ఉచిత ఆఫీస్‌

వర్డ్‌, ఎక్సెల్‌, పవర్‌ పాయింట్‌.. ఒక్క మైక్రోసాఫ్ట్‌ ఆఫీస్‌తోనే ఎన్నెన్నో డాక్యుమెంట్లను సృష్టించుకోవచ్చు. ప్రొడక్టివిటీ సాఫ్ట్‌వేర్‌లో దీన్ని మించింది లేదు. కాకపోతే ఖరీదు ఎక్కువ. అందుకే చాలామంది వెనకాడుతుంటారు. ఇలాంటివారి...

Updated : 29 Sep 2021 06:01 IST

ర్డ్‌, ఎక్సెల్‌, పవర్‌ పాయింట్‌.. ఒక్క మైక్రోసాఫ్ట్‌ ఆఫీస్‌తోనే ఎన్నెన్నో డాక్యుమెంట్లను సృష్టించుకోవచ్చు. ప్రొడక్టివిటీ సాఫ్ట్‌వేర్‌లో దీన్ని మించింది లేదు. కాకపోతే ఖరీదు ఎక్కువ. అందుకే చాలామంది వెనకాడుతుంటారు. ఇలాంటివారి కోసం ఉచిత సాఫ్ట్‌వేర్స్‌ అందుబాటులో లేకపోలేదు. వీటిల్లో ఒకటి లీబ్రాఫిస్‌. ఇదో ఓపెన్‌ సోర్స్‌ ఆఫీస్‌ సూట్‌. ఉచితమే అయినా ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతుంది. ఇందులో రైటర్‌, ఇంప్రెస్‌, కాల్క్‌ వంటి ఆరు ప్రోగ్రామ్‌లను వినియోగించుకోవచ్చు. ఇవి అచ్చం మైక్రోసాఫ్ట్‌ వర్డ్‌, పవర్‌ పాయింట్‌, ఎక్సెల్‌ మాదిరిగానే పనిచేస్తాయి. అధీకృత ఎంఎస్‌ ఆఫీస్‌లో సృష్టించిన ఫైళ్లనూ ఇందులో ఎడిట్‌ చేసుకోవచ్చు. కొత్త ఫైళ్లను ఆఫీస్‌ ఫార్మాట్‌లోనూ సేవ్‌ చేసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని