స్వచ్ఛమైన గాలితో పాటు.. 

కొవిడ్‌ని అడ్డుకోవాలంటే మాస్క్‌ ధరించాలి.. సామాజిక దూరం పాటించాలి. ఈ క్రమంలో మాస్క్‌ల్ని తప్పక ధరిస్తున్నాం. కానీ, ఫోన్‌ మాట్లాడేటప్పుడో.. ఎదుటివారు ముఖాన్ని గుర్తించలేప్పుడో.. మరేవైనా ఇతర కారణాలతో మాస్క్‌లను తీసి

Updated : 24 Feb 2021 16:52 IST

సందర్భం

కొవిడ్‌ని అడ్డుకోవాలంటే మాస్క్‌ ధరించాలి.. సామాజిక దూరం పాటించాలి. ఈ క్రమంలో మాస్క్‌ల్ని తప్పక ధరిస్తున్నాం. కానీ, ఫోన్‌ మాట్లాడేటప్పుడో.. ఎదుటివారు ముఖాన్ని గుర్తించలేప్పుడో.. మరేవైనా ఇతర కారణాలతో మాస్క్‌లను తీసి పెడుతుంటాం. ఈ సమస్యకి ‘ఎయిర్‌సేఫ్‌’ ఫేస్‌షీల్డ్‌తో చెక్‌ పెట్టొచ్చు. తలకి సౌకర్యంగా ధరించేలా దీన్ని తీర్చిదిద్దారు. ముఖం స్పష్టంగా కనిపించేలా రెండు రకాల షీల్డ్‌లను ఏర్పాటు చేశారు. ఇతరులతో బాగా దగ్గరగా మాట్లాడాల్సివస్తే ఒకటి.. దూరంగా ఉన్నప్పుడు మరోటి పెట్టుకోవచ్చు. దీంట్లోని అసలైన శాస్త్ర, సాంకేతిక ప్రయోగం ఏంటో తెలుసా? గాలిని శుద్ధి చేసే ఫిల్టర్లు. వెనక భాగంలో ఏర్పాటు చేసిన ఫిల్టర్‌ సిస్టమ్‌, ఫ్యాన్లు బయటి గాలిని తీసుకుని ఫిల్టర్లతో స్వచ్ఛంగా మార్చేసి ముందు భాగానికి పంపుతాయి. హెల్మెట్‌లోని బ్యాటరీలను ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే ఐదు గంటలు పని చేస్తాయి. తక్కువ బరువుతో కూడిన దీన్ని తేలికగా తగిలించుకోవచ్చు. ఏవైనా తినాలన్నా, తాగాలన్నా ‘హాఫ్‌ షీల్డ్‌’ని సెట్‌ చేసుకుని మార్చుకోవచ్చు, ఇలా హెల్మెట్‌ని తీయకుండానే అవసరమైన పనులు చేసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని