శుక్రుడి మేఘాల్లో జీవం లేదు

శుక్రుడి మేఘాల్లో జీవం ఉండొచ్చనే ఆశలు నీరుగారాయి. అక్కడి మేఘాల్లో జీవుల పుట్టుకకు అవసరమైనంత నీటి ఆవిరి లేనే లేదని యూరప్‌, అమెరికా శాస్త్రవేత్తలు తేల్చేశారు.

Updated : 07 Jul 2021 05:27 IST

శుక్రుడి మేఘాల్లో జీవం ఉండొచ్చనే ఆశలు నీరుగారాయి. అక్కడి మేఘాల్లో జీవుల పుట్టుకకు అవసరమైనంత నీటి ఆవిరి లేనే లేదని యూరప్‌, అమెరికా శాస్త్రవేత్తలు తేల్చేశారు. శుక్ర గ్రహం మీద సల్ఫ్యూరిక్‌ ఆమ్లంతో కూడిన మేఘాల్లో చిత్రమైన, చిన్న జీవులు దాగుండే అవకాశముందని గత సెప్టెంబరులో కొందరు శాస్త్రవేత్తలు ప్రకటించటం ఆశలు రేపింది. ఇది నిజమో కాదో తెలుసుకోవటానికి ఇటీవల ఉపగ్రహ చిత్రాల ద్వారా నిశితంగా పరిశీలించారు. భూమి మీదిలాంటి జీవుల ఉనికికి అవసరమైనదాంతో పోలిస్తే అక్కడి మేఘాల్లో 100 రెట్లు తక్కువ నీరున్నట్టు బయటపడింది. అంటే జీవుల పుట్టుకకు అక్కడ ఆస్కారమే లేదన్నమాట.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని