ఫొటోనే స్టికర్‌గా..

వాట్సప్‌లో స్టికర్ల వాడకం కొత్తేమీ కాదు. వీటినే వాడుకోవాలనేమీ లేదు. మనకు ఇష్టమైన ఫొటోలనూ స్టికర్‌గా మార్చుకొని, పంపుకోవచ్చు. ఈ ఫీచర్‌ ప్రస్తుతానికి వాట్సప్‌ వెబ్‌లోనే అందుబాటులో

Updated : 15 Dec 2021 05:49 IST

వాట్సప్‌లో స్టికర్ల వాడకం కొత్తేమీ కాదు. వీటినే వాడుకోవాలనేమీ లేదు. మనకు ఇష్టమైన ఫొటోలనూ స్టికర్‌గా మార్చుకొని, పంపుకోవచ్చు. ఈ ఫీచర్‌ ప్రస్తుతానికి వాట్సప్‌ వెబ్‌లోనే అందుబాటులో ఉంది. ముందుగా వాట్సప్‌ వెబ్‌ను ఓపెన్‌ చేసి, ఏదైనా ఛాట్‌ను ఎంచుకోవాలి. అటాచ్‌మెంట్‌ గుర్తును నొక్కి స్టికర్స్‌ను ఎంచుకోవాలి. అప్పుడు ఫైల్‌ ఎక్స్‌ప్లోరర్‌ ఓపెన్‌ అవుతుంది. ఇందులోంచి వాట్సప్‌ స్టికర్‌గా మార్చుకోవాలని అనుకుంటున్న ఫొటోను ఎంచుకోవాలి. తర్వాత బాక్స్‌లో మూలలను సరిచేసి, సెండ్‌ యారోను నొక్కాలి. అది స్టికర్‌గా మారి అవతలివారికి చేరుతుంది. దీన్ని మున్ముందు వాడుకోవాలనుకుంటే రైట్‌ క్లిక్‌ ద్వారా సేవ్‌ చేసుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని