చంద్రశేఖర పరిమితి

శాస్త్రరంగంలో అంకెలు, సంఖ్యలకు ప్రత్యేక స్థానముంది. వీటిల్లో కొన్ని మైలురాళ్లుగానూ నిలుస్తుంటాయి. చంద్రశేఖర పరిమితి అలాంటిదే. మన జీవితం కర్బనం మీద ఆధారపడినప్పటికీ జీవుల మనుగడకు ఇతరత్రా పెద్ద అణువులూ అవసరమే. ఇలాంటి భారీ మూలకాలు

Updated : 06 Oct 2021 01:59 IST

శాస్త్రరంగంలో అంకెలు, సంఖ్యలకు ప్రత్యేక స్థానముంది. వీటిల్లో కొన్ని మైలురాళ్లుగానూ నిలుస్తుంటాయి. చంద్రశేఖర పరిమితి అలాంటిదే. మన జీవితం కర్బనం మీద ఆధారపడినప్పటికీ జీవుల మనుగడకు ఇతరత్రా పెద్ద అణువులూ అవసరమే. ఇలాంటి భారీ మూలకాలు పుట్టుకు రావటానికి తోడ్పడే ఏకైక ప్రక్రియ నక్షత్ర విస్ఫోటనం (సూపర్‌నోవా). దీంతో పుట్టుకొచ్చే మూలకాలు విశ్వమంతటా విస్తరిస్తూ.. గ్రహాలు ఏర్పడటానికి, జీవుల పుట్టుకకకు దోహదం చేస్తాయి. నక్షత్రాల భవిష్యత్తు వాటి సైజు మీద ఆధారపడి ఉంటుంది. సూర్యుడంత నక్షత్రాలు చాలాకాలం ప్రశాంతంగానే ఉంటాయి. అంతకన్నా పెద్దవి తెల్ల మరుగుజ్జు (వైట్‌ డ్వార్ఫ్‌) నక్షత్రాలుగా మారిపోతాయి. చిన్నవి వేడిగా ఉన్నా త్వరగా చల్లబడి, మరణిస్తుంటాయి. నక్షత ద్రవ్యరాశి నిర్ణీత పరిమితిని దాటితే విస్ఫోటనానికి దారితీస్తుంది. దీన్నే చంద్రశేఖర పరిమితి అంటారు. ఇది సూర్యుడి ద్రవ్యరాశితో సుమారు 1.4 రెట్లకు సమానం. సుబ్రమణ్యన్‌ చంద్రశేఖర్‌ ఉన్నత చదువుల కోసం ఓడలో ఇంగ్లాండుకు వెళ్తున్నప్పుడే నక్షత్రాల స్థితి, సాపేక్ష సిద్ధాంతం, క్వాంటమ్‌ మెకానిక్స్‌లను రంగరించి దీన్ని గుర్తించారు. అప్పటికి ఆయన వయసు 21 ఏళ్లే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని