Google Pay: మీ వ్యాక్సిన్‌ కార్డ్‌కి మాది భరోసా..  

వినియోగదారుల కోసం గూగుల్‌ పేలోని పాసెస్‌ ఏపీఐలో మరో కొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్నారు. దీని సాయంతో ఆండ్రాయిడ్‌ యూజర్స్ ఇకమీదట తమ కొవిడ్‌-19 టీకా ధృవీకరణ పత్రాన్ని, కొవిడ్‌-19 నిర్ధరణ పత్రాన్ని ఫోన్లలో భద్రంగా దాచుకోవచ్చని గూగుల్ వెల్లడించింది. ఇందుకోసం గూగుల్‌ పేలోని పాసెస్‌ ఏపీఐని అప్‌డేట్‌ చేసినట్లు తెలిపింది...

Published : 01 Jul 2021 23:29 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వినియోగదారుల కోసం గూగుల్‌ పేలోని పాసెస్‌ ఏపీఐలో మరో కొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్నారు. దీని సాయంతో ఆండ్రాయిడ్‌ యూజర్స్ ఇకమీదట తమ కొవిడ్‌-19 టీకా ధృవీకరణ పత్రాన్ని, కొవిడ్‌-19 నిర్ధరణ పత్రాన్ని ఫోన్లలో భద్రంగా దాచుకోవచ్చని గూగుల్ వెల్లడించింది. ఇందుకోసం గూగుల్‌ పేలోని పాసెస్‌ ఏపీఐని అప్‌డేట్‌ చేసినట్లు తెలిపింది. ఆండ్రాయిడ్‌ 5 ఓఎస్‌ లేదా ఆపై ఓఎస్‌తో పనిచేస్తున్న ఫోన్లు లేదా గూగుల్‌ ప్లే ధృవీకరించిన ఫోన్లు ఉపయోగించేవారు ఈ ఫీచర్‌ను పొందుతారు. ప్రస్తుతం ఈ ఫీచర్ అమెరికాలోని యూజర్స్‌కి మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే అన్ని దేశాల వినియోగదారులకు అందుబాటులోకి తీసురానున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తమ దేశానికి వచ్చేవారు కొవిడ్‌-19 టీకా వేయించుకొని రావాలని పలు దేశాలు నిబంధనలు విధించాయి. ఈ నేపథ్యంలో ఎయిర్‌పోర్ట్ లేదా ఇతర ప్రదేశాల్లో టీకా ధృవీకరణ పత్రాలను సులభంగా యాక్సెస్ చేసుకునేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుందని గూగుల్‌ తెలిపింది.  

బోర్డింగ్ పాస్‌లు, డిజిటల్‌ టికెట్లు వంటి వాటిని యూజర్స్‌ గూగుల్ పేలో స్టోర్‌ చేసుకునేందుకు పాసెస్‌ ఏపీఐ అనే థర్డ్‌ పార్టీ డెవలపర్‌ గూగుల్‌కు సాయపడుతుంది. ఏపీఐలో స్టోర్ చేసుకోవడం వల్ల యూజర్స్‌ అవసరమైనప్పుడు వాటిని సులభంగా యాక్సెస్‌ చేసుకోగలరు. తాజా అప్‌డేట్‌లో హెల్త్‌కేర్ ఆర్గనైజేషన్స్, ప్రభుత్వరంగ సంస్థలు, ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థలు జారీ చేసే కొవిడ్‌-19 టీకా, పరీక్షల ధృవీకరణ పత్రాలను పాసెస్‌ ఏపీఐ ద్వారా యాక్సెస్ చేసుకుని డిజిటల్‌ ఫార్మాట్‌లో భద్రపరచుకోవచ్చని గూగుల్ తెలిపింది. తర్వాత ఆఫ్‌లైన్‌లో కూడా యూజర్స్‌ తమ పత్రాలను హోం స్క్రీన్‌లో ఉండే షార్ట్‌కట్‌ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చని వెల్లడించింది. యూజర్స్‌ ఇందులో దాచుకునే సమాచారం క్లౌడ్‌లో అప్‌లోడ్ కాదని..అందువల్ల వివరాలు లీక్‌ అయ్యే అవకాశం ఉండదని గూగుల్ తన బ్లాగ్‌లో పేర్కొంది. యూజర్స్ తమ పత్రాలకు పాస్‌వర్డ్‌, పిన్‌ లేదా బయోమెట్రిక్‌ పద్దతిలో రక్షణ కల్పించుకోవచ్చని తెలిపింది. ప్రకటనలు, ఇతర అవసరాల కోసం ఈ సమాచారాన్ని గూగుల్ ఉపయోగించదని గూగుల్ వెల్లడించింది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని