వాట్సప్‌లో పెద్ద వీడియోలు షేర్‌ చేయాలంటే?

ఎలాంటి సందేశాన్ని ఇతరులతో పంచుకోవాలన్నా ముందుగా గుర్తొచ్చేది వాట్సప్‌. అయితే దీని ద్వారా మరీ పెద్ద వీడియోలను షేర్‌ చేయటం కుదరదు. ఇందుకోసం గూగుల్‌ డ్రైవ్‌, వీట్రాన్స్‌ఫర్‌ వంటి వాటితో లింక్‌ ద్వారా షేర్‌ చేసుకునే మార్గం లేకపోలేదు.

Updated : 29 Dec 2021 02:02 IST

లాంటి సందేశాన్ని ఇతరులతో పంచుకోవాలన్నా ముందుగా గుర్తొచ్చేది వాట్సప్‌. అయితే దీని ద్వారా మరీ పెద్ద వీడియోలను షేర్‌ చేయటం కుదరదు. ఇందుకోసం గూగుల్‌ డ్రైవ్‌, వీట్రాన్స్‌ఫర్‌ వంటి వాటితో లింక్‌ ద్వారా షేర్‌ చేసుకునే మార్గం లేకపోలేదు. లింక్‌లతో వద్దనుకుంటే వీడియో సైజును తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఇందుకు థర్డ్‌పార్టీ యాప్‌లను ఉపయోగించుకోవచ్చు. వాటిల్లో ఒకటి హ్యాండ్‌బ్రేక్‌ అప్లికేషన్‌. ఇది ఉచితం కూడా. ముందుగా వీడియోను కంప్యూటర్‌లోకి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. తర్వాత https://handbrake.fr లోకి వెళ్లి, పీసీలో హ్యాండ్‌బ్రేక్‌ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. తర్వాత ఫోల్డర్‌లో వీడియో ఫైలును ఎంచుకొని, ప్రీసెట్స్‌ మీద కిందికి చూపించే బాణం గుర్తును క్లిక్‌ చేయాలి. వెబ్‌-జీమెయిల్‌ లార్జ్‌ 3 మినిట్స్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఇది వీడియోను మూడు నిమిషాల నిడివి ఉండేలా ఎన్‌కోడ్‌ చేసి, సైజు తగ్గిస్తుంది. స్టార్ట్‌ బటన్‌ను నొక్కగానే ఎన్‌కోడింగ్‌ మొదలవుతుంది. సైజు తగ్గాక వాట్సప్‌ వెబ్‌ ద్వారా వీడియోను షేర్‌ చేసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని