‘అలెక్సా’తో వస్తున్న లెనోవా ల్యాపీలు

లెనోవా కంపెనీ మూడు కొత్త ల్యాప్‌టాప్‌లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. లెనోవా యోగా 9ఐ, యోగా 7ఐ, ఐడియాపాడ్ స్లిమ్‌ 5ఐ పేరుతో వీటిని తీసుకొస్తున్నారు. 11వ జనరేషన్‌ టైగర్ లేక్‌ ప్రాసెసర్‌, వెబ్‌కామ్‌ ప్రైవసీ షట్టర్‌తో పాటు... 

Published : 09 Jan 2021 00:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ చైనా కంపెనీ లెనోవో మూడు కొత్త ల్యాప్‌టాప్‌లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. లెనోవో యోగా 9ఐ, యోగా 7ఐ, ఐడియా పాడ్ స్లిమ్‌ 5ఐ పేరుతో వీటిని తీసుకొస్తున్నారు. 11వ జనరేషన్‌ టైగర్ లేక్‌ ప్రాసెసర్‌, వెబ్‌కామ్‌ ప్రైవసీ షట్టర్‌తో (వీడియో కాల్ మాట్లాడేప్పుడు మాత్రమే కెమెరా పనిచేస్తుంది) పాటు యోగా 9ఐ, 5ఐ మోడల్స్‌ డిస్‌ప్లేని 360 డిగ్రీల కోణంలో డిస్‌ప్లేని తిప్పుకోవచ్చు. అంతేకాకుండా 9ఐలో 4K డిస్‌ప్లే, అమెజాన్‌ అలెక్సా వాయిస్‌ అసిస్టెంట్ సపోర్ట్ వంటి ఫీచర్స్‌ ఇస్తున్నారు. ఇంకా వీటిలో ఎలాంటి ఫీచర్లున్నాయో ఓసారి చూద్దామా?

లెనోవా యోగా 9ఐ

యోగా సిరీస్‌లో వస్తున్న ప్రీమియం ల్యాప్‌టాప్. విండోస్‌ 10 హోమ్‌ లేదా విండోస్‌ 10 ప్రో ఓఎస్‌తో పనిచేస్తుంది. 14 అంగుళాల అల్ట్రా హెచ్‌డీ ఐపీఎస్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఇందులో పదకొండో జనరేషన్‌ ఇంటెల్‌ కోర్‌ ఐ7-1165జీ7 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇంటెల్‌ ఐరిస్‌ ఎక్స్‌ఈ గ్రాఫిక్స్‌ను ఇస్తున్నారు. నాలుగు స్పీకర్లు ఉన్నాయి. అందులో రెండు వూఫర్లు, రెండు ట్వీటర్స్‌. లిథియమ్‌ ఐయాన్‌ పాలిమర్‌ బ్యాటరీ ఉంది. ప్రైవసీ షట్టర్‌తో 1ఎంపీ వెబ్‌ కెమెరా ఇస్తున్నారు. అల్ట్రాసోనిక్‌ ఫింగర్‌ ప్రింట్ రీడర్‌, స్మార్ట్‌ సెన్సర్‌ టచ్‌పాడ్ కూడా ఉన్నాయి. 16జీబీ ర్యామ్ సపోర్ట్, 1టీబీ ఎస్‌ఎస్‌డీ స్టోరేజ్‌ సామర్థ్యం ఇస్తున్నారు. దీని ధర రూ.1,69,990. బ్లాక్‌ కలర్‌లో లభిస్తుంది.

లెనోవా యోగా 7ఐ

డిస్‌ప్లే మినహా 7ఐలో కూడా దాదాపు 9ఐ ఫీచర్లనే ఇస్తున్నారు. 15.6 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ఐపీఎస్‌ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే ఇస్తున్నారు. 11వ జనరేషన్‌ ఇంటెల్‌ కోర్‌ ఐ7 ప్రాసెసర్‌ ఉపయోగించారు. విండోస్‌ హోమ్‌ లేదా విండోస్‌ 10 ప్రో ఓఎస్‌తో పనిచేస్తుంది. ఇంటెల్ ఐరిస్‌ ఎక్స్‌ఈ గ్రాఫిక్స్‌ ఇస్తున్నారు. డాల్బీ అట్‌మోస్‌తో స్పీకర్ సిస్టం, ప్రైవసీ షట్టర్‌తో 1ఎంపీ వెబ్‌ కెమెరా ఉన్నాయి. బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 16 గంటల పాటు నిరంతరాయంగా పనిచేస్తుంది. 16జీబీ ర్యామ్ సపోర్ట్‌తో పాటు ఎస్‌ఎస్‌డీ స్టోరేజ్‌ సామర్థ్యం 1టీబీ ఉంది. దీని ధర రూ. 99,000. స్లేట్ గ్రే కలర్‌లో లభిస్తుంది. 

లెనోవా ఐడియాపాడ్ స్లిమ్‌ 5ఐ 

ఈ ల్యాప్‌టాప్ విండోస్‌ 10 హోమ్‌ ఓఎస్‌తో పనిచేస్తుంది. 14 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్‌ యాంటీ గ్లేర్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. 11వ జనరేషన్‌ ఇంటెల్ కోర్‌ ఐ7 టైగర్‌ లేక్‌ ప్రాసెసర్‌ ఉపయోగించారు. నివిడియా జీఈఫోర్స్‌ ఎమ్‌ఎక్స్‌459 గ్రాఫిక్స్‌ ఇస్తున్నారు. ప్రైవసీ షట్టర్‌తో 720పీ హెచ్‌డీ కెమెరా ఇస్తున్నారు. డాల్బీ ఆడియో సపోర్ట్‌తో రెండు స్పీకర్స్‌, ఫింగర్‌ ప్రింట్ రీడర్‌ ఉన్నాయి. కేవలం 15 నిమిషాల ఛార్జింగ్‌తో మూడు గంటల పాటు నిరంతరాయంగా పనిచేస్తుంది. 16జీబీ ర్యామ్‌/ 1టీబీ ఎస్‌ఎస్‌డీ స్టోరేజ్‌ సామర్థ్యం ఉన్నాయి. ఈ మోడల్ ధర రూ. 63,990. గ్రాఫైట్ గ్రే కలర్‌లో లభిస్తుంది. లెనోవా, అమెజాన్‌, లెనోవా ఆఫ్‌లైన్‌ స్టోర్లలో వీటిని కొనుగోలు చెయ్యొచ్చు.

ఇవీ చదవండి..

బాక్సులో ఆప్టిప్లెక్స్‌.. బడ్జెట్‌లో ప్రెసిషన్‌

వ్యాక్సిన్‌పై సందేహాలకు వాట్సాప్‌ చాట్‌బాట్‌?

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని