ప్లేస్టోర్ నుంచి మరో కీలక యాప్‌ తొలగింపు! 

గత కొన్నేళ్లుగా డిజిటల్ సేవలు ఉపయోగించుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. లాక్‌డౌన్ సమయంలో క్యూఆర్ కోడ్ సాయంతో చెల్లింపులు చేసేందుకే ఎక్కువ మంది మొగ్గుచూపారు. దీంతో కొంతమంది హ్యాకర్స్‌....

Published : 10 Feb 2021 22:22 IST

ఇంటర్నెట్ డెస్క్‌: గత కొన్నేళ్లుగా డిజిటల్ సేవలు ఉపయోగించుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. లాక్‌డౌన్ సమయంలో క్యూఆర్ కోడ్ సాయంతో చెల్లింపులు చేసేందుకే ఎక్కువ మంది మొగ్గుచూపారు. దీంతో కొంతమంది హ్యాకర్స్‌ క్యూఆర్‌ కోడ్‌తో ఆర్థిక మోసాలకు తెరలేపారు. సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు ఎంతోమంది సైబర్ మోసాలకు గురైన వారి జాబితాలో ఉన్నారు. దీంతో యాపిల్‌, గూగుల్ వంటి దిగ్గజ కంపెనీలు దిద్దిబాటు చర్యలకు ఉపక్రమించాయి. ఈ నేపథ్యంలో బార్‌కోడ్ స్కానర్ యాప్‌ను ప్లేస్టోర్ నుంచి గూగుల్‌ తొ‌లగించింది. ఈ యాప్‌ ఉపయోగించిన తర్వాత మాల్‌వేర్ యాడ్స్‌ ఓపెన్ అవుతున్నాయని, మాల్‌వేర్ ‌బైట్స్‌ అనే ఫోరమ్‌ యూజర్‌ ఫిర్యాదు చేయడంతో గూగుల్ ఈ నిర్ణయం తీసుకుంది.

మాల్‌వేర్‌ బైట్స్‌ తన బ్లాగ్‌లో పేర్కొన్న దాని ప్రకారం ది గ్రేట్ సస్పెండర్‌ అనే ఎక్స్‌టెన్షన్, బార్‌కోడ్ స్కానర్ మొబైల్ యాప్ ద్వారా మాల్‌వేర్ కోడ్స్‌ కంప్యూటర్లు, ఫోన్లలోకి ప్రవేశిస్తున్నాయట. ఈ కోడ్స్ ద్వారా పాప్‌-అప్‌ యాడ్స్‌, అభ్యంతరకర వెబ్‌సైట్లు ఓపెన్ అవుతున్నాయని సదరు బ్లాగ్‌ తెలిపింది. వాటితో యూజర్స్‌ పక్కదోవ పట్టించి వారి ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని దొంగలిస్తున్నారని వెల్లడించింది. దీంతో ఈ ఎక్స్‌టెన్షన్‌ని క్రోమ్ వెబ్‌స్టోర్ నుంచి, బార్‌కోడ్ యాప్‌ని ప్లేస్టోర్‌ నుంచి తొలగిస్తున్నట్లు గూగుల్‌ ప్రకటించింది. ఇప్పటి వరకు బార్‌కోడ్‌ స్కానర్ యాప్‌ ఉపయోగిస్తున్న యూజర్స్ వెంటనే దాన్ని డిలీట్ చేయాలని సూచించింది. దాంతో పాటు మాల్‌వేర్ వ్యాప్తి చేస్తున్న రోగ్ అనే మరో యాప్‌ను కూడా ప్లేస్టోర్ నుంచి తొలగించినట్లు గూగుల్ తెలిపింది. 

ఇవీ చదవండి..

ట్విటర్‌కు పోటీగా ‘కూ’తకొచ్చింది..!

ఈ జాగ్రత్తలు పాటిస్తే మీ వాట్సాప్ సేఫ్..!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని