సిగ్నల్‌.. ఇస్తున్నారా? 

రికార్డు స్థాయిలో యూజర్లు లేరు.. ఇతర మెసెంజర్లకు పోటీ¨ కాదు.. అయినా ఇప్పుడు ఎక్కువ మంది నోట వినిపిస్తున్న మాట ‘సిగ్నల్‌’. అందుకు కారణం ఒక్కటే. ‘ప్రైవసీ..’ యూజర్ల ప్రైవసీకే అధిక ప్రాధాన్యతనిస్తూ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. వినియోగదారుల

Updated : 24 Feb 2021 16:50 IST

వాడి చూద్దురూ!

రికార్డు స్థాయిలో యూజర్లు లేరు.. ఇతర మెసెంజర్లకు పోటీ¨ కాదు.. అయినా ఇప్పుడు ఎక్కువ మంది నోట వినిపిస్తున్న మాట ‘సిగ్నల్‌’. అందుకు కారణం ఒక్కటే. ‘ప్రైవసీ..’ యూజర్ల ప్రైవసీకే అధిక ప్రాధాన్యతనిస్తూ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. వినియోగదారుల డేటాని ఏ రకంగానూ యాక్సెస్‌ చేసేందుకు వీలు లేకుండా పూర్తి ఎన్‌క్రిప్షన్‌ మోడ్‌లో ఛాట్‌ కమ్యూనికేషన్‌ని సాగిస్తోంది. ఓపెన్‌సోర్స్‌ కమ్యూనిటీతో చక్కని ప్రైవసీ ఫీచర్లను అందిస్తున్న సిగ్నల్‌లోని చిట్కాల సంగతులేంటో తెలుసుకుందాం. ఒకవేళ మీరు ఇప్పుడిప్పుడే ‘సిగ్నల్‌’ వేసేందుకు ప్రయత్నిస్తున్నట్లయితే వీటిని ప్రయత్నించి చూడండి.
మెసేజ్‌లు మాయం
సిగ్నల్‌ సంభాషణల్ని సురక్షితంగా ఎప్పటికప్పుడు ఆటోమేటిక్‌గా  మాయం అయ్యేలా చేయొచ్చు. దీంట్లోని ప్రత్యేక ప్రైవసీ ఆప్షన్‌ కూడా ఇదే. దీన్ని ఎనేబుల్‌ చేసేందుకు ఏదైనా కాంటాక్ట్‌ని ఓపెన్‌ చేయండి. పై భాగంలో కుడివైపు కనిపించే మూడు చుక్కల ఆప్షన్‌ని సెలెక్ట్‌ చేయాలి. వచ్చిన డ్రాప్‌డౌన్‌ మెనూలోని
Disappearing Messages ఆప్షన్‌ని తాకగానే.. నిర్ణీత సమయాలతో కూడిన మెనూ వస్తుంది. 5 సెకన్లు, 10 సెకన్లు.. రెండింటిలో మీకు తగిన సమయాన్ని సెలెక్ట్‌ చేయాలి. 5 సెకన్లు ఎంచుకుంటే చూసిన వెంటనే సంభాషణలు మాయం అయిపోతుంటాయి.
ఒక్కసారే చూసేలా..
చూసిన వెంటనే మెసేజ్‌లు ఎలా ఆటోమేటిక్‌గా డిలీట్‌ అవుతున్నాయో.. అదే మాదిరిగా పంపిన ఇమేజ్‌లు కూడా చూసిన మరుక్షణం తొలగిపోతే. అందుకు సిగ్నల్‌లో ఓ ట్రిక్‌ ఉంది. దానికి ఏం చేయాలంటే.. పంపుదామనుకునే ఫొటోని సెలెక్ట్‌ చేసుకున్నాక, కింది భాగంలో ఎడమవైపు కనిపించే 
infinite icon ట్యాప్‌ చేయండి. దీంతో అది ‘1ఎక్స్‌’గా మారుతుంది. అప్పుడు ఇమేజ్‌ని పంపాలి. దీంతో ఫొటోని రిసీవ్‌ చేసుకున్న వ్యక్తి ఒక్కసారి ఫొటోని ఓపెన్‌ చేసి చూశాక ఆటోమేటిక్‌గా తొలగిపోతుంది.
మీకు మీరే పంపుకోవచ్చు
ఇప్పటికే మీరు వాట్సాప్‌ వాడుతున్నట్లయితే.. ఏదైనా ముఖ్యమైన సమాచారాన్ని వాట్సాప్‌లోనే నోట్‌ చేసుకునేందుకు ఏం చేస్తున్నారు? వాడుతున్న మీ నెంబర్‌తోనే గ్రూపు క్రియేట్‌ చేసుకుంటారు. దాంట్లోనే షేర్‌ చేస్తుంటారు. ఇంత పెద్ద తతంగం సిగ్నల్‌ మెసెంజర్‌లో అక్కర్లేదు. ఎందుకంటే.. నోట్స్‌ రాసుకునేందుకు
 Note to Self  ఆప్షన్‌ ఉంది. మొదటిసారి మీరు నోట్స్‌ రాసుకుందాం అనుకున్నప్పుడు కాంటాక్ట్‌ సెర్చ్‌లో ‘నోట్‌ టూ సెల్ఫ్‌’ ఆప్షన్‌ని వెతకాలి. తర్వాత సెలెక్ట్‌ చేసి నోట్స్‌ రాసుకుని సెండ్‌ చేయొచ్చు.
స్క్రీన్‌షాట్‌ రాదు
ఫోన్‌లో అవసరమైన వాటిని స్క్రీన్‌షాట్‌ తీయడం తెలిసిందే. అలాగే మెసెంజర్‌లోనూ మీ ప్రమేయం లేకుండా ఏదైనా కంటెంట్‌ని స్క్రీన్‌షాట్‌ తీసే అవకాశం లేకపోలేదు. కానీ, సిగ్నల్‌ మెసెంజర్‌లో ఇది కుదరదు. ఎందుకంటే.. స్క్రీన్‌షాట్‌ సౌకర్యాన్ని డిసేబుల్‌ చేయొచ్చు. ‘ప్రొఫైల్‌ ఐకాన్‌’పై ట్యాప్‌ చేసి ‘ప్రైవసీ’లోకి వెళ్లండి. వచ్చిన మెనూలో ‘స్క్రీన్‌ సెక్యూరిటీ’ ఆప్షన్‌ కనిపిస్తుంది. అది డీఫాల్ట్‌గా ఎనేబుల్‌ అయ్యి ఉంటుంది. సింపుల్‌గా డిసేబుల్‌ చేయండి చాలు. దీంతో యాప్‌లోని కంటెంట్‌ని ఎవరూ స్క్రీన్‌షాట్‌ తీయలేరు.
‘బ్లర్‌’ చేయొచ్చు
మెసెంజర్‌లలో నిత్యం ఏవేవో ఫొటోలు షేర్‌ చేస్తుంటాం. అలాంటప్పుడు ఫొటోల్లో కొన్ని ముఖాల్ని కనిపించకుండా చేయాలంటే? ఉదాహరణకు గ్రూపు ఫొటోలు ఎవరికైనా పంపుతున్నప్పుడు ఆ గ్రూపులో ఉన్న మీ ముఖాన్ని కనిపించకుండా చేయడం సిగ్నల్‌ మెసెంజర్‌లో సాధ్యమే. అదెలాగంటే.. పంపాల్సిన ఫొటోని ఎంపిక చేసుకున్నాక పై భాగంలో కనిపించే ‘బ్లర్‌’ ఆప్షన్‌ని సెలెక్ట్‌ చేయాలి. ఒకవేళ ముఖాన్ని సాఫ్ట్‌వేర్‌ గుర్తించలేకుంటే మాన్యువల్‌గా బ్లర్‌ ఆప్షన్‌ని వాడి కనిపించకుండా చేయొచ్చు.
అవి కనిపించకూడదంటే?
మెసెంజర్‌లో ఏదైనా మెసేజ్‌ వస్తే పంపిన వ్యక్తితో పాటు మెసేజ్‌ కూడా నోటిఫికేషన్‌లో కనిపిస్తుంది. జనరల్‌ సెట్టింగ్స్‌లో సిగ్నల్‌ యాప్‌ ఉన్నప్పుడు మాత్రమే ఇలా నోటిఫికేషన్స్‌ని చూడొచ్చు. అలాంటప్పుడు ప్రైవసీ సమస్య కచ్చితంగా వస్తుంది. దీన్ని అధిగమించేందుకు నోటిఫికేషన్స్‌ని కావాల్సినట్టుగా మార్చుకోవచ్చు. కేవలం మెసేజ్‌ పంపిన వ్యక్తి పేరు మాత్రమే కనిపించేలా చేయొచ్చు. ఫోన్‌ని అన్‌లాక్‌ చేసినా చూడలేరు. సిగ్నల్‌ యాప్‌ని ఓపెన్‌ చేస్తేనే మెసేజ్‌ కనిపిస్తుంది. సెట్టింగ్స్‌ని మార్చేందుకు ‘ప్రొఫైల్‌ ఐకాన్‌’ని సెలెక్ట్‌ చేసి ‘నోటిఫికేషన్స్‌’లోకి వెళ్లాలి. జాబితాలో ఉన్న ‘షో’ ఆప్షన్‌ని సెలెక్ట్‌ చేసి
Name only బటన్‌ని చెక్‌ చేయాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని