Android 12L: ఫోల్డింగ్‌ ఫోన్స్‌, ట్యాబ్స్‌ కోసం ఆండ్రాయిడ్ కొత్త ఓఎస్‌

ట్యాబ్స్‌, ఫోల్డింగ్‌ ఫోన్లల కోసం ఆండ్రాయిడ్ 12ఎల్‌ పేరుతో గూగుల్ కొత్త ఓఎస్‌ను పరిచయం చేయనుంది. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ ఓఎస్ యూజర్స్‌కు అందుబాటులోకి రానుంది. 

Published : 21 Dec 2021 01:55 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కొద్దిరోజుల క్రితం గూగుల్ ఆండ్రాయిడ్ ఫోన్ల కోసం కొత్తగా ఆండ్రాయిడ్ 12 ఓఎస్‌ను విడుదల చేసింది. వన్‌-హ్యాండ్ మోడ్‌, యూఆర్‌ఎల్ షేరింగ్, టేక్‌ మోర్‌ బటన్‌, కొత్త గేమింగ్ మోడ్ వంటి ఎన్నో ఫీచర్లను ఇందులో పరిచయం చేసింది. దీంతో ఈ ఓఎస్‌ను ప్రంపంచవ్యాప్తంగా ఉన్న స్మార్ట్‌ఫోన్లు, ఫోల్డింగ్‌ ఫోన్లు, ట్యాబ్‌ యూజర్స్ తమ డివైజ్‌లలో అప్‌డేట్‌ చేశారు. అయితే ఫోల్డింగ్‌ ఫోన్‌, ట్యాబ్ యూజర్స్ ఈ ఓఎస్‌ను ఎక్కువ కాలం ఉపయోగించలేరని సమాచారం. ఈ డివైజ్‌ల కోసం ఆండ్రాయిడ్ 12ఎల్‌ (Android 12L) పేరుతో కొత్త ఓఎస్‌ను తీసుకురానుందట. ముఖ్యంగా ఈ ఓస్‌ను పెద్ద స్క్రీన్‌ డివైజ్‌లు అంటే ట్యాబ్‌లు, ఫోల్డింగ్ ఫోన్లు వంటి వాటి కోసం తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఓఎస్‌లోని ఎల్ అక్షరం లార్జ్‌ స్క్రీన్‌ ఉద్దేశిస్తూ పెట్టిందేనని టెక్ వర్గాలు తెలిపాయి.

ఆండ్రాయిడ్ 12ఎల్ ఓఎస్ వచ్చే ఏడాది ప్రథమార్థంలో యూజర్లకు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. అలానే ఇందులో ఒక యాప్‌ నుంచి మరో యాప్‌కి సులువుగా మారేందుకు డెస్క్‌టాప్‌ కంప్యూటర్‌ తరహాలో కొత్తగా టాస్క్‌బార్ ఇస్తున్నారు. స్ల్పిట్‌ స్క్రీన్‌ మోడ్‌లో ఉన్నప్పుడు యూజర్‌ టాస్క్‌బార్‌ ద్వారా ఒక యాప్‌ నుంచి మరో యాప్‌కి మారొచ్చు. అలానే హోమ్‌ స్క్రీన్‌, నోటిఫికేషన్స్, లాక్ స్క్రీన్‌, క్విక్ సెట్టింగ్స్‌ వంటి వాటి లేఅవుట్లలో కూడా మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఫోల్డబుల్ ఫోన్లలో రెండు స్క్రీన్స్‌లో ఒకేసారి రెండు వేర్వేరు డాక్యుమెంట్లు చూడొచ్చు. వీటితోపాటు సాధారణ యాప్స్‌ పెద్ద స్క్రీన్లకు అనుగుణంగా మారేలా ఈ ఓఎస్‌లో కొత్త అప్‌డేట్ తీసుకొస్తున్నారని సమాచారం. మరి ఆండ్రాయిడ్ 12ఎల్ పూర్తి ఫీచర్ల గురించిన సమాచారం తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. 

Read latest Gadgets & Technology News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని