రెడ్మీ 10: మూడొచ్చాయ్.. మురిపించాయ్
మొబైల్స్ ఫీచర్లు, ధర , అమ్మకానికి వచ్చే తేదీలు తదితర వివరాలు...
ఇంటర్నెట్ డెస్క్: బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్లు తీసుకొచ్చే... రెడ్మీ ఈ ఏడాదిలో తొలి సిరీస్‌ను తీసుకొచ్చింది. రెడ్మీ 10 సిరీస్‌లో మొత్తంగా మూడు మొబైల్స్ భారతీయ మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ మూడు మోడల్స్‌లోనూ సూపర్ ఆమోలెడ్ డిస్ప్లే ఇవ్వడం గమనార్హం. ఎంఐ.కామ్, అమెజాన్, ఎంఐ హోమ్‌లో త్వరలో వీటి అమ్మకాలు మొదలవుతాయి. మరి ఆ మొబైల్స్ ఫీచర్లు, ధర , అమ్మకానికి వచ్చే తేదీలు తదితర వివరాలు చదివేయండి.
రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్
రెడ్మీ 10 సిరీస్‌లో ప్రో మ్యాక్స్ టాప్ మోడల్. ఇందులో వెనుకవైపు 108 ఎంపీ ప్రధాన కెమెరా కాగా, 8 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 5 ఎంపీ సూపర్ మాక్రో లెన్స్, 2ఎంపీ డెప్త్ సెన్సర్ ఇస్తున్నారు. 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ ఆమోలెడ్ డిస్ప్లే ఉంటుంది. దీని రిఫ్రెష్ రేట్ 120 హెడ్జ్, ఇది హెచ్డీఆర్ 10కు సపోర్టు చేస్తుంది. క్వాల్‌కోమ్ స్నాప్‌డ్రాగన్ 732 జీ ప్రాసెసర్, అడ్రినో 618 జీపీయూ ఉంటాయి. 5,020 ఎంఏహెచ్ బ్యాటరీ ఇస్తున్నారు. ఇది 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు చేస్తుంది. 2+1 డెడికేటెట్ మెమొరీ కార్డు స్లాట్ ఉంటుంది. అంటే రెండు సిమ్ కార్డులు, ఒక మెమొరీ కార్డు వాడుకోవచ్చు. 6 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమొరీ వెర్షన్ ధర ₹18,999. 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ మెమొరీ మోడల్ ధర, ₹19,999. 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ మెమొరీ డివైజ్ ధర ₹21,999. ఈ నెల 18 నుంచి ఈ మొబైల్స్ అందుబాటులోకి వస్తాయి.
రెడ్మీ నోట్ 10 ప్రో
రెడ్మీ నోట్ 10 ప్రోలో... కూడా వెనుకవైపు నాలుగు కెమెరాలు ఉంటాయి. 64 ఎంపీ ప్రధాన కెమెరా కాగా, 8 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 5ఎంపీ సూపర్ మాక్రో లెన్స్ 2ఎంపీ డెప్త్ సెన్సర్ ఇస్తున్నారు. 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ ఆమోలెడ్ డిస్ప్లే ఉంటుంది. దీని రిఫ్రెష్ రేట్ 120 హెడ్జ్, ఇది హెచ్డీఆర్ 10కు సపోర్టు చేస్తుంది. క్వాల్‌కోమ్ స్నాప్‌డ్రాగన్ 732 జీ ప్రాసెసర్, అడ్రినో 618 జీపీయూ ఉంటాయి. 5,020 ఎంఏహెచ్ బ్యాటరీ ఇస్తున్నారు. ఇది 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు చేస్తుంది. 2+1 డెడికేటెట్ మెమొరీ కార్డు స్లాట్ ఉంటుంది. అంటే రెండు సిమ్ కార్డులు, ఒక మెమొరీ కార్డు వాడుకోవచ్చు. 6 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమొరీ వెర్షన్ ధర ₹15,999. 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ మెమొరీ మోడల్ ధర, ₹16,999. 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ మెమొరీ డివైజ్ ధర ₹18,999. ఈ నెల 1 నుంచి ఈ మొబైల్స్ సేల్‌కి వస్తాయి.
రెడ్మీ నోట్ 10
రెడ్మీ నోట్ 10 వెనుకవైపు నాలుగు కెమెరాలు ఉంటాయి. 48 ఎంపీ ప్రధాన కెమెరా కాగా, 8 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపీ మాక్రో లెన్స్, 2 ఎంపీ డెప్త్ సెన్సర్ ఇస్తున్నారు. 13 ఎంపీ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. 6.43 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ ఆమోలెడ్ డిస్ప్లే ఉంటుంది. 180 హెడ్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉంటుంది. క్వాల్‌కోమ్ స్నాప్‌డ్రాగన్ 678 జీ ప్రాసెసర్ ఉంటుంది. అడ్రినో 612 జీపీయూ ఉంటుంది. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇస్తున్నారు. ఇది 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు చేస్తుంది. 2+1 డెడికేటెట్ మెమొరీ కార్డు స్లాట్ ఉంటుంది. అంటే రెండు సిమ్ కార్డులు, ఒక మెమొరీ కార్డు వాడుకోవచ్చు. 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమొరీ వెర్షన్ ధర ₹11,999. 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ మెమొరీ మోడల్ ధర, ₹13,999. ఈ నెల 16 నుంచి ఈ మొబైల్స్ సేల్‌కి వస్తాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వెబ్క్యామే స్కానర్
డెస్క్‌టాప్ ఉంది గానీ స్కానర్ లేదా? పోనీ వెబ్‌క్యామ్ అయినా ఉందా? అయితే దీన్నే స్కానర్‌లా వాడుకుంటే సరి. మ్యాక్‌లోనైతే- ఫొటో బూత్‌ను ఓపెన్ చేసి, డాక్యుమెంట్‌ను వెబ్‌క్యామ్ ముందుకు తీసుకురావాలి. -
ఐఓఎస్ 17.5 పబ్లిక్ బీటా వచ్చింది
ఐఓఎస్ 17.5 పబ్లిక్ బీటా అందుబాటులోకి వచ్చింది. అంటే డెవలపర్ అకౌంట్ లేకపోయినా తాజా ఫీచర్లు, అప్డేట్లను ఎవరైనా ప్రయత్నించొచ్చన్నమాట. ఐఓఎస్ 17.5 స్టేబుల్ వర్షన్ ఇప్పుడప్పుడే వచ్చే అవకాశం కనిపించటం లేదు. -
బహుబలి కెమెరా
అమెరికాలోని ఎస్ఎల్ఏసీ నేషనల్ యాక్సిలేటర్ లేబరేటరీ శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు ప్రపంచంలోనే అత్యంత శక్తిమంత కెమెరాను రూపొందించారు. -
పిక్సెల్ ఫోన్లలో లుకప్ ఫీచర్
గూగుల్ పిక్సెల్ ఫోన్ వాడేవారికి శుభవార్త. తెలియని నంబర్ల నుంచి కాల్ చేసే వారిని గుర్తించే లుకప్ ఫీచర్ అందుబాటులోకి రానుంది. దీన్ని ఇంతకుముందు జపాన్‌లో పరిచయం చేశారు గానీ ఇతర ప్రాంతాల్లో విడుదల చేయలేదు. -
మొబైల్ రోబో
వినూత్న ఫీచర్లతో కూడిన కొత్త టూల్స్‌తో టెక్నాలజీ రంగం శరవేగంగా విస్తరిస్తోంది. అలాంటి టూల్ ఒకటి ఇటీవలే విడుదలైంది. దీని పేరు ఎల్ఓఓఐ. ఇదో చిన్న డెస్క్‌టాప్ రోబో. -
మిమిక్రీ ఇంజిన్!
ప్రముఖ కృత్రిమ మేధ కంపెనీ ఓపెన్ఏఐ తాజాగా వాయిస్ అసిస్టెంట్ రంగంలోకి అడుగుపెట్టింది. ఇందులో భాగంగా వాయిస్ ఇంజిన్ అనే వినూత్న టూల్‌ను పరిచయం చేసింది. -
కొత్త సర్ఫేస్ ల్యాప్‌టాప్‌లు
వాణిజ్య అవసరాలను దృష్టిలో పెట్టుకొని మైక్రోసాఫ్ట్ సంస్థ ఏఐ ఆధారిత సర్ఫేస్ ప్రొ 10, సర్ఫేస్ ల్యాప్‌టాప్ 6 పరికరాలను పరిచయం చేసింది. ఇంటెల్ కోర్ అల్ట్రా ప్రాసెసర్‌తో కూడిన ఇవి విండోస్ 11 ప్రొ మీద పనిచేస్తాయి. 5జీ కనెక్టివిటీ కూడా ఉంటుంది. -
జంతువుల రంగుల లోకాన్ని చూపించే కెమెరా
జంతువులు, పక్షులు, తేనెటీగలకు ఈ ప్రపంచం ఏ విధంగా కనిపిస్తుంది? మనం చూసే రంగులు వాటికీ కనిపిస్తాయా? చాలామందికి ఇలాంటి సందేహం వచ్చే ఉంటుంది. -
ఉంగరమే న్యూట్రిషనిస్ట్
సామ్సంగ్ ఇటీవల గెలాక్సీ రింగ్‌ను పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఇది రోజూ తినే ఆహారం విషయంలోనూ సూచనలు ఇవ్వగలదని చెబుతున్నారు. యూజర్ల శరీర ఎత్తు బరువుల నిష్పత్తి (బీఎంఐ) ఆధారంగా ఎన్ని కేలరీల శక్తినిచ్చే ఆహారం తినాలో సూచిస్తుంది. -
రియల్మీ నుంచి నార్జో 70 ప్రొ 5జీ ఫోన్లు
రియల్మీ సంస్థ నార్జో 70 ప్రొ 5జీ ఫోన్‌ను పరిచయం చేసింది. ఎయిర్ జెశ్చర్స్ శ్రేణిలో ఇదే తొలి ఫోనని కంపెనీ పేర్కొంటోంది. -
ఐఫోన్ కిటుకులు
ఐఫోన్లో ఎన్నో ఫీచర్లు. తెలియనివి ఎన్నెన్నో. తెలిసినా చప్పున గుర్తుకు రాకపోవచ్చు కూడా. కొత్తగా కొన్నవారైనా, తాజా వర్షన్‌కు అప్డేట్ చేసుకున్నవారైనా, చాలాకాలం నుంచి వాడుతున్నవారైనా.. వీటి గురించి తెలుసుకుంటే చిటికెలో పనులు పూర్తిచేసుకోవచ్చు. -
ఫొటో కటౌట్ చిటికెలో
ఫొటోలో వెనక దృశ్యాలను తొలగించి, కటౌట్ చేయటం పెద్ద పని. అడోబ్ ఫొటోషాప్, ఏఐ టూల్స్ వంటి అధునాతన సాధనాలు అవసరం. -
సెల్ సర్వీసు మొరాయిస్తే?
ఎప్పుడైనా సెల్‌ఫోన్ సర్వీసు సరిగా పనిచేయకపోతే ఫోన్‌ను ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో పెట్టి, కాసేపు వేచి చూడాలి. తర్వాత ఫోన్‌ను యథాస్థితికి తేవాలి. దీంతో ఫోన్ సమీపంలోని సెల్ టవర్‌తో కనెక్ట్ అవుతుంది -
పాస్వర్డ్ మేనేజర్ భద్రమేనా?
భద్రత, బ్యాకప్ టూల్స్‌గా పాస్వర్డ్ మేనేజర్స్ ఉపయోగపడతాయి. వీటితో పాస్‌వర్డ్‌లను గుర్తుపెట్టుకోవటం, ప్రతీసారీ పాస్‌వర్డ్‌ను టైప్ చేయటం తప్పుతాయి. కానీ చాలామంది వీటిని వాడుకోరు. హ్యాకర్లు పాస్‌వర్డ్‌లను దొంగిలించే ప్రమాదముందని భావించటం దీనికి ఒక కారణం. అందువల్ల ఇవి మంచివేనా? అనే అనుమానం కలుగుతుంటుంది. -
ఐఫోన్‌కు మరింత భద్రత
యాపిల్ సంస్థ ఐఓఎస్ 17.3 బీటాతో ఐఫోన్ల కోసం గొప్ప భద్రత ఫీచర్‌ను పరిచయం చేసింది. దీని పేరు స్టోలెన్ డివైస్ ప్రొటెక్షన్. పేరుకు తగ్గట్టుగానే ఫోన్‌ను ఎవరైనా దొంగిలించినప్పుడు యాపిల్ ఖాతాను కాపాడుకోవటానికిది ఉపయోగపడుతుంది. బహిరంగ ప్రదేశాల్లో ఐఫోన్ దొంగతనాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టారు. -
ఇక మొబైల్ ఫోనే టీవీ
రేడియో, ఫోన్లలోని రిసీవర్ ఆయా ఫ్రీక్వెన్సీలను గ్రహించి ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు ప్రసారం చేస్తాయి కదా. డీ2ఎం పరిజ్ఞానమూ దీన్నే పోలి ఉంటుంది. కాకపోతే ఇది వీడియోలను ప్రసారం చేస్తుంది. ఇంట్లో టీవీ కార్యక్రమాలను రోజూ చూస్తూనే ఉంటాం. మొబైల్ ఫోన్లో యూట్యూబ్‌లోనూ అప్పుడప్పుడు వీటిని వీక్షిస్తుంటాం. -
పాత ప్రింటర్‌ను అమ్ముతున్నారా?
ప్రింటర్‌తో ఎన్నెన్నో డాక్యుమెంట్లు ప్రింట్ చేస్తూనే ఉంటాం. అప్పుడప్పుడూ రహస్య సమాచారంతో కూడిన పత్రాలనూ ప్రింట్ చేస్తుంటాం. ఇవన్నీ వ్యక్తిగత సమాచారం రూపంలో నిక్షిప్తమై ఉంటాయి. -
నచ్చిన ఫొటోల స్లైడ్‌షో
ఇష్టమైన ఫొటోలను స్లైడ్ షోగా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది కదా. విండోస్ పీసీ వాడేవారు తమకు తామే దీన్ని సృష్టించుకోవచ్చు. నచ్చిన వాల్పేపర్లు, ఫొటోలను ఒక ఫోల్డర్లో వేయాలి. -
ఫొటో అసలుదేనా?
ఆన్లైన్లో ఎన్నో ఫొటోలు. అన్నీ అసలువే కాకపోవచ్చు. కొన్ని నకిలీ ఫొటోలూ ఉండొచ్చు. కృత్రిమ మేధ సృష్టిస్తున్న ఫొటోలతో ఈ బెడద మరింత ఎక్కువైంది కూడా. -
కీబోర్డు మీద వేళ్ల ప్రయాణం!
కీబోర్డు మీద చకచకా టైప్ చేస్తుంటాం గానీ ఆ సమయంలో చేతి వేళ్లు ఎంత దూరం ప్రయాణించాయో ఎప్పుడైనా లెక్కించారా? చేతి వేళ్లు ప్రయాణించటమేంటని అనుకుంటున్నారా? మరేమీ లేదు. -
వినూత్నం మృదు రోబో
ఎటంటే అటు వంగే మృదువైన రోబోల విషయంలో నార్త్ కరోలీనా స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గొప్ప పురోగతిని సాధించారు. ట్విస్టెట్ రింగ్‌బాట్స్‌ను రూపొందించి సంచలనం సృష్టించారు.
తాజా వార్తలు (Latest News)
-
30 వైడ్ బాడీ విమనాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్‌ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్‌స్టీన్‌కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM