ఎక్కడివీ రహస్య రేడియో సంకేతాలు
అంతరిక్షంలో ఎక్కడో సుదూరాల నుంచి బుద్ధిజీవులు మనతో మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నారా? ఇటీవల భూమి వైపు దూసుకొచ్చిన రేడియో సంకేతాలు ఇలాంటి సందేహమే కలిగిస్తున్నాయి.
అంతరిక్షంలో ఎక్కడో సుదూరాల నుంచి బుద్ధిజీవులు మనతో మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నారా? ఇటీవల భూమి వైపు దూసుకొచ్చిన రేడియో సంకేతాలు ఇలాంటి సందేహమే కలిగిస్తున్నాయి. పాలపుంత కేంద్రం నుంచి వెలువడుతున్న ఇవి శాస్త్రవేత్తలకే ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఏమిటివి? ఎక్కడివి? అనేవీ కొరుకుడు పడటం లేదు. ఏదో గొప్ప ఆవిష్కరణకో, అజ్ఞాత నక్షత్ర వస్తువు ఉనికికో ఇవి దారితీయగలవని భావిస్తున్నారు. మొదట్లో ఈ రేడియో సంకేతాలు ఏదో మృత నక్షత్రం నుంచి వస్తున్నాయని భావించారు. అయితే గతంలో వచ్చిన ఇలాంటి సంకేతాలేవీ వీటికి సరిపోలటం లేదు. అప్పుడప్పుడివి వస్తూ పోతున్నాయని, వీటికి మూలమని అనుకుంటున్న వస్తువు ప్రకాశం గణనీయంగా మారిపోతోందని యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ శాస్త్రవేత్త జిటెంగ్ వాంగ్ చెబుతున్నారు. ఈ రేడియో సంకేతాలు ఒకే దిశలో ప్రయాణిస్తుండటం విచిత్రం. అంటే కాంతి ఒకే వైపునకు అటూఇటూ ఊగిసలాడుతోందన్నమాట. కాకపోతే దీని దిశ సమయాన్ని బట్టి మారిపోతోంది. ప్రతీ కొన్ని వారాలకోసారి 15 నిమిషాల సేపు సంకేతాలు వస్తున్నాయి. గత సంవత్సరం తొమ్మిది నెలల్లో 6 రేడియో సంకేతాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. వస్తూ పోతున్నందున తిరిగి వీటిని గమనించగలమని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు. అదృష్టం కొద్దీ ఈ రేడియో సంకేతాలు వెనక్కి మళ్లిపోయాయి. కానీ వీటికి మూలమైన వస్తువు ప్రవర్తన మాత్రం చాలా వైవిధ్యంగా ఉంటున్నట్టు గుర్తించారు. ఈ సంకేతాలు వారాల కొద్దీ వెలువడినప్పటికీ మూల వస్తువు ఒక్క రోజులోనే కనుమరుగైపోవటం గమనార్హం. ఆస్ట్రేలియన్ స్క్వయర్ కిలోమీటర్ ఆరే పాత్‌ఫైండర్ రేడియో టెలిస్కోప్ (ఏఎస్‌కేఏపీ) ద్వారా అంతరిక్షాన్ని సర్వే చేస్తుండగా ఈ అనూహ్య వస్తువును గుర్తించారు. అనంతరం న్యూసౌత్ వేల్స్‌లోని పార్క్స్ రేడియో టెలిస్కోప్, సౌత్ ఆఫ్రికా రేడియో ఆస్ట్రానమీ అబ్జర్వేటరీకి చెందిన మీర్‌క్యాట్ టెలిస్కోప్‌తో పరిశీలించి సంకేతాల తీరును పసిగట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మెదడులాంటి కంప్యూటర్!
మనిషి మెదడులా పనిచేసే, ఒకే సమయంలో వేర్వేరుగా స్పందించే కంప్యూటర్లను రూపొందించాలని చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. ఈ దిశగా ఇంటెల్ శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు. ప్రపంచంలోనే అతి పెద్ద న్యూరోమార్ఫిక్ కంప్యూటర్ను రూపొందించారు. -
నాచులో నత్రజని ఫ్యాక్టరీ
ప్రకృతిలో బ్యాక్టీరియా, ప్రాణులు ఒకదాని మీద మరోటి ఆధారపడటం (సింబయోటిక్) మామూలే. కానీ ఆ బ్యాక్టీరియా ప్రాణిలో భాగంగా మారితే? శక్తినందించే వనరుగా పరిణమిస్తే? అలాంటి విషయాన్నే శాస్త్రవేత్తలు గుర్తించారు. -
లిథియం బ్యాటరీ పేలకుండా..
ఇప్పుడు లిథియం-అయాన్ బ్యాటరీలు లేని డిజిటల్ పరికరాలను ఊహించుకోలేం. సెల్ఫోన్ల దగ్గరి నుంచి స్మార్ట్‌వాచ్‌ల వరకూ అన్నింటికీ ఇవే ఆధారం. ఐప్యాడ్, మ్యాక్, ఎలక్ట్రిక్ టూత్‌బ్రష్, ట్రిమ్మర్ వంటివీ వీటితోనే పనిచేస్తాయి. -
‘కీప్’ గోయింగ్!
రోజురోజుకీ నోట్-టేకింగ్ యాప్స్‌కు ఆదరణ పెరుగుతోంది. వివిధ ప్రయోజనాలు ఉండటంతో యువత వీటిని ఎక్కువగా వాడుతున్నారు. ఇప్పుడు బోలెడన్ని ఉచిత నోట్ టేకింగ్ యాప్‌లూ అందుబాటులో ఉన్నాయి. -
అణువు మందం బంగారు పొర
బంగారాన్ని పొరలుగా మలచటం తెలుసు. కానీ అతి పలుచటి.. ఆ మాటకొస్తే కేవలం అణువు మందం పొరగా మలచటం చాలా కష్టం. ఇందుకోసం శాస్త్రవేత్తలు చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. -
అమెజాన్ మ్యూజిక్‌లో ఏఐ ప్లేలిస్టు ఫీచర్
సంగీత ప్రియులను ఆకట్టుకోవటానికి మ్యూజిక్ యాప్‌లు కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో కొత్త పుంతలు తొక్కుతున్నాయి. స్పోటిఫై ఇటీవల ప్రీమియం యూజర్ల కోసం ఏఐ ఆధారిత ప్లేలిస్ట్ జనరేటర్‌ను అందుబాటులోకి తెచ్చింది. -
వాట్సప్ ఛాట్ ఫిల్టర్
వాట్సప్ గత కొన్నిరోజులుగా గోప్యతను కాపాడుతూనే ఎన్నో వినూత్న ఫీచర్లు పరిచయం చేస్తోంది. ఎక్కువ మందికి మెటా ఏఐని అందుబాటులోకి తేవటం దగ్గరి నుంచి యాప్ నుంచే బస్ టికెట్లు కొనుక్కోవటానికి వీలు కల్పించటం వరకూ ఎన్నో సదుపాయాలను ఆరంభించింది. -
వెబ్‌లోనూ ట్రూకాలర్
స్మార్ట్ఫోన్లలో ట్రూకాలర్‌ను చాలాకాలంగా వాడుతూనే ఉన్నాం. అజ్ఞాత, స్పామ్ కాల్స్‌ను గుర్తించటానికిది బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడిది వెబ్ బ్రౌజర్ రూపంలోకీ మారింది. -
నక్షత్రాలూ సంచరిస్తాయి!
నక్షత్ర మండలంలో కోట్లాది నక్షత్రాలుంటాయి. సాధారణంగా ఇవి తమ నక్షత్ర మండలానికే పరిమితమవుతాయి. కానీ కొన్ని మాత్రం నక్షత్ర మండలాల మధ్య తిరుగుతుంటాయి. తమ నక్షత్ర మండలం గురుత్వాకర్షణకు కట్టుబడి ఉండవు. -
వెబ్క్యామే స్కానర్
డెస్క్‌టాప్ ఉంది గానీ స్కానర్ లేదా? పోనీ వెబ్‌క్యామ్ అయినా ఉందా? అయితే దీన్నే స్కానర్‌లా వాడుకుంటే సరి. మ్యాక్‌లోనైతే- ఫొటో బూత్‌ను ఓపెన్ చేసి, డాక్యుమెంట్‌ను వెబ్‌క్యామ్ ముందుకు తీసుకురావాలి. -
దైవకణం కథ
అది అన్ని కణాలకూ ద్రవ్యరాశిని సంతరింపజేస్తుంది. దీని గురించి 1960ల్లోనే తెలిసినా 50 ఏళ్ల తర్వాత గానీ ఉనికి బయటపడలేదు. ప్రపంచంలోనే అతి పెద్ద, అతి సంక్లిష్ట యంత్రం సాయం తీసుకుంటే తప్ప అది సాధ్యం కాలేదు. -
జీపీటీ దృష్టి!
టెక్నాలజీ రంగంలో ఇప్పుడు ఛాట్‌జీపీటీ పేరు మార్మోగుతోంది. ఆరంభమైనప్పటి నుంచే సంచలనాలు సృష్టిస్తోంది. రోజురోజుకీ కొత్త పోకడలు పోతోంది. ఆన్లైన్లో టెక్స్ట్‌ను సంగ్రహించి, మథించటంతోనే ఆగిపోలేదు. -
హాయ్ ఐయామ్ నమో ఏఐ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టెక్నాలజీ వాడకంలో ఎప్పుడూ ముందే ఉంటారు. ఆయన వ్యక్తిగత నమో యాప్ గురించి తెలిసిందే. దీనికి తాజాగా కృత్రిమ మేధతో కూడిన నమో ఏఐ ఫీచర్ కూడా జతచేరింది. -
ఆండ్రాయిడ్ పరికరాల్లో సరికొత్త ఫొటో ఎడిటింగ్
డిజిటల్ ప్రపంచం రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ నేపథ్యంలో ఆండ్రాయిడ్ పరికరాలూ కొత్త సొబగులు అద్దుకుంటున్నాయి. వీటికి త్వరలో కొత్త ఏఐ ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. -
రోడ్డు గుంతలను పూడ్చే రోబో
గుంతలు లేని రోడ్లను ఒకసారి తలచుకోండి. ఆ ప్రయాణం ఎంత హాయిగా ఉంటుందో! ఊహించుకుంటేనే ఎంత సంతోషం కలుగుతుందో కదా. అదే నిజమైతే? అది సాకారం కావటం మరెంతో దూరంలో లేదు. -
అశ్లీల బెదిరింపుల వలలో పడకుండా
ఆన్లైన్లో నగ్న చిత్రాలు, వీడియోలతో బెదిరించటాన్ని అడ్డుకోవటానికి ఇన్స్టాగ్రామ్ కొత్తగా న్యూడిటీ ప్రొటెక్షన్ ఫీచర్‌ను ప్రవేశపెట్టనుంది. ఇన్స్టాగ్రామ్ డీఎంలలో ఉండే ఈ ఫీచర్ దానంతటదే నగ్న చిత్రాలను పసిగడుతుంది. -
పాటలు నేర్పే పదనిస
హిందీ పాటలు పాడటం నేర్చుకోవాలని భావిస్తున్నారా? కానీ సమయం దొరకటం లేదని చింతిస్తున్నారా? అయితే పదనిస యాప్‌ను ప్రయత్నించి చూడండి. ప్రముఖ సంగీత కంపెనీ సరిగమ ఇటీవలే దీన్ని తీసుకొచ్చింది. -
ఐఓఎస్ 17.5 పబ్లిక్ బీటా వచ్చింది
ఐఓఎస్ 17.5 పబ్లిక్ బీటా అందుబాటులోకి వచ్చింది. అంటే డెవలపర్ అకౌంట్ లేకపోయినా తాజా ఫీచర్లు, అప్డేట్లను ఎవరైనా ప్రయత్నించొచ్చన్నమాట. ఐఓఎస్ 17.5 స్టేబుల్ వర్షన్ ఇప్పుడప్పుడే వచ్చే అవకాశం కనిపించటం లేదు. -
కాల మహిమ
ఉగాది రోజు పంచాంగం విన్నారా? దీనిలోని తిథులు, రోజులు, పక్షాలు, నెలలు, రుతువులు.. అన్నీ కాల గమన సంకేతాలే. అసలు కాలమంటే ఏంటి? అది ఎలా మొదలైంది? ఇలాగే కొనసాగుతుందా? అంతమవుతుందా? -
సామాజిక వ్యసనం శ్రుతి మించుతోందా?
సామాజిక మాధ్యమాలు వ్యసనంగా మారాయా? దీన్నుంచి బయట పడటానికి ప్రయత్నిస్తున్నారా? అయితే పామ్సీ యాప్ సాయం తీసుకోవచ్చు. -
బహుబలి కెమెరా
అమెరికాలోని ఎస్ఎల్ఏసీ నేషనల్ యాక్సిలేటర్ లేబరేటరీ శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు ప్రపంచంలోనే అత్యంత శక్తిమంత కెమెరాను రూపొందించారు.
తాజా వార్తలు (Latest News)
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్‌లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!