Smartphones: జులైలో వస్తున్న మొబైల్స్‌ ఇవే!

కొత్తగా మొబైల్‌ కొనాలనుకుంటున్నారా... అయితే ఓ లుక్కేయండి

Published : 01 Jul 2021 10:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కేలండర్‌లో పాత పేజీ తిప్పేసి.. ఫ్రెష్‌గా కొత్త పేజీ పెట్టేసుకున్నాం. మరి ఈ నెలలో కొత్తగా వచ్చే స్మార్ట్‌ఫోన్స్‌ సంగతి కూడా చూసుకుంటే బాగుంటుంది కదా. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం జులైలో ఈ మొబైల్స్‌ మార్కెట్‌లోకి రావొచ్చు. 


⚡ వన్‌ప్లస్‌ నార్డ్‌ 2

వన్‌ప్లస్‌ నార్డ్‌కు కొనసాగింపుగా వన్‌ప్లస్‌ నార్డ్‌2ను ఈ నెలలోనే తీసుకురాబోతున్నారు. సుమారు ₹30 వేలు ధరలో ఈ మొబైల్‌ మార్కెట్‌లోకి వస్తుందని సమాచారం. లుక్‌ విషయానికొస్తే... వన్‌ప్లస్‌ నార్డ్‌కి దగ్గరగా, ఫీచర్ల విషయంలో దానికి మించి ఉంటుందని టాక్‌. 


రియల్‌మీ జీటీ 5జీ

5జీ విభాగంలో రియల్‌మీ వరుసగా మొబైల్స్‌ను లాంచ్‌ చేస్తూ వెళ్తోంది. ఇటీవల ప్రపంచ మార్కెట్‌లోకి ‘జీటీ 5జీ’ పేరుతో ఓ 5జీ మొబైల్‌ను తీసుకొచ్చింది. ఈ నెలలోనే దానిని మన దేశంలోకి తీసుకొస్తారట. 


రెడ్‌మీ 10

రెడ్‌మీ నుంచి ‘10’ సిరీస్‌లో కొత్త మొబైల్స్‌ ఈ నెలలో మన దేశంలోకి రానున్నాయి. జులై ద్వితీయార్ధంలో ఈ మొబైల్స్‌ వస్తాయని భోగట్టా. ఇప్పటికే రెడ్‌మీ నుంచి ‘నోట్‌ 10’ మొబైల్స్‌ వచ్చిన విషయం తెలిసిందే. మామూలుగా అయితే ఈ రెండు సిరీస్‌లు ఒకేసారి వచ్చేవి.


వివో వీ21 ప్రో

వివో కూడా జులైలో ఓ మొబైల్‌ను తీసుకొస్తోంది. నెలాఖరున వివో వీ21 ప్రో పేరుతో ఈ మొబైల్‌ రాబోతోందట. 5జీ నెట్‌వర్క్‌తో రాబోతున్న ఈ మొబైల్‌లో మీడియాటెక్‌ డైమన్సిటీ 800 ప్రాసెసర్‌ వినియోగిస్తున్నారట. అలాగే ఇందులో 8జీబీ ర్యామ్‌ ఉంటుందని సమాచారం.


టెక్నో స్పార్క్‌ గో 2021

ఈ నెల మొబైల్స్‌ మజా మొదలయ్యేది టెక్నో స్పార్క్‌ సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌తోనే. ఈ రోజే ఈ మొబైల్‌ లాంచ్‌ చేస్తున్నారు. ఇందులో 6.5 అంగుళాల స్క్రీన్‌, 13 ఎంపీ మెయిన్‌ కెమెరా, 8 ఎంపీ సెల్పీ కెమెరా, 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ లాంటి ఫీచర్లు ఉన్నాయి. 


పోకో ఎక్స్‌ 3 జీటీ

పోకో నుంచి ఈ నెలలో ఓ మొబైల్‌ రాబోతోంది. చైనాలో విడుదల చేసిన రెడ్‌మీ నోట్‌ 10 ప్రో 5జీ వెర్షన్‌ను పోకో ఎక్స్‌ 3 జీటీ పేరుతో భారత్‌లో విడుదల చేస్తారని సమాచారం. మూడో వారంలో ఈ మొబైల్‌కు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. 


ఒప్పో రెనో 6 

ఒప్పో రెనో 6 సిరీస్‌లో భాగంగా రెనో 6, రెనో 6 5జీ మొబైల్స్‌ను మేలో చైనాలో లాంచ్‌ చేశారు. వాటిని అదే పేరుతో ఈ నెలలో మన మార్కెట్‌లోకి తీసుకొస్తారని టాక్‌. ఈ మొబైల్స్‌లో ముందువైపు ఉండే 32 ఎంపీ కెమెరా ప్రధాన ఫీచర్‌.


ఆసుస్‌ జెన్‌ఫోన్‌ 8

ఆసుస్‌ జెన్‌ఫోన్‌ మొబైల్స్‌ మన దేశంలో జెన్‌ సిరీస్‌ పేరుతో వస్తుంటాయి. అలా ఈ ఏడాది ఆసుస్‌ జెన్‌ 8 సిరీస్‌లో ఆసుస్‌ 8 జెడ్‌, 8 జెడ్‌ ఫ్లిప్‌ పేరుతో ఆ మొబైల్స్‌ వస్తాయి. వీటిలో క్వాల్‌కోమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 888 ప్రాసెసర్‌ ఉంటుంది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని