Netflix: ఆండ్రాయిడ్‌ యూజర్స్‌కి కొత్త ఫీచర్‌.. 

ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌పాం నెట్‌ఫ్లిక్స్‌ వినియోగదారుల కోసం సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక మీదట సబ్‌స్క్రైబర్స్‌ నెట్‌ఫ్లిక్స్‌ యాప్‌లో తమకు నచ్చిన సినిమా లేదా టీవీ షోలు డౌన్‌లోడ్ అవుతుండగానే చూడొచ్చని తెలిపింది. ఉదాహరణకు మీరు పది నిమిషాల క్రితం వీడియో డౌన్‌లోడ్ చేస్తే...

Published : 29 Jun 2021 23:42 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌పాం నెట్‌ఫ్లిక్స్‌ వినియోగదారుల కోసం సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక మీదట సబ్‌స్క్రైబర్స్‌ నెట్‌ఫ్లిక్స్‌ యాప్‌లో తమకు నచ్చిన సినిమా లేదా టీవీ షోలు డౌన్‌లోడ్ అవుతుండగానే చూడొచ్చని తెలిపింది. ఉదాహరణకు మీరు పది నిమిషాల క్రితం వీడియో డౌన్‌లోడ్ చేస్తే 60 శాతం డౌన్‌లోడ్ అయిన తర్వాత ఇంటర్నెట్ అందుబాటులో లేక వీడియో డౌన్‌లోడ్ ఆగిపోయింది. గతంలో అయితే డౌన్‌లోడ్ అయిన వీడియోను చూసేందుకు అవకాశం ఉండేది కాదు. తాజా అప్‌డేట్‌లో డౌన్‌లోడ్‌ అయిన వీడియోను ఆఫ్‌లైన్‌లో వీక్షించవచ్చు.  దీనివల్ల వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్షన్‌ అందుబాటులో లేని సబ్‌స్క్రైబర్స్ కూడా తమకు నచ్చిన కార్యక్రమాలను ఎలాంటి అంతరాయం లేకుండా వీక్షించవచ్చు. అలానే సదరు వీడియో తమకు నచ్చకుంటే మధ్యలోనే డౌన్‌లోడ్ అవ్వకుండా చెయ్యొచ్చని నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. 

‘‘కొన్నిసార్లు సరైన ఇంటర్నెట్ కనెక్షన్‌ లేక చాలా మంది వీడియో డౌన్‌లోడ్‌ మధ్యలో ఆగిపోతుంది. దానివల్ల తిరిగి ఇంటర్నెట్‌ వచ్చే వరకు డౌన్‌లోడ్ అయిన వీడియోలను చూసే అవకాశం ఉండదు. తాజా అప్‌డేట్‌లో వీడియో డౌన్‌లోడ్ మధ్యలో ఆగిపోయినా..అప్పటి వరకు డౌన్‌లోడ్ అయిన వీడియోను చూడొచ్చు’’ అని నెట్‌ఫ్లిక్స్‌ పేర్కొంది. ఒక వేళ వీడియో చూస్తున్నప్పుడు ఇంటర్నెట్‌ కనెక్షన్‌ అందుబాటులోకి వస్తే పూర్తి వీడియో డౌన్‌లోడ్  చేసుకోవడం లేదా ఆన్‌లైన్‌లో వీడియోను కొనసాగించే ఐచ్ఛికాన్ని వినయోగదారులకు అందిస్తున్నట్లు  వెల్లడించింది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను ఆండ్రాయిడ్ యూజర్స్‌కి మాత్రమే అందుబాటులో ఉన్నట్లు తెలిపింది. త్వరలోనే ఐఓఎస్ యూజర్స్‌కి కూడా అందుబాటులోకి తీసుకొస్తామని నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని