగుతుంటాయి. తమ నక్షత్ర మండలం గురుత్వాకర్షణకు కట్టుబడి ఉండవు. -
వెబ్క్యామే స్కానర్
డెస్క్‌టాప్ ఉంది గానీ స్కానర్ లేదా? పోనీ వెబ్‌క్యామ్ అయినా ఉందా? అయితే దీన్నే స్కానర్‌లా వాడుకుంటే సరి. మ్యాక్‌లోనైతే- ఫొటో బూత్‌ను ఓపెన్ చేసి, డాక్యుమెంట్‌ను వెబ్‌క్యామ్ ముందుకు తీసుకురావాలి. -
దైవకణం కథ
అది అన్ని కణాలకూ ద్రవ్యరాశిని సంతరింపజేస్తుంది. దీని గురించి 1960ల్లోనే తెలిసినా 50 ఏళ్ల తర్వాత గానీ ఉనికి బయటపడలేదు. ప్రపంచంలోనే అతి పెద్ద, అతి సంక్లిష్ట యంత్రం సాయం తీసుకుంటే తప్ప అది సాధ్యం కాలేదు. -
జీపీటీ దృష్టి!
టెక్నాలజీ రంగంలో ఇప్పుడు ఛాట్‌జీపీటీ పేరు మార్మోగుతోంది. ఆరంభమైనప్పటి నుంచే సంచలనాలు సృష్టిస్తోంది. రోజురోజుకీ కొత్త పోకడలు పోతోంది. ఆన్లైన్లో టెక్స్ట్‌ను సంగ్రహించి, మథించటంతోనే ఆగిపోలేదు. -
హాయ్ ఐయామ్ నమో ఏఐ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టెక్నాలజీ వాడకంలో ఎప్పుడూ ముందే ఉంటారు. ఆయన వ్యక్తిగత నమో యాప్ గురించి తెలిసిందే. దీనికి తాజాగా కృత్రిమ మేధతో కూడిన నమో ఏఐ ఫీచర్ కూడా జతచేరింది. -
ఆండ్రాయిడ్ పరికరాల్లో సరికొత్త ఫొటో ఎడిటింగ్
డిజిటల్ ప్రపంచం రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ నేపథ్యంలో ఆండ్రాయిడ్ పరికరాలూ కొత్త సొబగులు అద్దుకుంటున్నాయి. వీటికి త్వరలో కొత్త ఏఐ ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. -
రోడ్డు గుంతలను పూడ్చే రోబో
గుంతలు లేని రోడ్లను ఒకసారి తలచుకోండి. ఆ ప్రయాణం ఎంత హాయిగా ఉంటుందో! ఊహించుకుంటేనే ఎంత సంతోషం కలుగుతుందో కదా. అదే నిజమైతే? అది సాకారం కావటం మరెంతో దూరంలో లేదు. -
అశ్లీల బెదిరింపుల వలలో పడకుండా
ఆన్లైన్లో నగ్న చిత్రాలు, వీడియోలతో బెదిరించటాన్ని అడ్డుకోవటానికి ఇన్స్టాగ్రామ్ కొత్తగా న్యూడిటీ ప్రొటెక్షన్ ఫీచర్‌ను ప్రవేశపెట్టనుంది. ఇన్స్టాగ్రామ్ డీఎంలలో ఉండే ఈ ఫీచర్ దానంతటదే నగ్న చిత్రాలను పసిగడుతుంది. -
పాటలు నేర్పే పదనిస
హిందీ పాటలు పాడటం నేర్చుకోవాలని భావిస్తున్నారా? కానీ సమయం దొరకటం లేదని చింతిస్తున్నారా? అయితే పదనిస యాప్‌ను ప్రయత్నించి చూడండి. ప్రముఖ సంగీత కంపెనీ సరిగమ ఇటీవలే దీన్ని తీసుకొచ్చింది. -
ఐఓఎస్ 17.5 పబ్లిక్ బీటా వచ్చింది
ఐఓఎస్ 17.5 పబ్లిక్ బీటా అందుబాటులోకి వచ్చింది. అంటే డెవలపర్ అకౌంట్ లేకపోయినా తాజా ఫీచర్లు, అప్డేట్లను ఎవరైనా ప్రయత్నించొచ్చన్నమాట. ఐఓఎస్ 17.5 స్టేబుల్ వర్షన్ ఇప్పుడప్పుడే వచ్చే అవకాశం కనిపించటం లేదు. -
కాల మహిమ
ఉగాది రోజు పంచాంగం విన్నారా? దీనిలోని తిథులు, రోజులు, పక్షాలు, నెలలు, రుతువులు.. అన్నీ కాల గమన సంకేతాలే. అసలు కాలమంటే ఏంటి? అది ఎలా మొదలైంది? ఇలాగే కొనసాగుతుందా? అంతమవుతుందా? -
సామాజిక వ్యసనం శ్రుతి మించుతోందా?
సామాజిక మాధ్యమాలు వ్యసనంగా మారాయా? దీన్నుంచి బయట పడటానికి ప్రయత్నిస్తున్నారా? అయితే పామ్సీ యాప్ సాయం తీసుకోవచ్చు. -
బహుబలి కెమెరా
అమెరికాలోని ఎస్ఎల్ఏసీ నేషనల్ యాక్సిలేటర్ లేబరేటరీ శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు ప్రపంచంలోనే అత్యంత శక్తిమంత కెమెరాను రూపొందించారు.
తాజా వార్తలు (Latest News)
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్‌మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM