నెట్‌ఫ్లిక్స్‌లో ‘టైమర్‌’

సమయం చిక్కితే చాలు. పగలు, రేయి తేడా లేకుండా వెబ్‌ సిరీస్‌లు చూసేస్తున్నారా? కొన్ని సార్లు చూస్తూ.. చూస్తూనే నిద్రలోకి జారుకుంటున్నారా? ఏ ఎపిసోడ్‌ ఎక్కడికి వరకూ చూశారో గుర్తుకు రావడం లేదా? అంతేకాదు.. అపరిమితం అవుతున్న షో టైమ్‌కి బ్రేక్‌ పెట్టుకోవాలనుకుంటున్నారా?

Updated : 24 Feb 2021 17:11 IST

సమయం చిక్కితే చాలు. పగలు, రేయి తేడా లేకుండా వెబ్‌ సిరీస్‌లు చూసేస్తున్నారా? కొన్ని సార్లు చూస్తూ.. చూస్తూనే నిద్రలోకి జారుకుంటున్నారా? ఏ ఎపిసోడ్‌ ఎక్కడికి వరకూ చూశారో గుర్తుకు రావడం లేదా? అంతేకాదు.. అపరిమితం అవుతున్న షో టైమ్‌కి బ్రేక్‌ పెట్టుకోవాలనుకుంటున్నారా? అలాగైతే.. నెట్‌ఫ్లిక్స్‌లో ‘టైమర్‌’ని పెట్టుకోవచ్చు. నిద్ర ముంచుకొస్తున్న సమయంలోనూ వెబ్‌ సిరీస్‌ చూస్తున్న క్రమంలో ఈ స్లీప్‌ టైమర్‌ని పెట్టుకోవచ్చు. ఆండ్రాయిడ్‌ యూజర్లకు అప్‌డేట్‌ రూపంలో ఈ సౌకర్యాన్ని ప్రయోగాత్మకంగా అందిస్తోంది నెట్‌ఫ్లిక్స్‌. దీంతో ఎపిసోడ్‌ ప్రారంభం అవ్వగానే ప్లేయర్‌లో కనిపించే టైమర్‌ని సెట్‌ చేసుకోవచ్చు. 15 నిమిషాలు మొదలుకుని.. 25, 45 నిమిషాల్లో టైమర్‌ని పెట్టుకోవచ్చు. అంటే.. ఒకవేళ ఎపిసోడ్‌ చూస్తూ నిద్రలోకి జారుకుంటే పెట్టుకున్న టైమర్‌ తెరపై కనిపిస్తుంది. 5 సెకన్లలో టైమర్‌ని ఆపకుంటే ప్లే అవుతున్న వీడియో ఆగిపోతుంది. ఒకవేళ మీరు మెలకువగా ఉంటే టైమర్‌ని ఎప్పటికప్పుడు పొడిగించుకోవచ్చు. టైమర్‌తో స్ట్రీమింగ్‌ని ఆపడంతో పాటు ఫోన్‌ బ్యాటరీని ఆదా చేయొచ్చు. దీంతో పాటు డేటానీ  పదిలంగా వాడుకున్నట్టే!
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని