WhatsApp: ఇకపై వాళ్లు మీ వాట్సాప్‌ లాస్ట్‌ సీన్‌, ఆన్‌లైన్ స్టేటస్‌ చూడలేరు!

వాట్సాప్‌ సరికొత్త సెక్యూరిటీ అప్‌డేట్‌ను తీసుకొచ్చింది. దీంతో కొత్త వాళ్లెవరూ మీ వాట్సాప్‌ లాస్ట్‌ సీన్‌.. ఆన్‌లైన్ స్టేటస్‌ను చూడలేరు. ఆ విశేషాలేంటో తెలుసుకోండి!

Updated : 13 Dec 2021 15:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వాట్సాప్‌ తన యూజర్లకు మరో కొత్త సెక్యూరిటీ అప్‌డేట్‌ను తీసుకొచ్చింది. ఇంతకముందు మనకు తెలియని, వాట్సాప్‌లో లేని కాంటాక్ట్‌లకు కూడా మన ఆన్‌లైన్‌ స్టేటస్‌, లాస్ట్‌ సీన్‌ కనిపించేవి. ఇకమీదట అలా కుదరదు. ఇతరుల మీద, వారికి తెలియకుండానే నిఘా పెట్టేవారికి కొత్త అప్‌డేట్ చెక్‌ పెట్టనుంది. ఈ ప్రైవసీ అప్‌డేట్‌తో వాళ్లు, మీ వాట్సాప్‌ లాస్ట్‌ సీన్‌, ఆన్‌లైన్ స్టేటస్‌ను చూడలేరు. భద్రతాపరంగా ఈ అప్‌డేట్‌ యూజర్లకు ఎంతో ఉపయోగకరం. థర్డ్‌ పార్టీ యాప్స్‌ లేదా ఎవరైనా కొత్త వ్యక్తులు మనపై నిఘా వేయకుండా ఈ ఫీచర్‌ అడ్డుకుంటుంది.

వాట్సాప్‌ తన యూజర్లకు త్వరలో  ఇంకో ఫీచర్‌ను పరిచయం చేయనుంది. మీడియా ఫైల్‌ను పంపించేటప్పుడు ఎవరెవరికి పంపించాలో ఎడిట్‌ చేసుకోవచ్చు. ప్రస్తుతం వాట్సాప్‌లో ఏదైనా ఫొటో, వీడియో, డాక్యుమెంట్లు లేదా ఇతర ఫైల్స్‌ను చాట్‌లో ఉన్న వ్యక్తికి మాత్రమే పంపే వీలుంది. ఈ ఫీచర్‌ అందుబాటులోకి వస్తే వినియోగదారులు వేరే చాట్‌ స్క్రీన్‌లో ఉన్నప్పటికీ  కాంటాక్ట్‌లను ఎడిట్‌ చేసి పంపించొచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్‌ బీటా అప్‌డేట్‌లో మాత్రమే ఉంది. బీటా టెస్టర్లకు అందుబాటులోకి రావడానికి మరికొంత సమయం పట్టొచ్చు. ఇక పూర్తి స్థాయి యూజర్లకు ఈ అప్‌డేట్‌ ఎప్పుడొస్తుందో కచ్చితంగా చెప్పలేం.

Read latest Tech & Gadgets News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని