మట్టితో మీథేన్‌కు చెక్‌

భూతాపం విషయంలో కార్బన్‌ డయాక్సైడ్‌ కన్నా మీథేన్‌ ఎక్కువ హాని కలిగిస్తుంది. కాబట్టే మీథేన్‌ ఉద్గారాలను తగ్గించటపై ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ దిశగా మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ పరిశోధకులు జియోలైట్‌ అనే మట్టితో తేలికైన, చవకైన పరిష్కార మార్గాన్ని కనుగొన్నారు.

Updated : 19 Jan 2022 05:35 IST

భూతాపం విషయంలో కార్బన్‌ డయాక్సైడ్‌ కన్నా మీథేన్‌ ఎక్కువ హాని కలిగిస్తుంది. కాబట్టే మీథేన్‌ ఉద్గారాలను తగ్గించటపై ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ దిశగా మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ పరిశోధకులు జియోలైట్‌ అనే మట్టితో తేలికైన, చవకైన పరిష్కార మార్గాన్ని కనుగొన్నారు. ఇది గాలిలోంచి మీథేన్‌ వాయువును ఒడిసి పట్టటానికి తోడ్పడుతుంది. వ్యవసాయ వ్యర్థాలను కాల్చటం, పాడి పరిశ్రమ.. బొగ్గు, ఖనిజాల తవ్వకం.. చమురు, వాయువుల వెలికితీత వంటి రకరకాల మార్గాల ద్వారా మీథేన్‌ వాతావరణంలో కలుస్తుంది. అందుకే దీన్ని వాతావరణంలోంచి సంగ్రహించటంపై పరిశోధకులు దృష్టి సారించారు. జియోలైట్‌కు కొంత రాగిని కలిపి, దీన్ని ఒక గొట్టంలో కూర్చి బయటి నుంచి వేడి చేశారు. తర్వాత మండటానికి వీల్లేనంత స్థాయిలో మీథేన్‌ వాయువును గొట్టంలోకి పంపించారు. దీన్ని జియోలైట్‌, రాగి మిశ్రమం సమర్థంగా గ్రహిస్తున్నట్టు గుర్తించారు. గాలిలో తక్కువ మోతాదులో మీథేన్‌ ఉన్నా ఇది బాగా పనిచేస్తుండటం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని