కారు పార్కింగ్‌ శోధనకూ గూగుల్‌ మ్యాప్స్‌

గూగుల్‌ మ్యాప్స్‌. ఎక్కడికి వెళ్లాలన్నా సరైన దారిని తెలుసుకోవటానికి ఇప్పుడు అంతా దీన్నే వాడుకుంటున్నారు. త్వరగా చేరుకోవటానికి వీలైన దారినీ ఇది చూపిస్తుంది. ఇవే కాదు, దీన్ని ఇతరత్రా పనులకూ ఉపయోగించుకోవచ్చు.

Updated : 19 Jan 2022 05:47 IST

గూగుల్‌ మ్యాప్స్‌. ఎక్కడికి వెళ్లాలన్నా సరైన దారిని తెలుసుకోవటానికి ఇప్పుడు అంతా దీన్నే వాడుకుంటున్నారు. త్వరగా చేరుకోవటానికి వీలైన దారినీ ఇది చూపిస్తుంది. ఇవే కాదు, దీన్ని ఇతరత్రా పనులకూ ఉపయోగించుకోవచ్చు. ఈసారి మీరు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు గూగుల్‌ మ్యాప్స్‌ను మరింత విభిన్నంగా వాడుకోవటానికి ప్రయత్నించి చూడండి.

* ఇష్టమైన హోటళ్లను వెతకటం: ఎక్కడికో వెళ్లారు. బాగా ఆకలేస్తోంది. దగ్గర్లో హోటళ్లను గూగుల్‌ మ్యాప్స్‌లో వెతికారు. కానీ అక్కడ మనకు ఇష్టమైన ఆహారం ఉంటుందా? దీన్ని తెలుసుకోవటానికి యాప్‌లో సెటింగ్స్‌ మార్చుకుంటే పని తేలికైపోతుంది. సెటింగ్స్‌ ద్వారా ‘ఫుడ్‌ అండ్‌ డ్రింక్‌ ప్రిఫరెన్స్‌’లోకి వెళ్లాలి. డయటరీ మీద క్లిక్‌ చేయాలి. అందులో శాకాహారం, మాంసాహారం.. ఇలా రకరకాల ఆప్షన్లు కనిపిస్తాయి. వీటిల్లో ఇష్టమైనది ఎంచుకొని సెర్చ్‌ చేస్తే సరి.

* కారు పార్కింగ్‌ చేసిన చోటు: ఏదో జాతరకు వెళ్లారు. అంతా సందడి సందడిగా ఉంది. ముందుకు వెళ్లే అవకాశం లేదు. కారును ఎక్కడో ఒకచోట పార్క్‌ చేశారు. తిరిగి వచ్చాక కారు ఎక్కడ పెట్టామా తెలియటం లేదు. ఎంతసేపని వెతికేది? గూగుల్‌ మ్యాప్స్‌ సాయం తీసుకుంటే సరి. ఇందుకోసం ముందుగానే అంటే కారును పార్క్‌ చేసినప్పుడే యాప్‌లో మనం ఎక్కడ ఉన్నదీ చెప్పే బ్లూ పిన్‌ను ట్యాప్‌ చేయాలి. దీన్ని పార్కింగ్‌ లొకేషన్‌గా సేవ్‌ చేసుకోవాలి. తిరిగి వచ్చాక ఈ పిన్‌ సాయంతో కారు దగ్గరకు తేలికగా చేరుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని