నీటి కింద రహదారి!

సరస్సులు అడ్డున్నాయని జాతీయ రహదారులు ఆగిపోతాయా ఏం? అవసరమైతే నీటి అడుగు నుంచీ ముందుకు సాగుతాయి. చైనాలో ఇటీవల ఆరంభమైన పొడవాటి సొరంగ జాతీయ రహదారే దీనికి ఉదాహరణ. దీని పేరు తైహు సొరంగం. ఇంజినీరింగ్‌ అద్భుతానికి చిహ్నమైన ఇది తైహు సరస్సు కింది నుంచి సాగుతుంది.

Updated : 19 Jan 2022 05:41 IST

సరస్సులు అడ్డున్నాయని జాతీయ రహదారులు ఆగిపోతాయా ఏం? అవసరమైతే నీటి అడుగు నుంచీ ముందుకు సాగుతాయి. చైనాలో ఇటీవల ఆరంభమైన పొడవాటి సొరంగ జాతీయ రహదారే దీనికి ఉదాహరణ. దీని పేరు తైహు సొరంగం. ఇంజినీరింగ్‌ అద్భుతానికి చిహ్నమైన ఇది తైహు సరస్సు కింది నుంచి సాగుతుంది. పొడవెంతో తెలుసా? 10.79 కిలోమీటర్లు. నిర్మాణానికి నాలుగేళ్లు పట్టింది. సుమారు 20 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటును వాడారు. సొరంగమంటే ఇరుకుగా ఉంటుందని అనుకుంటున్నారేమో. ఆరు వరుసల్లో వాహనాలు ప్రయాణించటానికి వీలైన దీని వెడల్పు 17.5 మీటర్లు. వాహనాలు నడిపేవారికి అలసట రాకుండా సొరంగం కప్పునకు రంగు రంగుల ఎల్‌ఈడీ దీపాలనూ అలంకరించారు. ఇలాంటి నీటి అడుగు సొరంగ జాతీయ రహదారులు ప్రపంచంలో చాలానే ఉన్నాయి. ప్రపంచంలో అన్నింటికన్నా పొడవైన సొరంగ జాతీయ రహదారి నార్వేలోని రైఫాస్ట్‌ టన్నెల్‌. దీని పొడవు 14.3 కిలోమీటర్లు. ఇక జపాన్‌లోని టోక్యో బే అక్వా లైన్‌లో భాగమైన సొరంగ జాతీయ మార్గం పొడవు 9.6 కిలోమీటర్లు. నీటి కింది సొరంగ మార్గాల్లో గొప్పగా చెప్పుకోదగింది ఛానెల్‌ టన్నెట్‌. ఇది రైలు ద్వారా ఇంగ్లాండ్‌, ఫ్రాన్స్‌ దేశాలను కలుపుతుంది. ఇంగ్లిష్‌ ఛానెల్‌ కిందుగా సాగే ఇది 37.9 కిలోమీటర్ల వరకు నీటి అడుగుననే ఉంటుంది. నీటి కింది సొరంగాల్లో ప్రపంచంలో అతి పొడవైనది ఇదే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని