మెసేజ్‌, ఈమెయిళ్లతోనూ కర్బన ఉద్గారాలు

కర్బన ఉద్గారాలు అనగానే ముందుగా వాహనాలు, పరిశ్రమల వంటివే గుర్తుకొస్తాయి. కానీ ఆన్‌లైన్‌ అలవాట్లూ ఇందుకు దోహదం చేస్తాయని తెలుసా? మనం పంపే ప్రతి మెసేజ్‌, ఫొటో, ఈమెయిల్‌.. డౌన్‌లోడ్‌ చేసుకునే ఫొటోలు, వీడియోలన్నీ...

Updated : 03 Nov 2021 05:20 IST

ర్బన ఉద్గారాలు అనగానే ముందుగా వాహనాలు, పరిశ్రమల వంటివే గుర్తుకొస్తాయి. కానీ ఆన్‌లైన్‌ అలవాట్లూ ఇందుకు దోహదం చేస్తాయని తెలుసా? మనం పంపే ప్రతి మెసేజ్‌, ఫొటో, ఈమెయిల్‌.. డౌన్‌లోడ్‌ చేసుకునే ఫొటోలు, వీడియోలన్నీ కర్బన ఉద్గారాలకు కారణమయ్యేవే. కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, మొబైల్‌ ఫోన్లు, వైర్‌లెస్‌ పరికరాలు పనిచేయటానికి, వీటి తయారీకి విద్యుత్తు తప్పనిసరి. మరి విద్యుత్తు తయారీతో వాతావరణంలోకి కార్బన్‌ డయాక్సైడ్‌ విడుదలవుతుంది కదా. అంటే పరికరాల వాడకంతో పరోక్షంగా మనమూ కర్బన ఉద్గారాలకు కారణమవుతున్నామన్నమాట. ఇవి స్వల్ప మొత్తమే అయినా ప్రస్తుతం సుమారు 466 కోట్ల మంది.. అంటే జనాభాలో 60% మంది ఇంటర్నెట్‌ను వాడుతున్నవారే. దీన్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే పెద్దమొత్తమే అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే కర్బన ఉద్గారాల్లో 3.7 శాతం వరకు గ్యాడ్జెట్లు, ఇంటర్నెట్‌, వీటిని సపోర్టు చేసే పరికరాలతో పుట్టుకొస్తున్నట్టు అంచనా. ఇది విమాన పరిశ్రమ వెలువరించే ఉద్గారాలతో దాదాపు సమానం! ఇవి 2025 నాటికి రెట్టింపు కావొచ్చనీ భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు