Smartphone: ఫ్యాక్టరీ రీసెట్ ఎందుకంటే?

కొత్త ఫోన్ కొనేప్పుడు పాత ఫోన్‌ను ఎక్సేంజ్‌ చేయడం లేదా తక్కువ ధరకి అమ్మేస్తుంటాం. అయితే పాత ఫోన్‌లో డేటా పూర్తిగా తొలగించినా అందులో మనకి సంబంధించిన ఎంతో కొంత సమాచారం ఉంటుంది. అందుకే పాత ఫోన్‌ని అమ్మేప్పుడు దాన్ని ఫ్యాక్టరీ రీసెట్ చేయమని మొబైల్ నిపుణులు సూచిస్తుంటారు...

Updated : 18 Jul 2021 22:20 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కొత్త ఫోన్ కొనేటప్పుడు పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్‌ చేయడం లేదా తక్కువ ధరకి అమ్మేస్తుంటాం. అయితే పాత ఫోన్‌లో డేటా పూర్తిగా తొలగించినా అందులో మనకి సంబంధించిన ఎంతో కొంత సమాచారం ఉంటుంది. అందుకే పాత ఫోన్‌ని అమ్మేటప్పుడు దాన్ని ఫ్యాక్టరీ రీసెట్ చేయమని మొబైల్ నిపుణులు సూచిస్తుంటారు. ఇలా చేయడం వల్ల మన ఫోన్‌లోని డేటా మొత్తం పూర్తిగా డిలీట్ అవ్వడమే కాకుండా ఫోన్‌ కొన్నప్పుడు ఉన్న సెట్టింగ్స్‌ ఉంటాయి. దీని వల్ల మీ డేటా పూర్తి సురక్షితంగా ఉంటుంది. మరి మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఫ్యాక్టరీ రీసెట్ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

* ముందుగా మీ ఫోన్‌లోని వాట్సాప్‌, ట్విటర్‌, ఎంఎస్‌ ఆఫీస్‌ వంటి ఖాతాలను లాగౌట్ చేయండి. ఇందుకోసం ఫోన్ సెట్టింగ్స్‌లో అకౌంట్స్‌లోకి వెళ్లి ఒక్కో ఖాతా నుంచి లాగౌట్ చేస్తే సరిపోతుంది. చివరిగా మీ గూగుల్ ఖాతా నుంచి లాగౌట్ చేయాలి. ఇలా చేయడం వల్ల మీ పాత ఫోన్‌లోని వివరాలు సింక్‌ కాకుండా ఉంటాయి. 

* తర్వాత ఫోన్‌లోని మైక్రో ఎస్‌డీ కార్డ్, సిమ్‌ కార్డ్ తొలగించాలి. సెట్టింగ్స్‌లోకి వెళ్లి జనరల్ మేనెజ్‌మెంట్‌పై క్లిక్ చేస్తే అందులో రీసెట్ సెక్షన్‌పై క్లిక్ చేయాలి. అందులో ఫ్యాక్టరీ డేటా రీసెట్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేస్తే మీ ఫోన్‌లో ఉన్న డేటా మొత్తం డిలీట్ అయిపోయి ఫోన్ రీస్టాట్ అవుతుంది. 

* ఈ ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాత ఫోన్‌ ఆన్‌ చేస్తే ఆండ్రాయిడ్ వెల్‌కమ్‌ అని స్క్రీన్ మీద కనిపిస్తుంది. దాంతో కొత్తగా మీ ఫోన్ ఉపయోగించేవారు తమ వివరాలతో సైన్ఇన్ చేసి ఫోన్ ఎప్పటిలానే ఉపయోగించుకోవచ్చు. 

గమనిక: ఫ్యాక్టరీ రీసెట్ ప్రాసెస్‌ ఫోన్‌ మోడల్‌ని బట్టి మారుతుంది. ఉదాహరణకు శాంసంగ్‌ ఫోన్‌లో ఫ్యాక్టరీ డేటా రీసెట్ ఆప్షన్‌ సెట్టింగ్స్‌లో జనరల్ మేనేజ్‌మెంట్‌లో ఉంటుంది. షావోమి ఫోన్లలో సెట్టింగ్స్‌లో అబౌట్‌ ఫోన్‌లోకి వెళ్లి డిలీట్ ఆల్‌ (ఫ్యాక్టరీ రీసెట్) పేరుతో కనిపిస్తుంది. ఐఫోన్‌లో సెట్టింగ్స్‌లో జనరల్‌పై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేస్తే రీసెట్ ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఓపెన్ చేసి ఎరేజ్ ఆల్ కంటెంట్ అండ్ సెట్టింగ్స్‌ని సెలెక్ట్ చేయాలి. తర్వాత పాప్‌-అప్ విండో ఓపెన్ అయి బ్యాక్‌అప్‌ థెన్ ఎరేజ్‌, ఎరేజ్ నౌ అనే రెండు ఆప్షన్లను చూపిస్తుంది. ఒకవేళ మీ డేటా మొత్తం బ్యాక్‌అప్‌ తీసుకుంటే ఎరేజ్‌నౌపై క్లిక్ చేయాలి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు