Lava Mobile: లావా నుంచి తొలి 5జీ మొబైల్‌.. ఎప్పుడంటే..?

భారత్‌లో ప్రస్తుతం 5జీ నెట్‌వర్క్‌ అందుబాటులో లేకున్నా.. అనేక అంతర్జాతీయ మొబైల్‌ కంపెనీలు 5జీ మొబైళ్లను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. తాజాగా భారతీయ మొబైల్‌ తయారీ కంపెనీ లావా కూడా అదే బాటలో నడవబోతుంది. తమ సంస్థ నుంచి తొలి 5జీ మొబైల్‌ ‘లావా అగ్ని 5జీ’ని నవంబర్‌ 9న

Updated : 22 Dec 2022 14:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌లో ప్రస్తుతం 5జీ నెట్‌వర్క్‌ అందుబాటులో లేకున్నా.. అనేక అంతర్జాతీయ మొబైల్‌ కంపెనీలు 5జీ మొబైళ్లను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. తాజాగా భారతీయ మొబైల్‌ తయారీ కంపెనీ లావా కూడా అదే బాటలో నడవబోతుంది. తమ సంస్థ నుంచి తొలి 5జీ మొబైల్‌ ‘లావా అగ్ని 5జీ’ని నవంబర్‌ 9న విడుదల చేయనుంది. షియోమీ, రియల్‌మీ, శాంసంగ్‌ తదితర కంపెనీలకు పోటీగా, భారతీయులను 5జీ నెట్‌వర్క్‌ వినియోగానికి సిద్ధం చేయడమే లక్ష్యంగా ఈ మొబైల్‌ను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. 

అగ్ని 5జీ ఫోన్‌ సాంకేతిక వివరాలను లావా సంస్థ అధికారికంగా వెల్లడించకపోయినా.. పలు టెక్‌ వెబ్‌సైట్లు లావా 5జీ మొబైల్‌లో ఉండే ఫీచర్ల గురించి వివరిస్తున్నాయి. వాటి ప్రకారం.. ఫోన్‌లో 90 హెచ్‌జడ్‌ రిఫ్రెష్‌ రేట్‌ డిస్‌ప్లే, 64 మెగాపిక్సల్‌ కెమెరాతోపాటు మూడు లెన్స్‌ కెమెరాలు, ముందుభాగంలో పంచ్‌హోల్‌ సెల్ఫీ కెమెరా ఉంటుందట. ఆండ్రాయిడ్‌ 11 ఓఎస్‌ ఉన్న ఈ మొబైల్‌లో ఆక్టాకోర్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 810 5జీ ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. గేమర్స్‌ కోసం గేమింగ్‌ మోడ్‌, 5000ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటుందని సమాచారం. అయితే, ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సంబంధించిన సమాచారం ఇంకా తెలియరాలేదు. కేవలం నీలిరంగులో మాత్రమే లభించే ఈ మొబైల్‌ ధర రూ.19,999గా ఉండనుందట. ఈ వివరాలు కేవలం ఊహగానాలు మాత్రమే. ఫీచర్ల వివరాలను లావా కంపెనీ అధికారికంగా త్వరలో వెల్లడించనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని