130 కోట్ల టన్నులు!

ప్రపంచవ్యాప్తంగా ఏటా ఎంత ఆహారం వ్యర్థమవుతోందో తెలుసా? సుమారు 130 కోట్ల టన్నులు! మొత్తం పండిన ఆహార పంటల్లో మూడో వంతు ఇలా నిరుపయోగకరంగా, వ్యర్థంగానే మారిపోతోంది. ఇది కుళ్లిపోతున్న కొద్దీ భూతాపాన్ని పెంచే వాయువులు పెద్ద మొత్తంలో విడుదలవుతాయి.

Updated : 17 Nov 2021 00:59 IST

ప్రపంచవ్యాప్తంగా ఏటా ఎంత ఆహారం వ్యర్థమవుతోందో తెలుసా? సుమారు 130 కోట్ల టన్నులు! మొత్తం పండిన ఆహార పంటల్లో మూడో వంతు ఇలా నిరుపయోగకరంగా, వ్యర్థంగానే మారిపోతోంది. ఇది కుళ్లిపోతున్న కొద్దీ భూతాపాన్ని పెంచే వాయువులు పెద్ద మొత్తంలో విడుదలవుతాయి. అంటే మనం వంటకాలను కాదు.. భూమాతనే వండేస్తున్నామన్నమాట. ఆహారాన్ని వ్యర్థం చేయొద్దని తెలిసినా ఎందుకు పారేస్తున్నారు? దీనికి కారణాలేంటి? వీటిని తెలుసుకోవటానికీ ఎన్నో పరిశోధనలు జరిగాయి. ఏం కొనాలన్నది ముందే నిర్ణయించుకోకుండా, ఎడాపెడా అనవసరమైనవీ కొనటమే అన్నింటికన్నా పెద్ద కారణమని పరిశోధనలు చెబుతున్నాయి. సరిగా వంట చేయలేకపోవటం (మాడ్చేయటం వంటివి), అవసరమైన దాని కన్నా ఎక్కువెక్కువగా వండటం కూడా పెద్ద కారణాలుగానే నిలుస్తున్నాయి. కాబట్టి కొనేముందు, వండేముందు జాగ్రత్త అవసరం. వర్థ్యాలను నిలువరిస్తే మన భూమినీ కాపాడుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని