Android Phone: ఫోన్లో డేటా శాశ్వతంగా డిలీట్ చేయాలా.. ఇదిగో ఇలా చేయండి!
ఫోన్లో అవసరంలేని ఫైల్స్‌ను డిలీట్ చేసినా స్టోరేజ్ ఫుల్ అనే చూపిస్తుంది. మరి ఎందుకు అలా చూపిస్తుంది. ఫోన్లో ఫైల్స్‌ని శాశ్వంతంగా ఎలా డిలీట్ చేయాలో తెలుసుకుందాం.
ఇంటర్నెట్‌డెస్క్: ఫోన్ స్క్రీన్‌పై స్టోరేజ్ నిండిందనే మెసేజ్ కనిపించగానే వెంటనే అవసరంలేని ఫైల్స్‌ను డిలీట్ చేస్తాం. అయినా కూడా స్టోరేజ్ ఫుల్ అనే చూపిస్తుంది. ఫైల్స్ డిలీట్ చేసినా ఎందుకు అలా చూపిస్తుంది? కొన్నిసార్లు ఫోన్ నుంచి డేటా డిలీట్ చేసినా సదరు ఫైల్స్ బయటివారికి చేరిపోతుంటాయి. మరి మన ఫోన్ నుంచి అవసరంలేని ఫొటో, వీడియో, ఫైల్స్‌ను శాశ్వతంగా ఎలా డిలీట్ చేయాలి? మనం డిలీట్ చేసిన డేటా ఇతరుల చేతికి చిక్కకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో చూద్దాం.
ఫైల్ మేనేజర్ (File Managaer)
ఆండ్రాయిడ్ ఫోన్లో ఫైల్స్ డిలీట్ చేసిన తర్వాత అవి సదరు ఫోల్డర్లో ఉన్న ట్రాష్ లేదా రీసైకిల్ బిన్ ఫోల్డర్లోకి వెళతాయి. అంటే అవి ఇంకా ఫోన్లో ఉన్నట్లే. అందుకే ఫోన్ నుంచి ఫైల్స్‌ను శాశ్వతంగా డిలీట్ చేసేందుకు ఫైల్ మేనేజర్ లేదా ఫైల్ ఎక్స్‌ప్లోరర్‌ను ఉపయోగించాలని సూచిస్తున్నారు టెక్ నిపుణులు. ఇందుకోసం మీ ఫోన్లోని ఫైల్ మేనేజర్‌లోకి వెళ్లి ఫైల్స్‌ను సెలెక్ట్ చేసి డిలీట్ చేయాలి. అలా చేయడం వల్ల మీరు సెలక్ట్ చేసిన ఫైల్స్ ఫోన్ నుంచి శాశ్వతంగా డిలీట్ అవుతాయి. అయితే మీ ఆండ్రాయిడ్ ఖాతా గూగుల్ ఫొటోస్ లేదా డ్రైవ్ వంటి ఇతరత్రా క్లౌడ్ స్టోరేజ్ సేవలకు అనుసంధానమైతే వాటి నుంచి కూడా డిలీట్ చేయాలి.
ఫైల్ ష్రెడ్డర్ (File Shredder)
కొత్త ఫోన్‌ను కొన్నప్పుడు పాత ఫోన్‌ను ఎక్స్చేంజి లేదా తక్కువ ధరకు అమ్మేస్తాం. ఇతరులు డేటా రికవరీ టూల్స్‌తో అందులోని ఫైల్స్‌ను యాక్సెస్ చేయొచ్చు. అందుకే గూగుల్ ఆండ్రాయిడ్ 6 ఆపై వెర్షన్ ఓఎస్‌లకు ఎన్క్రిప్షన్ రక్షణ కల్పిస్తుంది. అయితే కొన్నిసార్లు మన ఫోన్లో డేటా ర్యాండమ్ క్యారెక్టర్స్‌తో వేర్వేరు చోట్ల సేవ్ అవుతుంది. అలాంటి వాటిని గుర్తించి డిలీట్ చేయడం కష్టం. దాంతో ఫోన్ నుంచి డేటా డిలీట్ చేసినా వేరే పేరుతో ఇంకో ఫోల్డర్లో ఉంటుంది. వాటిని కూడా డిలీట్ చేసేందుకు ఫైల్ ష్రెడ్డర్ టూల్స్ సాయం తీసుకోవాల్సిందే. ఇవి ఐష్రెడ్డర్, ష్రెడ్డిట్, డేటా ఎరేసర్ పేరుతో యాప్‌ల రూపంలో కూడా అందుబాటులో ఉన్నాయి.
వీటిని ఫోన్లో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఫైల్స్‌ను యాక్సెస్ చేసుకునేందుకు అనుమతివ్వాలి. తర్వాత యాప్ హోం స్ర్కీన్‌లో ఫ్రీఅప్ స్పేస్ ఆప్షన్‌పై క్లిక్ చేసి ఇంటర్నల్ స్టోరేజ్ సెలెక్ట్ చేయాలి. దాంతో యాప్ మీ ఎంత స్టోరేజ్ ఖాళీ చేయాలనేది అంచనా వేస్తుంది. అది పూర్తయిన తర్వాత కంటిన్యూ క్లిక్ చేస్తే ఫోన్ స్టోరేజ్ నుంచి మీరు డిలీట్ చేసిన ఫైల్స్‌ను శాశ్వతంగా తొలగిస్తుంది. దాంతో వాటిని రీస్టోర్ చేయడం సాధ్యంకాదు. అలానే మీ ఫోన్లో వేర్వేరు పేర్లతో ఉన్న ఒకేరకమైన ఫైల్స్ డిలీట్ అయిపోతాయి. ఈ ప్రక్రియ జరిగేందుకు కాస్త సమయం పడుతుంది. ఒకవేళ మీరు వద్దనుకుంటే ఫోన్లో నోటిఫికేషన్ బార్లోకి వెళ్లి క్యాన్సిల్ క్లిక్ చేసి ఆపేయొచ్చు.
యాప్ ద్వారా వద్దనుకుంటే...
ఒకవేళ మీ ఫోన్లో యాప్ ఇన్స్టాల్ చేసుకోవడం ఇష్టం లేకపోతే ఫోన్‌ను కంప్యూటర్‌కు కనెక్ట్ చేసి కూడా ఫైల్స్‌ను డిలీట్ చేయొచ్చు. ముందుగా మీ ఫోన్‌ను యూఎస్బీ కేబుల్‌తో కంప్యూటర్‌కు కనెక్ట్ చేసిన తర్వాత ఫోన్లో ఆటోప్లే ఆప్షన్స్ కనిపిస్తుంది. అందులో ఓపెన్ డివైజ్ టు వ్యూ ఫైల్స్ అనే ఆప్షన్‌ను సెలక్ట్ చేయాలి. కంప్యూటర్లో మై కంప్యూటర్ లేదా దిస్ పీసీలోకి వెళితే ఫోన్ ఐకాన్ కనిపిస్తుంది. దాన్ని ఓపెన్ చేయాలి. ఒకవేళ మీకు ఫోన్ స్టోరేజ్ ఖాళీగా కనిపిస్తే.. ఫోన్లో యూఎస్బీ ఛార్జింగ్ దిస్ డివైజ్‌లో ఫైల్ ట్రాన్స్ఫర్ లేదా ట్రాన్స్ఫర్ ఫైల్ అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేయాలి. తర్వాత కంప్యూటర్లో ఫోన్ ఐకాన్‌పై క్లిక్ చేసి డీసీఐఎమ్ ఫోల్డర్లోకి వెళ్లి కెమెరాపై క్లిక్ చేయాలి. అందులో మీకు అవసరంలేని ఫైల్స్‌ను సెలక్ట్ చేసి డిలీట్ చేస్తే అవి మీ ఫోన్, కంప్యూటర్ నుంచి శాశ్వతంగా డిలీట్ అయిపోతాయి. మీ ఫోన్లోని డేటా సురక్షితంగా డిలీట్ చేయాలనుకునే వారికి ఇది చక్కటి ఆప్షన్.
ఎస్డీ కార్డ్ నుంచి ఎలాగంటే
ఫోన్ స్టోరేజ్‌తోపాటు మెమొరీ కార్డ్/ఎస్డీ కార్డ్ నుంచి శాశ్వతంగా డిలీట్ చేసేందుకు రెండు పద్ధతులున్నాయి. అవేంటో చూద్దాం. మొదటి పద్ధతిలో ఫోన్ సెట్టింగ్స్‌లో స్టోరేజ్ సెక్షన్లోకి వెళ్లి అందులో ఎస్డీ కార్డ్ సెలెక్ట్ చేయాలి. అందులో ఫైల్స్‌ను సెలెక్ట్ చేసి డిలీట్ చేస్తే సరిపోతుంది. దీంతో మీరు సెలెక్ట్ చేసిన ఫైల్స్ శాశ్వతంగా డిలీట్ అయిపోతాయి. మీరు పొరపాటున ఏదైనా ముఖ్యమైన ఫైల్ డిలీట్ చేసినా దాన్ని రికవరీ చేయలేరు. దాంతో ఎస్డీ కార్డును ఫార్మాట్ చేయడం ద్వారా అందులోని ఫైల్స్‌ను శాశ్వతంగా డిలీట్ చేయొచ్చు. ఈ ప్రక్రియ చేసేముందు ముఖ్యమైన డేటా ఉంటే వాటిని ఫోన్ స్టోరేజ్‌లోకి మార్చుకోవాలి. తర్వాత స్టోరేజ్ సెట్టింగ్స్‌లో కుడివైపు పైభాగంలో ఉన్న మూడు చుక్కలపై క్లిక్ చేయాలి. అందులో ఫార్మాట్ సెక్షన్ ఓపెన్ చేసి పార్మాట్ కార్డ్ లేదా ఎరేజ్ అండ్ ఫార్మాట్‌పై క్లిక్ చేస్తే మీ ఎస్డీ కార్డులో ఉన్న డేటా మొత్తం డిలీట్ అయిపోతుంది.
రెండో పద్ధతి మీ ఫోన్‌ను కంప్యూటర్‌కు కనెక్ట్ చేసి దిస్ పీసీ లేదా మై కంప్యూటర్‌పై క్లిక్ చేయాలి. అందులో మీ ఫోన్ ఐకాన్తోపాటు ఎస్డీకార్డ్ను కూడా చూపిస్తుంది. వాటిలో కార్డ్ ఐకాన్‌పై క్లిక్ చేస్తే అందులో ఫొటో, వీడియో, డాక్యుమెంట్ ఇలా వేర్వేరు ఫార్మాట్లలో ఫైల్స్ ఉన్న ఫోల్డర్స్ చూపిస్తుంది. వాటిలోంచి మీరు డిలీట్ చేయాలనుకుంటున్న ఫైల్స్‌ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి డిలీట్ చేయొచ్చు. లేదంటే ఫైల్ సెలెక్ట్ చేసి కీబోర్డులో డిలీట్ కీ ప్రెస్చేసినా అవి మీ ఎస్డీ కార్డు నుంచి శాశ్వతంగా డిలీట్ అయిపోతాయి. ఒకవేళ మీ ఎస్డీ కార్డ్‌ను ఫార్మాట్ చేయాలనుకుంటే ఐకాన్‌పై రైట్ క్లిక్ చేసి ఫార్మాట్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే అదులోని డేటా మొత్తం డిలీట్ అయిపోతుంది.
రీసెట్ ఫ్యాక్టరీ సెట్టింగ్స్
ఫోన్లో ఉన్న అన్ని ఫైల్స్‌ను డిలీట్ చేయటానికి ఉన్న ఏకైక మార్గం ఫ్యాక్టరీ రీసెట్. దీంతో ఫోన్లోని మొత్తం డేటా శాశ్వతంగా డిలీట్ అయిపోతుంది. అయితే ఈ ప్రక్రియ చేసేముందు ఫోన్లో ముఖ్యమైన ఫైల్స్ ఉంటే వాటిని వేరేచోట స్టోర్ చేసుకోవాలి. అలానే మీ ఫోన్ ఎన్క్రిప్టెడ్ అవునా? కాదా? అనేది చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఫ్యాక్టరీ రీసెట్ తర్వాత మీ డేటా రికవరీ సాధ్యంకాదు. ఇందుకోసం ఫోన్ సెట్టింగ్స్‌లో సెక్యూరిటీ సెక్షన్లోకి వెళ్లి అడ్వాన్ష్డ్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అందులో ఎన్క్రిప్షన్ అండ్ క్రెడెన్షియల్స్‌లో ఎన్‌క్రిప్ట్ ఫోన్ ఎనేబుల్ చేయాలి. తర్వాత ఫోన్ సెట్టింగ్స్‌లో సిస్టమ్ ఆప్షన్‌లోకి వెళ్లి అడ్వాన్స్డ్ సెలెక్ట్ చేయాలి. అందులో రీసెట్ ఆప్షన్ ఓపెన్ చేసి ఎరేజ్ ఆల్ డేటా లేదా ఫ్యాక్టరీ రీసెట్ సెలెక్ట్ చేసి డిలీట్ ఆల్ డేటా క్లిక్ చేస్తే ఫోన్లో అన్ని సెట్టింగ్స్ రీసెట్ అవడమే కాకుండా ఫోన్లో డేటా మొత్తం శాశ్వతంగా డిలీట్ అయిపోతుంది.
గమనిక: ఫ్యాక్టరీ రీసెట్ ప్రాసెస్ ఫోన్ మోడల్ని బట్టి మారుతుంది. ఉదాహరణకు శాంసంగ్ ఫోన్లో ఫ్యాక్టరీ డేటా రీసెట్ ఆప్షన్ సెట్టింగ్స్‌లో జనరల్ మేనేజ్మెంట్లో ఉంటుంది. షావోమి ఫోన్లలో సెట్టింగ్స్‌లో అబౌట్ ఫోన్లోకి వెళ్లి డిలీట్ ఆల్ (ఫ్యాక్టరీ రీసెట్) పేరుతో కనిపిస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దైవకణం కథ
అది అన్ని కణాలకూ ద్రవ్యరాశిని సంతరింపజేస్తుంది. దీని గురించి 1960ల్లోనే తెలిసినా 50 ఏళ్ల తర్వాత గానీ ఉనికి బయటపడలేదు. ప్రపంచంలోనే అతి పెద్ద, అతి సంక్లిష్ట యంత్రం సాయం తీసుకుంటే తప్ప అది సాధ్యం కాలేదు. -
కాల మహిమ
ఉగాది రోజు పంచాంగం విన్నారా? దీనిలోని తిథులు, రోజులు, పక్షాలు, నెలలు, రుతువులు.. అన్నీ కాల గమన సంకేతాలే. అసలు కాలమంటే ఏంటి? అది ఎలా మొదలైంది? ఇలాగే కొనసాగుతుందా? అంతమవుతుందా? -
కంప్యూటర్‌కు బుర్ర!
మన మెదడు అద్భుతమైంది. హేతుబద్ధంగా వ్యవహరిస్తుంది. కార్య కారణాలను విశ్లేషించి ఒక నిర్ణయానికి వస్తుంది. ఉచితానుచితాలను బేరీజు వేస్తుంది. ఏ పని ఎలా చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో పసిగడుతుంది. -
ఫోన్ ట్యాప్ అయ్యిందా?
నేటి డిజిటల్ యుగంలో వ్యక్తిగత సమాచార గోప్యత, భద్రత అతి కీలకమయ్యాయి. అధునాతన నిఘా పద్ధతుల నేపథ్యంలో ఇవి మరింత ప్రాధాన్యం సంతరించు కుంటున్నాయి. నిత్య జీవితంలో విడదీయలేని పరికరంగా మారిన ఫోన్ల మీదా నిఘా వేయటం, ట్యాపింగ్ చేయటమూ చూస్తున్నాం. -
రోబో సేవలు చేసేనే..
మనిషికి మనిషి తోడంటారు. ఇప్పుడు మర మనిషీ (రోబో) చేయందిస్తోంది. ఒకపక్క అధునాతన హ్యూమనాయిడ్ రోబోల వెల్లువ సంచలనం సృష్టిస్తుండగా.. మరోపక్క మామూలు రోబోలూ సేవలకు సిద్ధమవుతున్నాయి. -
మానవ రోబో దండు!
రోబో అనగానే ఏం గుర్తుకొస్తుంది? లోహ చట్రంతో కదిలే మర యంత్రమో, కదిలే లోహం బొమ్మో మదిలో కదలాడుతుంది. రబ్బరు కండరాలతో చేసినదైతే మనిషి మాదిరిగానూ కనిపిస్తుంది. చూపు, మాట మనిషిని పోలి ఉంటాయి. -
paul alexander: ఇనుప ఊపిరితిత్తి!
ఓ పొడవైన పెట్టె. శరీరమంతా అందులోనే. తల మాత్రమే బయటకు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 72 ఏళ్లు అందులోనే గడిపితే? అమెరికాకు చెందిన పాల్ అలెగ్జాండర్ అలాగే గడిపారు -
గూగుల్ సెర్చ్ తెలివిగా..
స్మార్ట్ఫోన్లలో గూగుల్ సెర్చ్‌ను వాడనివారుండరంటే అతిశయోక్తి కాదు. కానీ తేలికగా, త్వరగా ఆయా అంశాలను శోధించటానికి కొన్ని చిట్కాలు ఉన్నాయనే సంగతి తెలుసా? అలాంటి కొన్ని ఉపాయాల గురించి తెలుసుకుందాం. -
భళారే డిజిటల్ విచిత్రం!
ఒకప్పటి కన్నా స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల సామర్థ్యం, వేగం పుంజుకున్న మాట నిజం. కానీ ఆకారంలో పెద్దగా మారింది లేదు. ఒకసారి అంచులు చిన్నగా.. మరోసారి కెమెరా బంప్‌లు పెద్దగా ఉండటం తప్పించి దాదాపు అలాగే కనిపిస్తుంటాయి. -
కృత్రిమ మేధ గుండె కాయ
కృత్రిమ మేధ.. కృత్రిమ మేధ.. కృత్రిమ మేధ. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎక్కడ చూసినా ఈ పేరే మార్మోగుతోంది. -
ఇక ఏఐ సినిమా!
పదాల కూర్పు ఆధారంగా చిటికెలో ఫొటోలు, చిత్రాలు, సంగీతం, పాటలను పుట్టిస్తున్న కృత్రిమ మేధ (ఏఐ) మరో అడుగు ముందుకేసింది. ఏకంగా వీడియోలనూ సృష్టించే స్థాయికి చేరుకుంది. విప్లవాత్మక ఛాట్‌జీపీటీని రూపొందించిన ఓపెన్ఏఐ సంస్థ కొత్తగా తీసుకొచ్చిన జనరేటివ్ కృత్రిమ మేధ (జెన్ఏఐ) మోడలే దీనికి నిదర్శనం. -
ఈ విశ్వ కిరణాలు..
విశ్వ కిరణాలు.. కాస్మిక్ రేస్. అంతరిక్షం ఆవలి నుంచి దూసుకొచ్చే ఇవి నిరంతరం అతి వేగంగా.. దాదాపు కాంతి వేగంతో సమానంగా విశ్వమంతటా ప్రయాణిస్తుంటాయి. వీటి మీద మొదటి నుంచీ శాస్త్రవేత్తలకు ఎంతో ఆసక్తి. ఎందుకంటే అంతరిక్షంలో పుట్టుకొచ్చిన చోటు, ఢీకొట్టిన వస్తువులను బట్టి ఇవి విశ్వానికి సంబంధించిన ఎన్నో విషయాలను వివరిస్తాయి. -
ప్రేమ శాస్త్రం!
ప్రేమ ఎందుకు పుడుతుందో, ఎవరి మీద పుడుతుందో తెలియదు. ఒకరికి నచ్చిన వ్యక్తి మరొకరికి నచ్చకపోవచ్చు. ఒకరికి అసలే నచ్చనివారు మరొకరికి ప్రాణం కన్నా మిన్నగా అనిపించ్చొచ్చు. -
ఫోల్డర్ మాయలు
విండోస్ పీసీలో రోజూ ఫోల్డర్లను వాడుతూనే ఉంటాం. కొత్త ఫైళ్లను స్టోర్ చేయటం, డేటాను వరుసగా పెట్టుకోవటం.. ఇలా ఎన్నింటికో వీటిని ఉపయో గిస్తుంటాం. మరి అదృశ్య ఫోల్డర్‌ను సృష్టించుకోగలరా? ఒకేసారి బోలెడన్ని ఫోల్డర్ల పేర్లను మార్చుకోగలరా? ఖాళీ ఫోల్డర్లను గుర్తించగలరా? ఇలాంటి కొన్ని చిత్రమైన ఫోల్డర్ చిట్కాల గురించి తెలుసుకుందాం. -
అమెజాన్ అడుగున బంగారు నేల
అమెజాన్ అనగానే దట్టమైన అడవులే గుర్తుకొస్తాయి. మనుషులు దూరటానికి వీల్లేని అక్కడ ఒకప్పుడు పెద్ద పట్టణమే ఉండేదని ఇటీవల తేలటం అందరినీ ఆశ్చర్యపరచింది -
ఏఐ టెక్కులు!
అసలే కృత్రిమ మేధ (ఏఐ) యుగం. ఆపై ప్రపంచంలోనే అతి పెద్ద ఎలక్ట్రానిక్ వస్తు ప్రదర్శన. ఇక చెప్పేదేముంది? ఏ పరికరాన్ని చూసినా ఏఐమయమే. హెల్త్ ట్రాకర్ల దగ్గరి నుంచి వాహనాల వరకూ అన్నింటికీ అదే ఆలంబన. -
Cyber Crime: నయా సైడర్!
నేటి సైబర్ యుగంలో నేరాలూ మారిపోతున్నాయి. ఆన్లైన్ మోసాలు కోకొల్లలు. డెబిట్, క్రెడిట్ కార్డు వివరాలు చోరీ చేసి మన ప్రమేయమేమీ లేకుండానే నేరగాళ్లు షాపింగ్ చేయటం తెలిసిందే -
కొత్త టెక్ లోకం
డిజిటల్ పరిణామం ఆగేది కాదు. ఇదో నిరంతర ప్రక్రియ. గత ఏడాదిని గతి తిప్పిన ట్రెండ్స్ కొత్త సంవత్సరాన్నీ పరుగులు తీయించనున్నాయి. మెషిన్ ఇంటెలిజెన్స్ జోరందుకోనుంది. వాస్తవ, కాల్పనిక ప్రపంచాల మధ్య హద్దులు చెరగటం ఖాయంగా కనిపిస్తోంటే.. నిరంతర అంతర్జాల పరిణామ ప్రక్రియ మన జీవితాలను గణనీయంగా శాసించేలా రూపుదిద్దుకుంటోంది. -
ఇస్రో ఏఐ వత్సరం 2024
ఇది మనదేశం జాబిల్లిని తాకి ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచిన సంవత్సరం.ఇది కృత్రిమ మేధ ప్రయోగశాలలను దాటుకొని నిత్య జీవన వ్యవహారాల్లోకి విరివిగా చొచ్చుకొచ్చిన సంవత్సరం.శాస్త్ర, సాంకేతిక రంగాలు ఒకదాంతో మరోటి పోటీ పడుతూ కొత్త వత్సరంలోకి అడుగిడుతున్న వేళ సాధించిన ఘనతలను సమీక్షించుకోవటం ముదావహం. -
స్థానిక మేధ
కృత్రిమ మేధ (ఏఐ) తీరు మారుతోంది. ఆంగ్లం గడపను దాటుకొని స్థానిక భాషలపై దృష్టి సారిస్తోంది. ఆయా భాషల వైవిధ్యం, యాసలు, సంస్కృతులకు అనుగుణంగా రూపాంతరం చెందుతోంది. -
గాజు బిందువు ఇంద్రజాలం
ఎప్పుడైనా గాజు కన్నీటి చుక్కల గురించి విన్నారా? అవి స్టీలు కన్నా దృఢంగా ఉంటే? బుల్లెట్ దెబ్బనైనా తట్టుకుంటే? సైన్స్ సూత్రాలనూ ధిక్కరిస్తే? అంత విచిత్రమైన గాజు బిందువు లేంటని అనుకుంటున్నారా? అవే ప్రిన్స్ రూపర్ట్స్ డ్రాప్స్.