అద్భుత పనికరాలు!
కొత్త ఉత్పత్తులతో ఆశ్చర్యంలో ముంచెత్తే అమెజాన్ ప్రతిసారీ ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంది. రోజువారీ పనుల్లో ఉపయోగపడే వినూత్న గ్యాడ్జెట్లతో ఈసారి మరింత విస్మయానికి గురిచేసింది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో
కొత్త ఉత్పత్తులతో ఆశ్చర్యంలో ముంచెత్తే అమెజాన్ ప్రతిసారీ ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంది. రోజువారీ పనుల్లో ఉపయోగపడే వినూత్న గ్యాడ్జెట్లతో ఈసారి మరింత విస్మయానికి గురిచేసింది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన ఇవి గృహ పరికరాల రంగంలో కొత్త చరిత్రను సృష్టించినా ఆశ్చర్యపోనవసరం లేదు.
ఆస్ట్రో ఆసరా!
ఇదో రోబో. చాలా భిన్నమైంది. ఇంటి మీద ఓ కన్నేసి ఉంచటానికి, కుటుంబంతో సన్నిహితంగా మెలగటానికి దీన్ని రూపొందించారు. అలెక్సా చేసే పనులన్నింటినీ ఆస్ట్రో చేస్తుంది. మరి దీని ప్రత్యేకత ఏంటి? ఇది అలెక్సా మాదిరిగా ఒకదగ్గరే ఉండదు. ఇంట్లో మనల్ని వెన్నంటి వస్తుంది. మెట్లు కూడా ఎక్కగలదు! రింగ్ సెన్సర్‌తో (కెమెరా) చుట్టుపక్కల ప్రాంతాలను స్కాన్ చేస్తుంది. ఇంట్లో వదిలిపెడితే ఎంచక్కా కాపలా కాసేస్తుంది. దీనికి 12ఎంపీ కెమెరాతో కూడిన పెరిస్కోప్ ఉంటుంది మరి. ఇది 42 అంగుళాల ఎత్తువరకు లేవగలదు. దీంతో టేబుళ్ల వంటి ఎత్తు ఫర్నిచర్ మీదున్న వస్తువులనూ చూడగలదు. ఆస్ట్రో కెమెరాతో వీడియో కాల్స్ కూడా చేసుకోవచ్చు. అనుసంధానించిన ఫోన్ యాప్ ద్వారా ఇంట్లో ఏం జరుగుతోందో చూడొచ్చు. టెలిస్కోపిక్ గొట్టానికి ఉండే చిన్న మైకులతో మనం చెప్పే ఆదేశాలను ఇట్టే గ్రహిస్తుంది. ఒకసారి ఛార్జింగ్ చేస్తే 2 గంటల సేపు వీడియో కాల్ చేసుకోవచ్చు. చిన్న చిన్న పనులైతే ఇంకాస్త ఎక్కువ సేపే చేసి పెడుతుంది. ఛార్జింగ్ నిండుకుంటుంటే దానంతటదే ఛార్జింగ్ డాక్‌కు వెళ్లిపోతుంది. ఇది సెకనుకు మూడు అడుగుల వేగంతో ముందుకు వెళ్తుంది. దీనికి వెనకవైపున రెండు కిలోల బరువును మోసే ఏర్పాటు కూడా ఉంటుంది. అంటే ఏదైనా వస్తువును దీని మీద పెడితే ఇంట్లో ఎక్కడికైనా తీసుకొచ్చేస్తుందన్నమాట. హద్దులు నిర్ణయిస్తే ఆస్ట్రో ఆ భాగంలోనే సంచరిస్తుంది. వాటిని దాటి బయటకు వెళ్లదు. వద్దనుకుంటే మైకు, కెమెరాలను ఆఫ్ చేసుకోవచ్చు.
గ్లో ప్రకాశం!
ఇంటి నుంచే చదువులు కొనసాగుతున్న తరుణంలో రూపొందించిన పరికరమిది. పేరు గ్లో. నిజానికిదో స్మార్ట్ డిస్ప్లే గ్యాడ్జెట్. దృఢమైన స్టాండ్‌లో పెద్ద ట్యాబ్లెట్ అమరికతో కూడిన ఇందులో ఇన్‌బిల్ట్‌గా ప్రొజెక్టర్, సెన్సర్లు కూడా ఉంటాయి. చూడటానికి పెద్ద సెల్ఫోన్లా కనిపించినప్పటికీ.. దీంతో పెద్దవాళ్లతో పిల్లలు తేలికగా అనుసంధానం కావొచ్చు. పిల్లలకు వీడియో కాల్ చేసినంత మాత్రాన సరిపోతుందా? అమ్మమ్మ, తాతయ్యలతో కలిసి ఆడుకోవాలని ఉండదూ? గ్లోతో అలాంటి కొరత తీరిపోతుంది. ఎక్కడో దూరంగా ఉండే అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్యలతో.. ఆఫీసుకు వెళ్లిన అమ్మానాన్నలతో ఆడుకోవచ్చు, బొమ్మలు గీసుకోవచ్చు. కలిసి పాఠాలు చదువుకోవచ్చు. గ్లో పరికరం ప్రొజెక్టర్ ముందుండే మ్యాట్ మీద ఆయా అంశాలను ప్రొజెక్ట్ చేస్తుంది. అవతలి నుంచి వీడియో కాల్లో మాట్లాడుతున్న పెద్దవాళ్లు ఐఓఎస్‌లోని గ్లో యాప్ లేదా ఆండ్రాయిడ్, కిండిల్ ఫైర్ పరికరాల ద్వారా పిల్లలతో కలిసి ఆయా పనులు చేసుకోవచ్చు. ఉదాహరణకు- తాతయ్య పిల్లలకు కథలను చదివి వినిపించొచ్చు. తాతయ్య అక్కడ్నుంచే పేజీని తిప్పితే ఇక్కడా పేజీ మారిపోతుంది. గ్లో పరికరానికి అడుగున ఉండే ఇన్ఫ్రారెడ్ సెన్సర్ పిల్లల వేళ్లు మ్యాట్ మీద ఎక్కడున్నాయనేది గుర్తిస్తాయి. పిల్లలు ఎవరెవరితో కాంటాక్ట్ అవ్వాలనేది జాబితాలోంచి ఎంచుకోవచ్చు. దీంతో జాబితాలో లేనివారితో సంభాషించటానికి వీలుండదు.
ఎకో చిత్రం!
అటు ఫొటో ఫ్రేమ్. ఇటు టీవీ. ఇలా కళాత్మకంగా రకరకాలుగా అలరించేదే ఎకో షో 15. అన్నింటినీ.. అంటే క్యాలెండర్ అపాయింట్మెంట్లు, స్టికీ నోట్ రిమైండర్లు, షాపింగ్ జాబితాలు ఒకేచోట చూడాలని కోరుకునే వారికోసం దీన్ని రూపొందించారు. చూడటానికి ఫ్రేమ్ మాదిరిగా కనిపించే దీన్ని గోడకు తగిలించుకోవచ్చు. కావాలంటే టేబుల్ మీద అమర్చుకోవచ్చు. పెద్ద తెర ఉండటం వల్ల ఒకేసారి చాలా పనులు చేసుకోవచ్చు. ఉదాహరణకు- ఒకవైపు సినిమా చూస్తూనే మరోవైపు సెక్యూరిటీ కెమెరా దృశ్యాలను పరిశీలించొచ్చు. వంటింట్లో టీవీ మాదిరిగానూ ఉపయోగించుకోవచ్చు. డిజిటల్ ఫ్రేమ్‌గా ఉపయోగించుకోవాలనుకుంటే ల్యాండ్‌స్కేప్ మోడ్‌లోకి మార్చుకుంటే సరి. ముందు భాగాన ఉండే 5ఎంపీ కెమెరాను వీడియో కాల్స్ కోసమూ వాడుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మానవ రోబో దండు!
రోబో అనగానే ఏం గుర్తుకొస్తుంది? లోహ చట్రంతో కదిలే మర యంత్రమో, కదిలే లోహం బొమ్మో మదిలో కదలాడుతుంది. రబ్బరు కండరాలతో చేసినదైతే మనిషి మాదిరిగానూ కనిపిస్తుంది. చూపు, మాట మనిషిని పోలి ఉంటాయి. -
కొత్త సర్ఫేస్ ల్యాప్‌టాప్‌లు
వాణిజ్య అవసరాలను దృష్టిలో పెట్టుకొని మైక్రోసాఫ్ట్ సంస్థ ఏఐ ఆధారిత సర్ఫేస్ ప్రొ 10, సర్ఫేస్ ల్యాప్‌టాప్ 6 పరికరాలను పరిచయం చేసింది. ఇంటెల్ కోర్ అల్ట్రా ప్రాసెసర్‌తో కూడిన ఇవి విండోస్ 11 ప్రొ మీద పనిచేస్తాయి. 5జీ కనెక్టివిటీ కూడా ఉంటుంది. -
జంతువుల రంగుల లోకాన్ని చూపించే కెమెరా
జంతువులు, పక్షులు, తేనెటీగలకు ఈ ప్రపంచం ఏ విధంగా కనిపిస్తుంది? మనం చూసే రంగులు వాటికీ కనిపిస్తాయా? చాలామందికి ఇలాంటి సందేహం వచ్చే ఉంటుంది. -
వాట్సప్ కొత్త ఇమేజ్ ఎడిటర్
వాట్సప్ త్వరలో ఏఐ ఆధారిత కొత్త ఇమేజ్ టూల్‌ను ప్రవేశపెట్టనుంది. ఇది ఫొటోలను తేలికగా ఎడిట్ చేసుకోవటానికి వీలు కల్పిస్తుంది. ఈ ఫీచర్ ఇమేజ్‌లను షేర్ చేసుకునే పేజీలో పైన కనిపిస్తుందని చెబుతున్నారు. -
లాలీపాప్తో నోటి క్యాన్సర్ జాడ
క్యాన్సర్లను నిర్ధరించటానికి కణజాలం నుంచి చిన్న ముక్కను తీసి పరీక్ష చేస్తుంటారు (బయాప్సీ). ఇందుకోసం శరీరానికి కోత పెట్టాల్సి ఉంటుంది. నొప్పి పుడుతుంది. బయాప్సీ చేయటానికి నిపుణులు అవసరం. -
వరదొచ్చే.. వరదొచ్చే.. వారం ముందే అంచనా
కృత్రిమ మేధ (ఏఐ) రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. కంపెనీలు వినూత్న టూల్స్‌ను సృష్టిస్తూ సత్తాను చాటుకోవటానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయంలో గూగుల్ ఇటీవల గొప్ప పురోగతిని సాధించింది. -
ఏఐ వీడియోకు సౌండ్ ట్రాక్ సొబగులూ
ఏఐతో వీడియోలు సృష్టించటం తేలికైపోయింది. ఎలాంటి వీడియో కావాలో పదాల్లో వర్ణిస్తే చాలు. దానికి తగ్గట్టుగా వీడియోలు రూపొందించే ఏఐ వేదికలు చాలానే ఉన్నాయి. -
ఉంగరమే న్యూట్రిషనిస్ట్
సామ్సంగ్ ఇటీవల గెలాక్సీ రింగ్‌ను పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఇది రోజూ తినే ఆహారం విషయంలోనూ సూచనలు ఇవ్వగలదని చెబుతున్నారు. యూజర్ల శరీర ఎత్తు బరువుల నిష్పత్తి (బీఎంఐ) ఆధారంగా ఎన్ని కేలరీల శక్తినిచ్చే ఆహారం తినాలో సూచిస్తుంది. -
paul alexander: ఇనుప ఊపిరితిత్తి!
ఓ పొడవైన పెట్టె. శరీరమంతా అందులోనే. తల మాత్రమే బయటకు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 72 ఏళ్లు అందులోనే గడిపితే? అమెరికాకు చెందిన పాల్ అలెగ్జాండర్ అలాగే గడిపారు -
వాట్సప్‌లో మరిన్ని మెసేజ్‌లు పిన్
వాట్సప్ ప్రియులకు శుభవార్త. ఇకపై ఒకే సమయంలో మూడు కన్నా ఎక్కువ ఛాట్స్, మెసేజ్‌లను పిన్ చేసుకోవచ్చు. కొత్త ఫీచర్లలో భాగంగా వాట్సప్ దీన్ని ఇటీవలే పరిచయం చేసింది. -
మీ అభ్యర్థి చరిత్రేంటి?
మీ నియోజకవర్గం అభ్యర్థి ఎలాంటివారు? నేర చరిత్ర ఏమైనా ఉందా? తెలుసుకోవాలంటే ‘నో యువర్ క్యాండిడేేట్’ (కేవైసీ) యాప్‌లో చూసుకోండి. ప్రధాన ఎన్నికల కమిషనర్ ఇటీవల ఎన్నికల క్రమాన్ని ప్రకటించటంతో పాటు ఈ యాప్‌నూ పరిచయం చేశారు -
గేమింగ్‌లో కృత్రిమ నేస్తం!
ఎక్కడికి, ఎలా దారితీస్తుందో తెలియదు గానీ కృత్రిమ మేధ (ఏఐ) రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఇటీవల వృద్ధుల్లో ఒంటరితనాన్ని పోగొట్టటానికి తోడ్పడే ఏఐ రోబో, పూర్తిస్థాయి ఏఐ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆవిష్కరణ ఆశ్చర్యచకితులను చేస్తే.. తాజాగా ఏఐ గేమింగ్ ఏజెంట్ పుట్టుకొచ్చింది -
గూగుల్ సెర్చ్ తెలివిగా..
స్మార్ట్ఫోన్లలో గూగుల్ సెర్చ్‌ను వాడనివారుండరంటే అతిశయోక్తి కాదు. కానీ తేలికగా, త్వరగా ఆయా అంశాలను శోధించటానికి కొన్ని చిట్కాలు ఉన్నాయనే సంగతి తెలుసా? అలాంటి కొన్ని ఉపాయాల గురించి తెలుసుకుందాం. -
ఏఐ పాట
కృత్రిమమేధ (ఏఐ) సాయంతో కొత్త పాటలను సృష్టించాలని అనుకుంటున్నారా? అయితే సునో ఏఐ (https://www.suno.ai/) సాయం తీసుకోండి. ఇదో ఏఐ మ్యూజిక్ జనరేటర్ వేదిక. -
రియల్మీ నుంచి నార్జో 70 ప్రొ 5జీ ఫోన్లు
రియల్మీ సంస్థ నార్జో 70 ప్రొ 5జీ ఫోన్‌ను పరిచయం చేసింది. ఎయిర్ జెశ్చర్స్ శ్రేణిలో ఇదే తొలి ఫోనని కంపెనీ పేర్కొంటోంది. -
భూగర్భంలో నీరెంత?
భూమి మీద మూడొంతుల మేర ఉండేది నీరే. మరి భూగర్భంలో ఎంత నీరుంటుంది? ఎంతుంటే ఏంటని మనం అనుకుంటామేమో గానీ శాస్త్రవేత్తలు అలా కాదు. -
డ్యూగూ.. సూర్యుడికే అన్న!
డ్యూగూ గ్రహ శకలం సూర్యుడి కన్నా ముందే పుట్టిందా? దీని నమూనాల ప్రాథమిక విశ్లేషణలో ఈ విషయమే వెల్లడైంది. ఇప్పుడిదే ఆశ్చర్యం కలిగిస్తోంది. -
గూగుల్ లెన్స్‌లో సెర్చ్ హిస్టరీ సేవ్
గూగుల్ లెన్స్‌తో ఇమేజ్‌లను వెతికేవారికి శుభవార్త. ఇకపై వెతికిన ఇమేజ్‌లను తేలికగా తెలుసుకోవచ్చు. అవసరమైతే అక్కడి నుంచే డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
గది ఉష్ణోగ్రత వద్దే క్యూబిట్లు స్థిరంగా..
క్వాంటమ్ కంప్యూటింగ్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. సమాచార పరిశీలన, విశ్లేషణ ప్రక్రియలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోంది. -
నిర్ధరణ తీరునూ వివరించే ఏఐ
వైద్యరంగంలో కృత్రిమ మేధ (ఏఐ) రోజురోజుకీ విస్తరిస్తోంది. జబ్బుల నిర్ధరణ దగ్గరి నుంచి చికిత్సలను నిర్ణయించుకోవటం వరకూ ఉపయోగపడుతుంది. -
యాపిల్ పాడ్‌కాస్ట్‌లు అక్షరాల్లో..
పాడ్‌కాస్ట్‌లు ఎంత పాపులర్ అవుతున్నాయో చూస్తూనే ఉన్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకునే యాపిల్ సంస్థ పాడ్‌కాస్ట్‌లను మరింత విస్తృతంగా అందుబాటులోకి తేవటానికి, వాటిల్లోని అంశాలను, విషయాలను తేలికగా కనుక్కోవటానికి ఓ వినూత్న ఫీచర్‌ను ప్రవేశపెట్టింది
తాజా వార్తలు (Latest News)
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ
-
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా