చెవులకు తగిలించేద్దాం..

గ్యాడ్జెట్‌ల సందడి అంతా ఇంతా కాదు. లెక్కకు మిక్కిలిగా సరికొత్త డిజైన్‌లతో అలరిస్తూనే ఉన్నాయి. వాటిల్లో టెక్నాలజీ ప్రియుల్ని ఎక్కువగా ఆకట్టుకునేవి ఇయర్‌ఫోన్‌లు. గత కొంత కాలంగా మ్యూజిక్‌ ప్రియుల్ని అలరిస్తున్న ఇయర్‌ఫోన్‌లు ఇవిగోండి.... 

Published : 03 Feb 2021 18:49 IST

 

గ్యాడ్జెట్‌ల సందడి అంతా ఇంతా కాదు. లెక్కకు మిక్కిలిగా సరికొత్త డిజైన్‌లతో అలరిస్తూనే ఉన్నాయి. వాటిల్లో టెక్నాలజీ ప్రియుల్ని ఎక్కువగా ఆకట్టుకునేవి ఇయర్‌ఫోన్‌లు. గత కొంత కాలంగా మ్యూజిక్‌ ప్రియుల్ని అలరిస్తున్న ఇయర్‌ఫోన్‌లు ఇవిగోండి.. మ్యూజిక్‌ మస్తీ చేసేందుకు వీటిని ప్రయత్నించొచ్చు.. అన్నీ కాస్త బడ్జెట్‌లోనే..!


తక్కువ బరువుతో..

ఫోన్, ల్యాపీ, పీసీ.. దేనికైనా కనెక్ట్‌ చేసుకుని వాడుకునేందుకు అనువైంది పిలిప్స్‌ కంపెనీ UpBeat TAUH201BK ఆన్‌-ఇయర్‌ హెడ్‌ఫోన్‌. తక్కువ బరువుతో ఎంత సమయమైనా వాడుకునేలా రూపొందించారు. దీంట్లోని మరో ప్రత్యేకత ‘ఎకో క్యాన్సిలేషన్‌’. అంటే.. మనం మాట్లాడింది తిరిగి మనకే వినిపించటాన్ని ఆపేస్తుందన్నమాట. 1.2 మీటర్‌ కేబుల్‌తో వాడుకోవచ్చు. బిల్ట్‌ఇన్‌ మైక్‌తో కాల్స్‌ కూడా మాట్లాడొచ్చు. హెడ్‌ఫోన్‌ని మడిచేందుకు వీలుంది. ధర రూ.1500.


చక్కగా కూర్చుంటాయ్‌

ఇయర్‌ఫోన్‌లు ధరించామా? లేదా? అని సందేహం వచ్చేంత ట్రెండీగా బడ్స్‌ని ప్రయత్నించొచ్చు. జేబీఎల్‌ అందిస్తున్న వీటి పేరు C100TWS. బ్లూటూత్‌ 5.0 వెర్షన్‌ కనెక్టివిటీతో పని చేస్తాయి. ఒక్కసారి ఛార్జ్‌ చేసి 5 గంటలు వాడుకోవచ్చు. ఫుల్‌ ఛార్జ్‌కి పట్టే సమయం 2 గంటలు. ఛార్జింగ్‌ కేస్‌తో మరో 12 గంటలు వాడుకోవచ్చు. ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టు ఉంది. 15 నిమిషాలు ఛార్జ్‌ చేస్తే గంట పాటు మాట్లాడొచ్చు. ధర రూ.3,700.


ఖరీదు ఎక్కువైనా..

ప్రీమియం హెడ్‌ఫోన్‌లో ఉండే సౌకర్యాలే వేరు. అలాంటి వాటిని ప్రయత్నిద్దాం అనుకుంటే Bowesr&Wilkins PX5 వైర్‌లెస్‌ హెడ్‌ఫోన్‌ ఉంది. ‘నాయిస్‌ క్యాన్సిలేషన్‌’తో బయటి శబ్దాల్ని వినిపించకుండా చేస్తుంది. దీంతో వింటున్న ఆడియోలో స్పష్టత ఉంటుంది. ఒక్కసారి ఫుల్‌ ఛార్జ్‌ చేసి 25 గంటల పాటు మ్యూజిక్‌ వినొచ్చు. దీని ప్రత్యేకత వేర్‌-డిటెక్షన్‌ సెన్సర్‌. మ్యూజిక్‌ వింటున్నప్పుడు అనుకోకుండా హెడ్‌ఫోన్‌ని తీస్తే చాలు. మ్యూజిక్‌ ఆటోమేటిక్‌గా పాజ్‌ అవుతుంది. తిరిగి తగిలించుకోగానే మళ్లీ ప్లే స్టార్ట్‌ అవుతుంది. కేవలం 15 నిమిషాలు ఛార్జ్‌ చేస్తే.. ఐదు గంటలు వాడుకోవచ్చు. ధర రూ.26,000.


‘లెవల్‌’ మారిపోతుంది

ట్రెండీ లుక్‌తో 10 గంటలు వాడుకునేలా శామ్‌సంగ్‌ ‘లెవల్‌-యూ’ ఉంది. నెక్‌బ్యాండ్‌ డిజైన్‌తో సౌకర్యంగా తీర్చిదిద్దారు. ట్రెండీ రంగుల్లో దీన్ని ఎంపిక చేసుకోవచ్చు. ధర రూ.2,500.


స్పోర్ట్‌ లుక్‌తో..

జాగింగ్‌ చేస్తూ.. రాకింగ్‌ మ్యూజిక్‌ వినేందుకు బోట్‌ Rockerz 255F బ్లూటూత్‌ హెడ్‌సెట్‌ని ప్రయత్నించొచ్చు. ‘ఎక్స్‌ట్రా బాస్‌’ దీని ప్రత్యేకం. బ్యాటరీ లైఫ్‌ 6 గంటలు. ధర రూ.900.


ఇవీ చదవండి..

యూవీ శానిటైజేషన్‌తో ఇయర్‌బడ్స్‌..

జిబ్‌ ట్రూ: సింగిల్‌ ఛార్జ్‌తో రోజంతా మ్యూజిక్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని