Phone Storage: ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయిందా..? ఇలా చేస్తే ఎప్పటికీ నిండదు!
ఫోన్ మెమొరీ సామర్థ్యం ఎంబీల నుంచి జీబీలకు మారినా స్టోరేజ్ సరిపోవడంలేదంటారు. మరి కొత్తగా వచ్చే ఫైల్స్ కోసం ఫోన్ స్టోరేజీ ఖాళీగా ఎలా ఉంచుకోవచ్చో చూద్దాం.
ఇంటర్నెట్‌డెస్క్: కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు ప్రతి క్షణాన్ని మధుర స్మృతులుగా మార్చుకోవాలనుకుంటాం. అందుకోసం అక్కడి దృశ్యాలను ఫొటోలు తీస్తుంటాం. కొన్నిసార్లు మొబైల్లో ఫొటో తీసుకునే సమయానికి స్టోరేజ్ ఫుల్ అనే సందేశం కనిపిస్తుంది. స్టోరేజ్ పరిమితి ఎంబీల నుంచి జీబీలకు మారినా.. చాలా మంది ఫోన్లో మెమొరీ సరిపోవడం లేదంటుంటారు. ఫోన్‌కు ఎస్డీ కార్డ్ సపోర్ట్ ఉంటే సరే. ఒకవేళ ఎస్డీ కార్డ్ సపోర్ట్ లేకపోతే, కొత్తగా వచ్చే ఫొటోలు, వీడియోలు, ఇతర ఫైల్స్‌ను ఫోన్లో స్టోర్ చేసేందుకు ఏం చేయాలో చూద్దాం.
యాప్‌లకు గుడ్‌బై చెప్పాల్సిందే
యాప్‌ల వినియోగం పెరగటం కూడా ఫోన్ స్టోరేజ్ నిండిపోవడానికి కారణం. మనం తరచూ ఉపయోగించని యాప్స్‌ను డిలీట్ చేయడం ద్వారా ఫోన్లో స్టోరేజ్ సమస్యను అధిగమించవచ్చు. ఇందుకోసం ఫోన్ సెట్టింగ్స్‌లో యాప్స్ సెక్షన్ ఓపెన్ చేసి మేనేజ్ యాప్స్‌పై క్లిక్ చేయాలి. అందులో మీ ఫోన్లో ఉన్న యాప్స్ జాబితా ఉంటుంది. వాటిలో మీ ఫోన్ స్టోరేజ్‌ను ఏయే యాప్స్ ఎంత ఉపయోగిస్తున్నాయనే సమాచారం ఉంటుంది. అందులోంచి మీరు ఉపయోగించని యాప్స్, అలానే అవసరంలేని ఎక్కువ స్టోరేజ్ ఆక్రమించిన యాప్స్‌ను సెలెక్ట్ చేసి అన్ఇన్స్టాల్ చేయాలి. దాంతో మీ ఫోన్లో కొంత స్టోరేజ్ ఖాళీ అవుతుంది.
పెద్ద ఫైల్స్ వద్దే వద్దు
ప్రతి ఆండ్రాయిడ్ ఫోన్లోను గూగుల్ ఫైల్స్ యాప్ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేస్తే అందులో మీకు ఫోన్ స్టోరేజ్, ఎస్డీ కార్డ్ సెక్షన్లతోపాటు ఫొటో, ఆడియో, వీడియోతోపాటు డాక్యుమెంట్స్ల ఫోల్డర్లను చూపిస్తుంది. తర్వాత కుడివైపు పైభాగంలో మూడు చుక్కలపై క్లిక్ చేస్తే అందులో అనాలసిస్ స్టోరేజ్ ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఓపెన్ చేసి కిందకు స్క్రోల్ చేస్తే మీకు పెద్ద సైజు ఉన్న ఫైల్స్ జాబితా కనిపిస్తుంది. వాటిలో మీకు అవసరంలేని ఫైల్స్‌ను డిలీట్ చేస్తే మీ ఫోన్లో ఒకేసారి ఎక్కువ మొత్తం స్టోరేజ్ లభిస్తుంది.
వాట్సాప్ స్టోరేజ్
మెసేజింగ్ నుంచి ఫొటో, వీడియో, డాక్యుమెంట్ షేరింగ్ దాకా వాట్సాప్‌ను ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారు. అయితే ఇందులో రోజూ మనకు స్నేహితులు, బంధువులు, తోటి ఉద్యోగుల నుంచి ఎన్నో రకాల ఫొటోలు, వీడియోలు వస్తుంటాయి. వాటితో మన ఫోన్ గ్యాలరీ నిండిపోతుంది. సదరు ఫైల్స్‌ను ఎప్పటికప్పుడు డిలీట్ చేసేందుకు వాట్సాప్ స్టోరేజ్ మేనేజర్‌ను ఉపయోగించుకోవాలి. ఇందుకోసం వాట్సాప్ సెట్టింగ్స్‌లో స్టోరేజ్ అండ్ డేటా ఓపెన్ చేసి మేనేజ్ స్టోరేజ్‌పై క్లిక్ చేయాలి. అందులో 5ఎంబీ కన్నా పెద్ద సైజు ఉన్న ఫైల్స్ జాబితా కనిపిస్తుంది. వాటిలో మీకు అవసరంలేని వాటిని సెలెక్ట్ చేసి డిలీట్ చేస్తే కొంత ఫోన్ మెమొరీ ఖాళీ అవుతుంది.
గ్యాలరీలో వద్దు.. క్లౌడ్‌లో ముద్దు
ఫోన్ మెమొరీ వీలైనంత వరకు ఖాళీగా ఉంచేందుకు క్లౌడ్ స్టోరేజ్‌ను ఉపయోగించుకోవడం ఉత్తమం. మీ ఫోన్లో ఉండే ఫొటోలు, వీడియోలు, ఫైల్స్‌ను గూగుల్ ఫొటోస్, డ్రైవ్‌తోపాటు వన్ క్లౌడ్ వంటి వాటిలో సేవ్ చేసుకోవచ్చు. మీరు ఇప్పటికే వాటని ఉపయోగిస్తుంటే గ్యాలరీలోని ఫైల్స్‌ను ఎప్పటికప్పుడు బ్యాకప్ చేసుకుంటూ ఫోన్ స్టోరేజ్ నుంచి వాటిని డిలీట్ చేస్తే కొత్తగా వచ్చే మీడియా ఫైల్స్‌కు మీ ఫోన్లో ఖాళీ ఉంటుంది.
క్యాచి క్లియర్ చేస్తున్నారా
ఫోన్లో స్టోరేజ్ సమస్యను అధిగమించేందుకు ఉన్న మరో మార్గం యాప్ క్యాచి క్లియర్. మనలో చాలా మంది పొరపాటుగా క్యాచి క్లియర్ చేయడానికి బదులు స్టోరేజ్ క్లియర్‌పై క్లిక్ చేసి యూజర్ డేటాను పొగొట్టుకుంటారు. అందుకే క్యాచి క్లియర్ చేసేప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇందుకోసం ఫోన్ సెట్టింగ్స్‌లో యాప్ సెక్షన్‌పై క్లిక్ చేస్తే యాప్స్ జాబితా కనిపిస్తుంది. అందులో ఏ యాప్ క్యాచి క్లియర్ చేయాలనుకుంటున్నామో దాన్ని ఓపెన్ చేయాలి. తర్వాత స్టోరేజ్‌పై క్లిక్ చేస్తే క్లియర్ డేటా, క్లియర్ క్యాచి అనే రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిలో క్లియర్ క్యాచిపై క్లిక్ చేస్తే మీ ఫోన్ మెమొరీ కొంత ఖాళీ అవుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మానవ రోబో దండు!
రోబో అనగానే ఏం గుర్తుకొస్తుంది? లోహ చట్రంతో కదిలే మర యంత్రమో, కదిలే లోహం బొమ్మో మదిలో కదలాడుతుంది. రబ్బరు కండరాలతో చేసినదైతే మనిషి మాదిరిగానూ కనిపిస్తుంది. చూపు, మాట మనిషిని పోలి ఉంటాయి. -
paul alexander: ఇనుప ఊపిరితిత్తి!
ఓ పొడవైన పెట్టె. శరీరమంతా అందులోనే. తల మాత్రమే బయటకు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 72 ఏళ్లు అందులోనే గడిపితే? అమెరికాకు చెందిన పాల్ అలెగ్జాండర్ అలాగే గడిపారు -
గూగుల్ సెర్చ్ తెలివిగా..
స్మార్ట్ఫోన్లలో గూగుల్ సెర్చ్‌ను వాడనివారుండరంటే అతిశయోక్తి కాదు. కానీ తేలికగా, త్వరగా ఆయా అంశాలను శోధించటానికి కొన్ని చిట్కాలు ఉన్నాయనే సంగతి తెలుసా? అలాంటి కొన్ని ఉపాయాల గురించి తెలుసుకుందాం. -
భళారే డిజిటల్ విచిత్రం!
ఒకప్పటి కన్నా స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల సామర్థ్యం, వేగం పుంజుకున్న మాట నిజం. కానీ ఆకారంలో పెద్దగా మారింది లేదు. ఒకసారి అంచులు చిన్నగా.. మరోసారి కెమెరా బంప్‌లు పెద్దగా ఉండటం తప్పించి దాదాపు అలాగే కనిపిస్తుంటాయి. -
కృత్రిమ మేధ గుండె కాయ
కృత్రిమ మేధ.. కృత్రిమ మేధ.. కృత్రిమ మేధ. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎక్కడ చూసినా ఈ పేరే మార్మోగుతోంది. -
ఇక ఏఐ సినిమా!
పదాల కూర్పు ఆధారంగా చిటికెలో ఫొటోలు, చిత్రాలు, సంగీతం, పాటలను పుట్టిస్తున్న కృత్రిమ మేధ (ఏఐ) మరో అడుగు ముందుకేసింది. ఏకంగా వీడియోలనూ సృష్టించే స్థాయికి చేరుకుంది. విప్లవాత్మక ఛాట్‌జీపీటీని రూపొందించిన ఓపెన్ఏఐ సంస్థ కొత్తగా తీసుకొచ్చిన జనరేటివ్ కృత్రిమ మేధ (జెన్ఏఐ) మోడలే దీనికి నిదర్శనం. -
ఈ విశ్వ కిరణాలు..
విశ్వ కిరణాలు.. కాస్మిక్ రేస్. అంతరిక్షం ఆవలి నుంచి దూసుకొచ్చే ఇవి నిరంతరం అతి వేగంగా.. దాదాపు కాంతి వేగంతో సమానంగా విశ్వమంతటా ప్రయాణిస్తుంటాయి. వీటి మీద మొదటి నుంచీ శాస్త్రవేత్తలకు ఎంతో ఆసక్తి. ఎందుకంటే అంతరిక్షంలో పుట్టుకొచ్చిన చోటు, ఢీకొట్టిన వస్తువులను బట్టి ఇవి విశ్వానికి సంబంధించిన ఎన్నో విషయాలను వివరిస్తాయి. -
ప్రేమ శాస్త్రం!
ప్రేమ ఎందుకు పుడుతుందో, ఎవరి మీద పుడుతుందో తెలియదు. ఒకరికి నచ్చిన వ్యక్తి మరొకరికి నచ్చకపోవచ్చు. ఒకరికి అసలే నచ్చనివారు మరొకరికి ప్రాణం కన్నా మిన్నగా అనిపించ్చొచ్చు. -
ఫోల్డర్ మాయలు
విండోస్ పీసీలో రోజూ ఫోల్డర్లను వాడుతూనే ఉంటాం. కొత్త ఫైళ్లను స్టోర్ చేయటం, డేటాను వరుసగా పెట్టుకోవటం.. ఇలా ఎన్నింటికో వీటిని ఉపయో గిస్తుంటాం. మరి అదృశ్య ఫోల్డర్‌ను సృష్టించుకోగలరా? ఒకేసారి బోలెడన్ని ఫోల్డర్ల పేర్లను మార్చుకోగలరా? ఖాళీ ఫోల్డర్లను గుర్తించగలరా? ఇలాంటి కొన్ని చిత్రమైన ఫోల్డర్ చిట్కాల గురించి తెలుసుకుందాం. -
అమెజాన్ అడుగున బంగారు నేల
అమెజాన్ అనగానే దట్టమైన అడవులే గుర్తుకొస్తాయి. మనుషులు దూరటానికి వీల్లేని అక్కడ ఒకప్పుడు పెద్ద పట్టణమే ఉండేదని ఇటీవల తేలటం అందరినీ ఆశ్చర్యపరచింది -
ఏఐ టెక్కులు!
అసలే కృత్రిమ మేధ (ఏఐ) యుగం. ఆపై ప్రపంచంలోనే అతి పెద్ద ఎలక్ట్రానిక్ వస్తు ప్రదర్శన. ఇక చెప్పేదేముంది? ఏ పరికరాన్ని చూసినా ఏఐమయమే. హెల్త్ ట్రాకర్ల దగ్గరి నుంచి వాహనాల వరకూ అన్నింటికీ అదే ఆలంబన. -
Cyber Crime: నయా సైడర్!
నేటి సైబర్ యుగంలో నేరాలూ మారిపోతున్నాయి. ఆన్లైన్ మోసాలు కోకొల్లలు. డెబిట్, క్రెడిట్ కార్డు వివరాలు చోరీ చేసి మన ప్రమేయమేమీ లేకుండానే నేరగాళ్లు షాపింగ్ చేయటం తెలిసిందే -
కొత్త టెక్ లోకం
డిజిటల్ పరిణామం ఆగేది కాదు. ఇదో నిరంతర ప్రక్రియ. గత ఏడాదిని గతి తిప్పిన ట్రెండ్స్ కొత్త సంవత్సరాన్నీ పరుగులు తీయించనున్నాయి. మెషిన్ ఇంటెలిజెన్స్ జోరందుకోనుంది. వాస్తవ, కాల్పనిక ప్రపంచాల మధ్య హద్దులు చెరగటం ఖాయంగా కనిపిస్తోంటే.. నిరంతర అంతర్జాల పరిణామ ప్రక్రియ మన జీవితాలను గణనీయంగా శాసించేలా రూపుదిద్దుకుంటోంది. -
ఇస్రో ఏఐ వత్సరం 2024
ఇది మనదేశం జాబిల్లిని తాకి ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచిన సంవత్సరం.ఇది కృత్రిమ మేధ ప్రయోగశాలలను దాటుకొని నిత్య జీవన వ్యవహారాల్లోకి విరివిగా చొచ్చుకొచ్చిన సంవత్సరం.శాస్త్ర, సాంకేతిక రంగాలు ఒకదాంతో మరోటి పోటీ పడుతూ కొత్త వత్సరంలోకి అడుగిడుతున్న వేళ సాధించిన ఘనతలను సమీక్షించుకోవటం ముదావహం. -
స్థానిక మేధ
కృత్రిమ మేధ (ఏఐ) తీరు మారుతోంది. ఆంగ్లం గడపను దాటుకొని స్థానిక భాషలపై దృష్టి సారిస్తోంది. ఆయా భాషల వైవిధ్యం, యాసలు, సంస్కృతులకు అనుగుణంగా రూపాంతరం చెందుతోంది. -
గాజు బిందువు ఇంద్రజాలం
ఎప్పుడైనా గాజు కన్నీటి చుక్కల గురించి విన్నారా? అవి స్టీలు కన్నా దృఢంగా ఉంటే? బుల్లెట్ దెబ్బనైనా తట్టుకుంటే? సైన్స్ సూత్రాలనూ ధిక్కరిస్తే? అంత విచిత్రమైన గాజు బిందువు లేంటని అనుకుంటున్నారా? అవే ప్రిన్స్ రూపర్ట్స్ డ్రాప్స్. -
వృక్షో రక్షతి రక్షితః
జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ఛార్లెస్ డార్విన్ అప్పుడెప్పుడో కన్న కల ఎట్టకేలకు సాకారమైంది. ప్రపంచంలో మనకు తెలిసిన అన్ని మొక్కల జాబితాను రూపొందించాలనే ఆయన ఆశయాన్ని రాయల్ బొటానిక్ గార్డెన్స్ ఇటీవల సాకారం చేసింది. -
వాతావరణతరంగ శోధన
భూమి, అంతరిక్ష వాతావరణం మధ్య జరిగే చర్యల మీద అధ్యయనం చేయటం దీని ఉద్దేశం. -
ఏఐయ్యారే!
సాంకేతిక రంగంలో కృత్రిమ మేధ (ఏఐ) సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. ఛాట్‌జీపీటి సమస్త సమాచార సారాంశాన్ని చిటికెలో ముందుంచుతోంది. -
వర్షం కృత్రిమం
ఉక్కపోస్తే ఫ్యాన్ వేసుకుంటాం. చుట్టుపక్కల గాలిని మనవైపు తిప్పుకొంటాం. ఇంట్లో ఉష్ణోగ్రత పెరిగితే ఏసీ వేసుకుంటాం. వేడి గాలిని చల్లబరచి హాయిని అనుభవిస్తాం -
Phone Hacking: ఫోన్ హ్యాక్ అయ్యిందా?
ప్రభుత్వ ప్రాయోజిత అటాకర్లు ఐఫోన్ల మీద దాడి చేసే అవకాశముందని ఇటీవల యాపిల్ సంస్థ ప్రముఖ ప్రతిపక్ష నేతలు, పాత్రికేయులను హెచ్చరించటం తీవ్ర కలకలం సృష్టించింది. ఒక్క మనదేశానికి చెందినవారికే కాదు.. 150 దేశాల్లోకి వ్యక్తులకూ ఈ నోటిఫికేషన్లు అందాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం యాపిల్‌కు నోటీసులు జారీ చేసి, వివరణ కోరింది.
తాజా వార్తలు (Latest News)
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,186
-
క్రికెట్ అభిమానులకు నో టికెట్.. సోషల్ మీడియాలో ‘బేరసారాలు’
-
కసబ్‌ను పట్టుకున్న సదానంద్ దాతెకు ఎన్ఐఏ పగ్గాలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
చెప్పినా చెవికెక్కితేగా?వైకాపా ప్రచారాల్లో వాలంటీర్లు..
-
ముంబయి లక్ష్య ఛేదన దిశగా వస్తుందని భావించారా? ప్యాట్ కమిన్స్ సమాధానమిదే!