మీ మొబైల్‌లో Google keeps stopping అని వస్తోందా?

Xiaomi Mobiles Issue: ఆ సమస్యను ఇలా ఫిక్స్‌ చేయొచ్చు...

Updated : 23 Jun 2021 08:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్మార్ట్‌ఫోన్లు వచ్చాక ఇంటర్నెట్‌ వినియోగం బాగా పెరిగిపోయింది. అయితే కొంతమంది ఆండ్రాయిడ్‌ యూజర్లకు కొత్త సమస్య వచ్చి పడింది. మరీ ముఖ్యంగా ఎంఐ, రెడ్‌మీ ఉపయోగించేవారి స్మార్ట్‌ఫోన్లలో ఒక బగ్‌ తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నట్లు నిపుణులు గుర్తించారు. గూగుల్‌ యాప్స్‌ క్రాష్‌ అవుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. అలాంటి సమస్య మీకూ వచ్చిందా?

గూగుల్‌ యాప్స్‌ను ఓపెన్‌ చేసిన కొంత సమయానికి ‘గూగుల్‌ కీప్స్‌ స్టాపింగ్‌’ అనే ఎర్రర్‌ వచ్చి ఆగిపోతుంది. గూగుల్‌ సర్వీసెస్‌ వల్ల అంతరాయం కలుగుతోందా..? షావోమీ ఫోన్లలో ఏమైనా బగ్‌ ప్రభావం ఉందేమో తెలియని పరిస్థితి. రెండు సంస్థల నుంచి అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సిందే. ఎక్స్‌డీఏ డెవలపర్స్‌ చెబుతున్న వివరాల ప్రకారం.. గూగుల్‌ యాప్‌ కొత్త అప్‌డేట్‌ వల్ల క్రాష్‌ సమస్య వచ్చినట్లు తెలుస్తోంది. కాబట్టి మీరూ దీనికి గురయివుంటే ఉంటే ఈ ప్రాబ్లమ్‌ను ఫిక్స్‌ చేసేందుకు కొన్ని మార్గాలు.. 

* మీ ఫోన్‌లోని సెట్టింగ్స్‌ను ఓపెన్‌ చేయండి

* అప్లికేషన్‌/యాప్స్‌ ఆప్షన్‌కు వెళ్లండి

* ‘గూగుల్‌ యాప్స్‌’ ఆప్షన్‌కు వెళ్లాలి. త్రీ డాట్స్‌ను క్లిక్‌ చేయండి

* లేటెస్ట్‌ అప్‌డేట్‌కు సంబంధించిన విషయం కాబట్టి.. ‘అన్‌ఇన్‌స్టాల్‌ అప్‌డేట్‌’ అని వస్తుంది. దానిని క్లిక్‌ చేయాలి

* అప్పుడు పాత్‌ అప్‌డేట్‌ అయిన గూగుల్‌ యాప్ ఓపెన్‌ అవుతుంది. దానిని మీరు వాడుకోవచ్చు

* అలానే సమస్య మళ్లీ ఉత్పన్నం కాకుండా ఉండాలంటే ‘ఆటో అప్‌డేట్‌’ ఫీచర్‌ను డిజేబుల్‌ చేసుకోవాలి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని