WhatsApp: వాట్సాప్ కొత్త ఫీచర్.. మెసేజ్ ఎవరు పంపారో సులభంగా తెలుస్తుంది
వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్ యూజర్స్‌కు అందుబాటులోకి రానుంది. దీని సాయంతో యూజర్స్ మెసేజ్ ఎవరు పంపారనేది సులభంగా తెలుసుకోవచ్చు.
ఇంటర్నెట్‌డెస్క్: వాట్సాప్‌లో మన గురించి ఇతరులకు తెలిసేలా ప్రొఫైల్ ఫొటో/డీపీ (డిస్ప్లే పిక్చర్)గా ఫొటో, గ్రాఫిక్ ఇమేజ్ లేదా కొటేషన్స్ పెడుతుంటాం. తాజాగా వాట్సాప్ ఈ ఫీచర్లో కీలక అప్డేట్ను యూజర్లకు పరిచయం చేయనుంది. ఇకమీదట వాట్సాప్‌లో ఎవరి నుంచైనా మెసేజ్ వస్తే వారి ప్రొఫైల్ ఫొటో ఆండ్రాయిడ్ ఫోన్లోని లాక్ స్క్రీన్ నోటిఫికేషన్స్‌లో, ఐఫోన్‌లోని నోటిఫికేషన్ సెంటర్లో కనిపిస్తుంది. కొత్త ఏడాదిలో వాట్సాప్ నుంచి వస్తున్న మొదటి ఫీచర్ ఇదేనని టెక్ వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం ఈ ఫీచర్ ఐఓఎస్ బీటా యూజర్స్‌కు అందుబాటులో ఉంది. త్వరలోనే పూర్తి స్థాయిలో యూజర్స్‌కు పరిచయం చేయనున్నట్లు వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్ వాట్సాప్ బీటా ఇన్ఫో (వాబీటాఇన్ఫో) తెలిపింది. వాట్సాప్‌లో మెసేజ్ నోటిఫికేషన్ తరహాలోనే ఈ ఫీచర్ పనిచేస్తుందని వాబీటాఇన్ఫో వెల్లడించింది. దీంతో ఎవరు మెసేజ్ పంపారనేది సులభంగా తెలుస్తుంది. గతంలో ఎవరైనా వాట్సాప్ మెసేజ్ పంపితే వారి నంబర్/పేరు, మెసేజ్ మాత్రమే కనిపించేవి. తాజాగా అప్డేట్తో వారి ప్రొఫైల్ ఫొటో కూడా కనిపిస్తుంది.
ఇప్పటికే ప్రొఫైల్ ఫొటో ప్రైవసీకి సంబంధించి వాట్సాప్ కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. ఈ ఫీచర్‌తో మన ప్రొఫైల్ ఫొటో ఎవరు చూడాలనేది మనమే నిర్ణయించవచ్చు. ఇందుకోసం వాట్సాప్ సెట్టింగ్స్‌లో ప్రైవసీలోకి వెళ్లి ప్రొఫైల్ ఫొటో ఫీచర్ ఓపెన్ చేస్తే అందులో ఎవ్రీవన్ (Everyone), మై కాంటాక్ట్స్ (My Contacts), నోబడీ (Nobody) అనే మూడు ఆప్షన్లు ఉంటాయి. వాటిలో ఎవ్రీవన్ సెలెక్ట్ చేస్తే ఎవరైనా మీ ప్రొఫైల్ ఫొటోను చూడొచ్చు. మై కాంటాక్ట్స్ సెలెక్ట్ చేస్తే మీ కాంటాక్ట్ లిస్ట్‌లోని వారు మాత్రమే చూస్తారు. నోబడీ సెలెక్ట్ చేస్తే మీ కాంటాక్ట్ లిస్ట్ వారితో సహా ఇతరులెవరూ డీపీని చూడలేరు. 2022లో వాట్సాప్ మరిన్ని కొత్త ఫీచర్స్‌ను యూజర్స్‌కు పరిచయం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ జాబితాలో ఎమోజీ రియాక్షన్, కమ్యూనిటీస్, ట్రాన్స్‌స్క్రైబింగ్ వాయిస్ మెమొస్, డిలీట్ మెసేజ్ టైమ్ లిమిట్, గ్రూప్ అడ్మిన్లకు మెసేజ్ డిలీట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
► Read latest Gadgets & Technology News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వాట్సప్ ఛాట్ ఫిల్టర్
వాట్సప్ గత కొన్నిరోజులుగా గోప్యతను కాపాడుతూనే ఎన్నో వినూత్న ఫీచర్లు పరిచయం చేస్తోంది. ఎక్కువ మందికి మెటా ఏఐని అందుబాటులోకి తేవటం దగ్గరి నుంచి యాప్ నుంచే బస్ టికెట్లు కొనుక్కోవటానికి వీలు కల్పించటం వరకూ ఎన్నో సదుపాయాలను ఆరంభించింది. -
సైన్ఇన్ లేకుండానే ఛాట్‌జీపీటీ
ఛాట్‌జీపీటీని వాడుకోవాలంటే ముందు సైన్ఇన్ కావాల్సి ఉంటుంది. పాస్‌వర్డ్‌ను మరచిపోవటం వంటి సందర్భాల్లో ఇది కష్టంగా అనిపిస్తుంటుంది. -
ఎక్స్‌లో కమ్యూనిటీ నోట్స్
ఎన్నికలకు సన్నద్ధం అవుతున్న తరుణంలో ఎక్స్ (ట్విటర్) మనదేశంలో కమ్యూనిటీ నోట్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్‌కు కంట్రిబ్యూట్ చేయటానికి కొత్తవారికీ ఆహ్వానం పలికింది -
వైఫై పాస్వర్డ్ మరిచారా?
ఇంటికి వచ్చిన అతిథులో, పరిచయం ఉన్నవారో వైఫై పాస్వర్డ్ అడుగుతుంటారు. చాలాసార్లు అదేంటో గుర్తుకురాదు. మరెలా? చేతిలో ఫోన్ ఉంటే ఇట్టే తెలుసుకోవచ్చు. ఐఫోన్ వాడేవారైతే- సెటింగ్స్ ద్వారా వైఫై విభాగంలోకి వెళ్లాలి. -
సైబర్ నేరాలకు చక్షు కళ్లెం
మోసపూరిత కాల్స్, మెసేజ్‌ల వంటి సైబర్ నేరాలను అరికట్టటానికి టెలికం విభాగం కొత్త పోర్టల్‌ను పరిచయం చేసింది. సంచార్ సాథీ కార్యక్రమంలో భాగంగా తీసుకొచ్చిన దీని పేరు చక్షు. -
యాపిల్ పాడ్‌కాస్ట్‌లు అక్షరాల్లో..
పాడ్‌కాస్ట్‌లు ఎంత పాపులర్ అవుతున్నాయో చూస్తూనే ఉన్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకునే యాపిల్ సంస్థ పాడ్‌కాస్ట్‌లను మరింత విస్తృతంగా అందుబాటులోకి తేవటానికి, వాటిల్లోని అంశాలను, విషయాలను తేలికగా కనుక్కోవటానికి ఓ వినూత్న ఫీచర్‌ను ప్రవేశపెట్టింది -
ఫొటోతోనే వీడియో..
షేక్స్పియర్ స్వగతాన్ని మోనాలిసా పాట రూపంలో పాడితే? అదెలా సాధ్యమని ఆశ్చర్యపోకండి. కృత్రిమ మేధ(ఏఐ)తో ఇలాంటి అద్భుతాలు ఎన్నయినా చేయొచ్చు -
చిటికెలో వెబ్సైట్
కొద్ది నిమిషాల్లో వెబ్‌సైట్‌ను సృష్టించుకోవాలని అనుకుంటున్నారా? అయితే విక్స్ ఏఐ వెబ్సైట్ బిల్డర్ సాయం తీసుకోవచ్చు. ఇది ఏఐ ఛాట్‌బాట్ సాయంతో సెకండ్లలోనే వెబ్‌సైట్‌ను తయారుచేస్తుంది మరి. -
మన డ్రోన్ ఉపగ్రహం!
డ్రోన్ల గురించి తెలిసిందే. వేడుకల్లో వీడియోలు తీయటం దగ్గరి నుంచి పొలాల్లో మందులు చల్లటం వరకూ రకరకాల పనులకు ఉపయోగపడుతున్నాయి. మరి ఇవి ఉపగ్రహం మాదిరిగానూ పనిచేస్తే? అలా ఉపయోగపడగల మానవరహిత బుల్లి విమాన వాహనాన్ని (అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్- యూఏవీ) బెంగళూరులోని నేషనల్ ఏరోస్పేస్ ల్యాబోరేటరీస్ (ఎన్ఏఎల్) గతవారం విజయవంతంగా పరీక్షించింది. -
వాట్సప్‌లో ఫేవరెట్స్ ట్యాబ్
వాట్సప్ ఛాట్స్ జాబితాలో ఇష్టమైన కాంటాక్టులను కనుక్కోవటం కష్టంగా ఉందా? త్వరలోనే దీనికి పరిష్కారం లభించనుంది. కొత్తగా ఫేవరెట్స్ ట్యాబ్‌ను పరిచయం కానుంది. దీన్ని ప్రస్తుతం ఐఓఎస్, వెబ్ యూజర్ల కోసం పరీక్షిస్తున్నారు. -
ఎక్స్ క్యాచీ శుభ్రం
ఎక్స్ (ట్విటర్) మొబైల్ యాప్ ఫోన్లో, ట్యాబ్లెట్లో క్యాచ్డ్ ఫైళ్లను నిల్వ చేస్తుందని తెలుసా? ఒకవేళ ఫోన్లో స్టోరేజీ నిండుకుంటున్నట్టయితే ఎక్స్ వెబ్, మీడియా క్యాచీని తొలగించుకోవటం తేలికైన, సత్వర పరిష్కార మార్గంగా ఉపయోగపడుతుంది. -
టెక్ చిట్కాలు
ఇన్స్టాగ్రామ్ యూజర్లు ఇకపై బయోలో ఐదు లింకుల వరకు యాడ్ చేసుకోవచ్చు. యాప్‌లో లాగిన్ అయ్యాక అకౌంట్ సెటింగ్స్‌ను ఓపెన్ చేయాలి. మన ఫొటో దిగువన ఉండే ఎడిట్ ప్రొఫైల్లోకి వెళ్లి యాడ్ లింకును క్లిక్ చేయాలి. షేర్ చేయాలనుకునే లింకు జత చేసుకుంటే సరి. -
ప్రైవసీ విధాన వివరాలు తేలికగా ..
వెబ్సైట్లకు ప్రైవసీ పాలసీలు ఉండటం తెలిసిందే. వీటిని చాలామంది పెద్దగా పట్టించుకోరు. ఒకవేళ ఆయా విధానాలను చదవాలన్నా పెద్దగా ఉంటాయి. -
యూట్యూబ్ వీడియో ఆడియోగా మారితే
యూట్యూబ్ అంటే ఎప్పుడూ చూడటమేనా? రేడియో మాదిరిగా పాటలు, సంగీతాన్ని వినలేమా? కొన్నిసార్లు ఇలాగే అనిపిస్తుంటుంది. వీడియోలను ఆడియో ఫైళ్లుగా సేవ్ చేసుకుంటే ఇది సాధ్యమే -
సోషల్ ఖాతా హ్యాక్ అయితే?
ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్.. ఇలా ఎన్నెన్నో సామాజిక మాధ్యమాలు. అభిప్రాయాలు పంచుకోవటానికైనా.. చుట్టుపక్కల సమాచారాన్ని తెలుసుకోవటానికైనా ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి -
అనవసర జీమెయిళ్ల తొలగింపు తేలికగా
అనవసర ఈమెయిళ్లు చాలా చికాకు కలిగిస్తాయి. రోజురోజుకీ ఇన్‌బాక్స్‌లో నిండిపోతూ వస్తుంటాయి. కొన్నిసార్లు వీటిని డిలీట్ చేయటానికే సమయమంతా వెచ్చించాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. -
మెయిల్‌కు జవాబు మరుస్తుంటే?
మెయిల్‌ను చదువుతాం. తర్వాత జవాబిద్దామని అనుకుంటాం. తీరా మరచిపోతాం. ఎప్పటికో గానీ గుర్తుకురాదు. చాలాసార్లు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటూనే ఉంటాం కదా. -
ఫోన్ టైపింగ్ వేగంగా
స్మార్ట్‌ఫోన్‌లో వేగంగా టైప్ చేయాలనుకుంటున్నారా? అయితే టెక్స్ట్ రిప్లేస్మెంట్ సాయం తీసుకోండి. దీంతో పెద్ద పదబంధాలకు షార్ట్‌కట్స్‌ను సెట్ చేసుకుంటే చాలా సమయం ఆదా అవుతుంది. -
స్నాప్‌చాట్ లైవ్ లొకేషన్‌తో భద్రం
మీ పిల్లలు స్నాప్‌ఛాట్ వాడుతున్నారా? కాస్త జాగ్రత్త. దీనిలోని లైవ్ లొకేషన్ ఫీచర్‌ను కొందరు దుర్వినియోగం చేయొచ్చు. పిల్లలు ఎక్కడున్నారో గుర్తించొచ్చు. -
మన మెయిల్ మనకే!
కొత్త సంవత్సరంలో లక్ష్యాలు నిర్దేశించుకున్నారా? వాటిని ఎంతవరకు సాధించారో ఎప్పటికప్పుడు సమీక్షించుకోవటం ఎంతైనా మేలు చేస్తుంది. ఇంకా చేయాల్సిందేంటి? ఎలా చేయాలి? అనేవి నిర్ణయించుకోవటానికి వీలవుతుంది -
ఛాట్‌జీపీటీకి సమాచారమా?
ఛాట్‌జీపీటీ వాడుతున్నారా? దీనికి వ్యక్తిగత వివరాలూ ఇస్తున్నారా? అయితే జాగ్రత్త పడాల్సిందే. ఛాట్‌జీపీటీకి మనం ఇచ్చే సమాచారమంతా భవిష్యత్ ఏఐ నమూనాలకు తర్ఫీదు ఇవ్వటానికి ఉపయోగపడుతుంది. మున్ముందు ఇదెక్కడికి దారితీస్తుందో ఎవరికీ తెలియదు.
తాజా వార్తలు (Latest News)
-
బోన్‌మ్యారో మార్పిడితో యువకుడికి పునర్జన్మ
-
సీఎం వస్తున్నారని.. సాగునీటి కాలువను పూడ్చేశారు
-
ముంబయి జట్టుకు ఎక్కువ కాలం ఆడితే బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
-
గుంతల దారులు.. బూతు మాటలు!: ఇవే ‘గుడివాడ’లో గెలుపోటములు తేల్చేవి
-
ఇరాన్‌తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్‌కు అమెరికా హెచ్చరిక
-
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి: ఆర్బీఐకి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచన