ఈ యాప్‌.. మీ కళ్లను కాపాడుతుంది

కావాల్సిన సమయం మేరకు ఈయాప్‌ పనిచేసేలా సమయాన్ని ముందుగానే సెట్టింగ్స్‌లో ఆప్షన్‌ను పెట్టుకోవచ్చు

Updated : 09 Jul 2021 20:14 IST

 ‘ఐస్‌కీపర్‌’తో మీ నేత్రాలకు రక్షణ

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా కారణంగా జగమంతా ఆన్‌లైన్‌గా మారింది. చిన్నా, పెద్దా తేడాలేకుండా గంటల తరబడి ఫోన్లకు అతుక్కుపోతున్నారు. దీంతో ఇటీవల కాలంలో కంటిచూపు సమస్యలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. చిన్న వయస్సు నుంచే చూపు మసకబారిపోవడం.. కళ్లద్దాలు పెట్టుకోవడం.. ఈ మధ్య పెరిగింది. దీనికి పరిష్కారమార్గంగా ‘ఐస్‌ కీపర్‌’ యాప్‌ని తీసుకొచ్చింది ఎలక్ట్రానిక్‌ వస్తువులను తయారు చేసే ఓ ఫ్రెంచ్‌స్టూడియో ‘హైల్యాబ్‌’.  ఈ యాప్‌లోని డిటెక్షన్‌ సిస్టమ్... ఫోన్‌కి తగినంత దూరంగా కూర్చున్నప్పుడే స్క్రీన్‌ .. సరిగ్గా కనిపించేలా చేస్తుంది‌. అలా కాకుండా ఫోన్‌, కళ్లూ రెండూ దగ్గరదగ్గరగా ఉంటే వెంటనే స్క్రీన్‌ అంతా బ్లర్‌ అయిపోయి.. ఏది సరిగ్గా కనిపించకుండా పోతుందట. అంతేకాదు.. కావాల్సిన సమయం మేరకు ఈ యాప్‌ పనిచేసేలా సమయాన్ని ముందుగానే సెట్టింగ్స్‌లో పెట్టుకోవచ్చు. ప్రస్తుతం ఈ యాప్‌ గూగుల్‌ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్నట్లు హైల్యాబ్‌ సంస్థ పేర్కొంది. అయితే, భారతీయులకు దీన్ని సద్వినియోగం చేసుకునే అవకాశం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని