‘లైట్‌’గా వస్తోంది

బడ్జెట్‌ ఫోన్‌లతో వినియోగదారుల్ని ఎప్పటి నుంచో ఆకట్టుకుంటున్న షామీ ‘ఎంఐ 11 లైట్‌’ని త్వరలో మార్కెట్‌లోకి తేనుంది. భిన్నమైన ట్రిపుల్‌ కెమెరా సెటప్‌తో తీర్చిదిద్దారు.

Updated : 24 Feb 2021 17:31 IST

బడ్జెట్‌ ఫోన్‌లతో వినియోగదారుల్ని ఎప్పటి నుంచో ఆకట్టుకుంటున్న షామీ ‘ఎంఐ 11 లైట్‌’ని త్వరలో మార్కెట్‌లోకి తేనుంది. భిన్నమైన ట్రిపుల్‌ కెమెరా సెటప్‌తో తీర్చిదిద్దారు. అంచుల వరకూ తాకేతెరతో పంచ్‌-హోల్‌ డిస్‌ప్లేతో కనిపిస్తోంది. తెర పరిమాణం 6.7 అంగుళాలు. రిజల్యూషన్‌ 1080*2400 పిక్సల్స్‌. ‘సైడ్‌-మౌంటెడ్‌’ ఫింగర్‌ప్రింట్‌ సెన్సర్‌ మరో ప్రత్యేకత. కెమెరాల విషయానికొస్తే.. వెనక మూడు కెమెరాల (64ఎంపీ, 8ఎంపీ, 5ఎంపీ) సెట్‌ ఉంది. సెల్ఫీ కెమెరా సామర్థ్యం 16ఎంపీ. ర్యామ్‌ 6జీబీ. 128 జీబీ వరకూ ఎక్స్‌టర్నల్‌ స్టోరేజ్‌ సపోర్టు ఉంది.
అంచనా ధర: రూ.25,000

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని