టైపింగ్‌.. ఒక వేలితోనే

స్మార్ట్‌ఫోన్‌లో ఒక బొటనవేలితో అంత వేగంగా టైప్‌ చేయటం సాధ్యం కాదు. ఒకట్రెండు పదాలు టైప్‌ చేయగానే రెండు వేళ్లతో టైప్‌ చేయటం ఆరంభిస్తాం. కానీ అన్ని కీస్‌ను వేలు చేరుకుంటే రెండు మూడు...

Updated : 03 Nov 2021 05:32 IST

స్మార్ట్‌ఫోన్‌లో ఒక బొటనవేలితో అంత వేగంగా టైప్‌ చేయటం సాధ్యం కాదు. ఒకట్రెండు పదాలు టైప్‌ చేయగానే రెండు వేళ్లతో టైప్‌ చేయటం ఆరంభిస్తాం. కానీ అన్ని కీస్‌ను వేలు చేరుకుంటే రెండు మూడు అక్షరాలతో కూడిన పదాలు టైప్‌ చేయటం తేలికే. చాలా కీబోర్డుల్లో (ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌) ‘వన్‌ హ్యాండెడ్‌’ మోడ్‌’ అందుబాటులో ఉంటుంది. ఇది కీబోర్డును కుడి లేదా ఎడమ వైపునకు జరిగేలా చేస్తుంది. దీంతో ఒక వేలుతోనే అన్ని అక్షరాలనూ చేరుకోవచ్చు. సాధారణంగా ఐఓఎస్‌ ఫోన్లలో గ్లోబ్‌ గుర్తును నొక్కి, వన్‌ హ్యాండెడ్‌ మోడ్‌ను ఎనేబుల్‌ చేసుకోవచ్చు. అదే ఆండ్రాయిడ్‌ ఫోన్లలో కీబోర్డులను బట్టి ఎనేబుల్‌ ఆప్షన్‌ మారుతుంది. ఉదాహరణకు- గూగుల్‌ కీబోర్డులో కామా కీని నొక్కితే కొన్ని గుర్తులు పాపప్‌ అవుతాయి. ఒక చేయి గుర్తును క్లిక్‌ చేస్తే సింగిల్‌ హ్యాండెడ్‌ మోడ్‌ ఎనేబుల్‌ అవుతుంది. కీబోర్డుకు ఒక వైపున కనిపించే యారో గుర్తు ద్వారా దీన్ని కుడి, ఎడమలకు  జరుపుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని