మోటో కొత్త ఫోన్‌: అంత ‘పవర్‌’ ఉందా?

భారత్‌లో లాంచ్‌ అయిన మోటోరోలా కొత్త స్మార్ట్‌ఫోన్‌... 

Updated : 05 Aug 2022 16:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బడ్జెట్‌ ధరలో, అంతకంటే కాస్త ఎక్కువ ధరలో మొబైల్స్‌ తీసుకొస్తూ అందరినీ ఆకర్షించిన మోటోరోలా తర్వాత నెమ్మదించింది. ‘మేకిన్‌ ఇండియా’ పేరుతో వస్తున్న చైనా మొబైల్స్‌ తాకిడితో వెనుకబడిపోయింది. అయితే, ఇప్పుడు మళ్లీ పుంజుకోవాలని చూస్తోంది. ఇందులో భాగంగా మోటో జీ9 పవర్‌ అనే బడ్జెట్‌ మొబైల్‌ను ఈ రోజు మన దేశంలో లాంచ్‌ చేసింది. 6000 ఎంఏహెచ్‌ బ్యాటరీ అనే కీలక ఫీచర్‌తో మార్కెట్‌లోకి వచ్చిన ఈ మొబైల్‌ ఎంత ‘పవర్‌’ఫుల్‌గా ఉందో చూద్దాం.

ఆగస్టులో మన దేశంలో లాంచ్‌ అయిన మోటో జీ9కు అదనపు హంగులు అద్ది మోటో జీ9 పవర్‌ను సిద్ధం చేశారు. 6.8 అంగుళాల హెచ్‌డీ ప్లస్‌ పంచ్‌ హోల్‌ డిస్‌ప్లే ఉంటుంది. వెనుకవైపు మూడు కెమెరాల సెటప్‌ ఉంటుంది. ఐపీ52 వాటర్‌ రిపెల్లెంట్‌ ఫీచర్‌ను ఇచ్చింది. క్వాల్‌కోమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 662 ప్రాసెసర్‌ ఇస్తున్నారు. ఆండ్రాయిడ్‌ 10 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పని చేసే ఈ మొబైల్‌లో 64 ఎంపీ ప్రధాన కెమెరా ఉంటుంది. ఇది కాకుండా 2 ఎంపీ సెకండరీ లెన్స్‌, 2 ఎంపీ డెప్త్‌ సెన్సర్‌ కూడా ఉంటాయి.  ముందువైపు 16 ఎంపీ కెమెరా ఇస్తున్నారు. 

4 జీబీ ర్యామ్‌, 128 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ ఉండే ఈ మొబైల్‌లో మెమొరీ కార్డుతో 512 జీబీ వరకు స్టోర్‌ చేసుకోవచ్చు. టైప్‌-సి పోర్టు ఉంటుంది. 6000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఇస్తున్నారు. ఇది 20 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్టు చేస్తుంది. సుమారు 221 గ్రాములు ఉండే ఈ మొబైల్‌ ధర ₹11,999. డిసెంబరు 15 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకాలు జరగనున్నాయి. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని