చిటికెలో స్క్రీన్‌ విభజన

విండోస్‌ 10లో స్ప్లిట్‌ స్క్రీన్‌ చేసుకోవటానికి తేలికైన చిట్కా ఉంది. దీంతో స్క్రీన్‌ మీద ఓపెన్‌ అయి ఉన్న అన్ని ప్రోగ్రామ్‌లను ఒకేసారి చూసుకోవచ్చు. ప్రోగ్రామ్‌ను ఓపెన్‌ చేసి, విండోస్‌ లోగో కీ నొక్కి...

Updated : 18 Aug 2022 14:37 IST

విండోస్‌ 10లో స్ప్లిట్‌ స్క్రీన్‌ చేసుకోవటానికి తేలికైన చిట్కా ఉంది. దీంతో స్క్రీన్‌ మీద ఓపెన్‌ అయి ఉన్న అన్ని ప్రోగ్రామ్‌లను ఒకేసారి చూసుకోవచ్చు. ప్రోగ్రామ్‌ను ఓపెన్‌ చేసి, విండోస్‌ లోగో కీ నొక్కి పట్టుకొని లెఫ్ట్‌ లేదా రైట్‌ ఆరో కీని నొక్కాలి. అంతే ఆ ప్రోగ్రామ్‌ స్ప్లిట్‌ అయ్యి కుడి, ఎడమ వైపునకు వెళ్తుంది. ఓపెన్‌ అయిన ఇతర విండోస్‌తోనూ ఇలాగే చేయొచ్చు. అప్‌, డౌన్‌ యారో గుర్తులను నొక్కి పైకీ, కిందికీ విండోస్‌ను జరుపుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని