Sunday Basics: వైఫై పాస్‌వర్డు షేర్‌ ఇలా...

 ప్రస్తుత కాలంలో ఇంటర్నెట్‌ వినియోగం బాగా పెరిగిపోయింది. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో...

Updated : 30 May 2021 18:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రస్తుత కాలంలో ఇంటర్నెట్‌ వినియోగం బాగా పెరిగిపోయింది. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో వర్క్‌ ఫ్రం హోం కోసం డేటా ప్యాకేజీలను చాలా మంది యాక్టివేట్‌ చేసుకుంటున్నారు. ఇంట్లోనే వైఫై కనెక్షన్‌ పెట్టించుకుని ఫోన్లు, ల్యాపీలు, డెస్క్‌టాప్‌లలో డేటాను వినియోగించుకుంటున్నారు. అయితే వైఫై పాస్‌వర్డ్‌ను ఎంతో జాగ్రత్తగా సెట్ చేసుకోవాలి. సులభంగా గుర్తించేలా ఉంటే మాల్‌వేర్‌ దాడులకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. బాగా తెలిసిన వారికి మాత్రమే వైఫై పాస్‌వర్డ్‌ను షేర్‌ చేయాలి. లేకపోతే అనవసరమైన ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. యూజర్లు అసభ్యకరమైన కంటెంట్‌, యాప్‌లు, వెబ్‌సైట్లను ఓపెన్ చేసి చూసే ప్రమాదముంది. దీని వల్ల మీ ఐపీ అడ్రస్‌పైనే నిషేధం పడే అవకాశం ఉంటుంది. మరి ఈ క్రమంలో వైఫై పాస్‌వర్డ్‌ను సురక్షితంగా ఎలా షేర్‌ చేసుకోవాలి.. వంటి విషయాలను తెలుసుకుందాం.. 

ఇలా ప్రయత్నించండి..

* ఆండ్రాయిడ్‌ వెర్షన్‌లో వైఫై పాస్‌వర్డ్‌ను క్యూఆర్‌ కోడ్‌ ద్వారా సులభంగా షేర్‌ చేసుకునే వెసులుబాటు ఉంది. 

* ఎవరికైతే వైఫై పాస్‌వర్డ్‌ను ఇవ్వాలనుకుంటున్నామో వారికి క్యూఆర్‌ కోడ్‌ను సెండ్‌ చేయాలి. అదెలాగంటే..

* కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో క్యూఆర్‌ కోడ్ క్రియేట్‌ అయ్యే ముందు డివైజ్ పిన్‌, పాస్‌వర్డ్, ఫింగర్‌ప్రింట్‌లలో ఏదొకటి అడుగుతుంది. దానిని ఎంటర్‌ చేస్తే క్యూఆర్‌ కోడ్‌ వచ్చేస్తుంది. 

* వైఫై కనెక్ట్‌ చేయాలనుకునే మరొక ఆండ్రాయిడ్‌ ఫోన్‌ను తీసుకుని సెట్టింగ్స్‌ను ఓపెన్‌ చేయాలి. 

* వైఫై ఆప్షన్‌ను క్లిక్‌ చేస్తే క్యూఆర్‌ కోడ్‌ స్కానర్ వస్తుంది. కొన్ని ఫోన్లలో ఇలాంటి సౌకర్యం ఉండదు. అలాంటప్పుడు అథంటిక్‌గా ఉండే క్యూఆర్‌ కోడ్‌ స్కానర్‌ యాప్‌లను వాడొచ్చు. యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకుని క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసుకోవాలి. 

* క్యూఆర్‌ కోడ్‌ ద్వారా వైఫై పాస్‌వర్డ్‌ను షేర్‌ చేసుకోవడం ద్వారా పాస్‌వర్డ్‌ను గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. 

* షేర్‌ చేసేటప్పుడు తెలియని వ్యక్తులు తస్కరించే ప్రమాదం నుంచి కాపాడుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని