New Smartphones: పవర్‌ షేర్‌ ఫీచర్‌తో శాంసంగ్‌.. ఎక్స్‌టెండ్‌ ర్యామ్‌తోవివో కొత్త మోడల్స్‌

2022లో కొత్త ఫోన్ల విడుదలను శాంసంగ్, వివో కంపెనీలు ప్రారంభించాయి. మరి ఈ కంపెనీలు విడుదల చేసిన మోడల్స్‌, అందులో ఫీచర్లపై ఓ లుక్కేద్దాం.

Published : 05 Jan 2022 02:04 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: 2022లో స్మార్ట్‌ఫోన్‌ విడుదలను వివో, శాంసంగ్‌ కంపెనీలు ప్రారంభించాయి. వివో వై21టీ (Vivo Y21T) మోడల్‌ను, శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌21 ఎఫ్‌ఈ (Smasung Galaxy S21 FE) మోడల్‌ను విడుదల చేశాయి. మరి కొత్త ఏడాదిలో విడుదలైన మొదటి రెండు మోడల్స్‌లో ఎలాంటి ఫీచర్లున్నాయి? వాటి ధరెంత? ఎప్పట్నుంచి అమ్మకాలు ప్రారంభంకానున్నాయనేది తెలుసుకుందాం.


వివో వై21 టీ 

ఈ ఫోన్‌లో 90 హెర్జ్ రిఫ్రెష్‌ రేట్‌తో 6.58 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇస్తున్నారు. స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఫన్‌టచ్‌ఓఎస్ 12 ఓఎస్‌తో వై21 టీ పనిచేస్తుంది. ఇందులో మొత్తం నాలుగు కెమెరాలున్నాయి. వెనుక మూడు, ముందు ఒకటి. వెనుకవైపు 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు, రెండు 2 ఎంపీ కెమెరాలు ఇస్తున్నారు. ముందుభాగంలో 8ఎంపీ కెమెరా అమర్చారు. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 18 వాట్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 4 జీబీ ర్యామ్‌+ 1 జీబీ వర్చువల్ ర్యామ్‌/ 128 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్ ధర రూ. 16,490. వివో ఇండియా వెబ్‌సైట్‌తోపాటు అన్ని రిటైల్‌ స్టోర్ల నుంచి ఈ ఫోన్‌ను కొనుగోలు చేయొచ్చు. 


శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌21 ఎఫ్‌ఈ

ఆండ్రాయిడ్ 12 ఓఎస్‌ ఆధారిత వన్‌ యూఐ4 ఓఎస్‌తో పనిచేస్తుంది. 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌, 240 హెర్జ్‌ టచ్‌ శాంప్లింగ్ రేట్‌తో 6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డైనమిక్‌ అమోల్ 2ఎక్స్‌ డిస్‌ప్లేను ఇస్తున్నారు. ఇందులో స్నాప్‌డ్రాగన్‌ 888, ఎక్సినోస్‌ 2100 ప్రాసెసర్లను ఉపయోగించారు. అయితే వీటిలో ఏ ప్రాసెసర్‌ను భారత మార్కెట్లో ఉపయోగించారనేది తెలియాల్సివుంది. ఈ ఫోన్‌లో వెనుక మూడు, ముందు ఒక కెమెరా ఇస్తున్నారు. వెనుకవైపు 12 ఎంపీ ప్రధాన కెమెరాతోపాటు 12 ఎంపీ అల్ట్రావైడ్‌ యాంగిల్‌, 8 ఎంపీ టెలీషూట్ కెమెరాలున్నాయి. ముందు 32 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు. 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 25 వాట్ వైర్‌, 15 వాట్ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్‌లో శాంసంగ్ వైర్‌లెస్‌ పవర్‌షేర్ ఫీచర్‌ కూడా ఉంది. ఇందులోని వైర్‌లెస్‌ ఛార్జింగ్ ఫీచర్‌తో ఇతర డివైజ్‌లను కూడా ఛార్జ్‌ చేయొచ్చు. 

శాంసంగ్ గెలాక్సీ ఎస్‌21 ఎఫ్‌ఈను 8 జీబీ ర్యామ్‌/ 128 జీబీ స్టోరేజ్‌, 8జీబీ ర్యామ్‌/256 జీబీ వేరియంట్‌లో తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోన్‌ బ్రిటన్‌ మార్కెట్లో అందుబాటులో ఉంది. అక్కడ ఈ మోడల్‌ ప్రారంభ ధర 699 జీబీపీ (సుమారు రూ. 70 వేలు). ప్రపంచవ్యాప్తంగా జనవరి 11 నుంచి అమ్మకాలు ప్రారంభకానున్నాయి. 

Read latest Gadgets & Technology News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని