IPhone 13 Series: ఐఫోన్ 13 ‘ఫేస్‌ ఐడీ’లో మార్పులు!

విపణిలోకి ఐఫోన్ 13 సిరీస్‌ ఫోన్లు ఎప్పుడంటే...?

Updated : 22 Dec 2022 14:39 IST

ఈ నెలలోనే విడుదలయ్యే అవకాశం

ఇంటర్నెట్‌ డెస్క్‌: యాపిల్‌ నుంచి ఏ ఉత్పత్తి మార్కెట్‌లోకి వచ్చినా హాట్‌ కేకుల్లా అమ్ముడైపోతాయి. స్మార్ట్‌ఫోన్‌ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఐఫోన్ 13 సిరీస్‌ విపణిలోకి వచ్చే సమయం ఆసన్నమైంది. ఈ నెలలోనే ఐఫోన్ 13 సిరీస్‌ను యాపిల్‌ తీసుకురాబోతోందని పలు నివేదికలు చెబుతున్నాయి. కొత్త మోడల్‌ ‘లో ఎర్త్‌ ఆర్బిట్‌ (ఎల్‌ఈవో)’ శాటిలైట్‌ కమ్యూనికేషన్‌ కనెక్టవిటీతో రానుంది. దీని ద్వారా నెట్‌వర్క్‌ లేని సందర్భంలోనూ కాల్స్‌, మెసేజ్‌లు చేసుకోవచ్చని నిపుణులు తెలిపారు. అయితే ఈ శాటిలైట్‌ ఫీచర్‌ సెలక్టెటెడ్ మార్కెట్‌లోనే అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. 2019లో ఎల్‌ఈవో శాటిలైట్‌ సేవలను తన మొబైల్స్‌కు యాపిల్ అనుసంధానించింది. ఇప్పుడు మళ్లీ ఐఫోన్ 13 సిరీస్‌లోనూ తీసుకువస్తోంది. అయితే దీనిపై యాపిల్‌ సంస్థ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. 

ఐఫోన్ 13 సిరీస్‌లో ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్‌, ఐఫోన్ 13 మినీ స్మార్ట్‌ఫోన్స్‌ను యాపిల్‌ తీసుకురానుంది. ఫేస్‌ ఐడీ ఫీచర్‌లో కొన్ని మార్పులు చేసినట్లు మీడియా రిపోర్ట్స్‌ చెబుతున్నాయి. యూజర్‌ ఫేస్‌మాస్క్‌తో కూడా  ఫోన్‌ను అన్‌లాక్‌ చేసేలా కొత్త సాంకేతికతను యాపిల్‌ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోందని పేర్కొన్నాయి. అలానే పొగమంచు, సూర్యరశ్మి అధికంగా ఉన్నప్పుడు కొంతమంది కళ్లాద్దాలు పెట్టుకుంటూ ఉంటారు. అప్పుడు కూడా ఫేస్‌ను గుర్తించి అన్‌లాక్‌ అయ్యేలా చేస్తుంది. ఇప్పుడంతా ఎక్కడ చూసినా 5G టెక్నాలజీ. ఐఫోన్‌ 13 సిరీస్‌ mmWave 5G సపోర్ట్‌తో వస్తుందని రూమర్స్ వస్తున్నాయి. హై స్పీడ్‌ 5జీ టెక్నాలజీ కోసం ఈ ఏడాది నుంచి చాలా దేశాలు mmWave 5G బ్యాండ్‌విడ్త్‌తో సేవలను ప్రారంభిస్తున్నాయి. ఇతర 5జీ నెట్‌వర్క్స్ కంటే స్పీడ్‌ అధికంగా ఉంటుంది. అయితే ఈ టెక్నాలజీ ధర కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఐఫోన్‌ 13 సిరీస్‌ ఫోన్లతోపాటు యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 7ను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని