iPhone: మొబైల్‌లో స్టోరేజీ సమస్యా?ఇవీ ట్రై చేయండి!

మొబైల్‌లో స్టోరేజీ సమస్య కొన్ని సందర్భాల్లో తీవ్ర చికాకు, చిరాకు కలిగిస్తుంటుంది. అయితే, కొన్ని టిప్స్‌ పాటిస్తే ఆ సమస్యను తగ్గించుకోవచ్చు. అదేలాంటే..?

Updated : 14 Dec 2021 16:49 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐఫోన్‌ (iPhone)లో గేమింగ్‌, బ్రౌజింగ్‌, ఫోటోలు తీయడం ఎంత సరదాగా ఉంటుందో.. ఒక్కోసారి ‘స్టోరేజ్‌ ఫుల్‌ (Storage is nearly full)’ అంటూ వచ్చే మెసేజ్‌తో అంతే చికాకు కలుగుతుంది. స్మార్ట్‌ మొబైల్లో ఇటువంటి స్టోరేజీ సమస్య ఎప్పుడూ ఉండదే. అయితే, కొన్ని చిన్నచిన్న టిప్స్‌ పాటిస్తే ఐఫోన్‌లో పదేపదే వచ్చే ఈ స్టోరేజీ సమస్యను కొద్దిగానైనా తగ్గించుకోవచ్చు. అదేలానో చూద్దామా..!

స్టోరేజీ లెక్క తేల్చండి..

స్టోరేజీని ఖాళీ చేయడానికి అనవసర యాప్‌లు‌, ఫోటోలు‌, వీడియోలు, ఇతర ఐటెమ్‌లను డిలీట్‌ చేస్తుంటాం. ఇది ముఖ్యమే, వీటితో పాటే ఐఫోన్‌లో మరో ఫీచర్‌ అందుబాటులో ఉంది. అదే ‘సిస్టమ్‌ డేటా (System Data)’. వినియోగదారుల డేటాకు అంకితమైన ఈ ఫీచర్‌తో స్టోరేజీ సమస్యను అంచనా వేయొచ్చు, అధిగమించనూ వచ్చు. ఇందుకోసం తొలుత డివైస్‌ సెట్టింగ్‌లో ‘జనరల్ (General)‌’ ఆప్షన్‌ క్లిక్‌ చేయండి. అనంతరం డ్రాప్‌డౌన్‌ మెనులో ‘ఐఫోన్‌ స్టోరేజ్‌ (iPhone Storage)’ క్లిక్‌ చేసి గ్రాఫిక్స్‌ స్ర్కీన్‌పై స్టోరేజీ ఇంకా ఎంతుందో తెలుసుకోండి. స్టోరేజీ తక్కువగా ఉంటే ఇవీ ట్రై చేయండి.

డివైస్‌ సిట్టింగ్‌లోనే..

1. ముందుగా మీ డివైస్‌ సెట్టింగ్‌లో ఇంటర్నెట్‌ బ్రౌజర్‌ సఫారీ (Safari)లో ఆప్షన్స్‌ మెను ఓపెన్‌ చేసి హిస్టరీ, క్యాచీ క్లియర్‌ చేసుకోండి.

2. అలాగే ‘మెసేజ్‌ (messages)’ ఆప్షన్స్‌లో ‘కీప్‌ మెసేజ్‌ (keep messeges)’లోకి వెళ్లండి. ఇక్కడ మీరు మెసేజ్‌లు ఎంత కాలానికి స్టోర్‌ చేయాలనుకుంటున్నారో.. సమయ వ్యవధి (time period) సెట్‌ చేసుకోండి. తద్వారా మీరు ఎంపిక చేసిన టైమ్‌ పీరియడ్‌కు అనుగుణంగా మెసేజ్‌లు స్టోర్ అవుతాయి. మిగిలినవి ఆటోమెటిక్‌గా డిలీట్‌ అవుతుంటాయి. ఫలితంగా స్టోరేజీ ఎప్పటికప్పుడు ఫ్రీ అవుతూ ఉంటుంది.

3. మరోవైపు గతంలో డౌన్‌లోడ్‌ చేసిన యాప్‌లను మీరు ఇప్పుడు వాడనట్లయితే వాటినీ డిలీట్‌ చేయండి.

4. ఇక చివరగా ప్రస్తుత ఆధునిక జీవనంలో సామాజిక మాధ్యమాలను మనం ఎంతగా వాడుతున్నామో! ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీటిలోని ఫోటోలు, వీడియో, ఆడియోలతో ఐఫోన్‌లో ఎక్కువ స్టోరేజీ వృథా అవుతుంటుంది. అలాకాకుండా ఉండాలంటే సంబంధిత సామాజిక మాధ్యమాల యాప్‌లలో క్యాచీని ఎప్పటికప్పుడు డిలీట్‌ చేస్తూ ఉండండి. పైవన్నింటినీ వీలు దొరికినప్పుడల్లా డిలీట్‌ చేస్తూ ఉంటే.. ఐఫోన్‌ను సమర్థంగా వినియోగించుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని