VIVO: 2 నెలల వ్యవధి.. 11 ఫోన్లు విడుదల

స్మార్ట్‌ఫోన్‌ అభిమానులారా సిద్ధంగా ఉండండి.. రెండు నెలల వ్యవధిలో వివోకు చెందిన దాదాపు పదకొండు మొబైల్ ఫోన్లు మార్కెట్లోకి వచ్చేయబోతున్నాయి...

Published : 17 Feb 2021 19:07 IST

ప్రణాళికలు సిద్ధం చేస్తున్న వివో సంస్థ

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్మార్ట్‌ఫోన్‌ అభిమానులారా సిద్ధంగా ఉండండి.. రెండు నెలల వ్యవధిలో వివోకు చెందిన దాదాపు పదకొండు మొబైల్ ఫోన్లు మార్కెట్లోకి వచ్చేయబోతున్నాయి. వివో X60 సిరీస్‌, వివో V21 సిరీస్‌, వివో S9 స్మార్ట్‌ఫోన్లను విపణిలోకి తెచ్చేందుకు వివో ప్రణాళికలు రూపొందించినట్లు టెక్‌ వర్గాలు పేర్కొన్నాయి. వివో X50, X60 సిరీస్‌తోపాటు ఇతర స్మార్ట్‌ఫోన్లను భారత్‌లో విడుదల చేసేందుకు వివో సంస్థ సిద్ధమవుతోందనే వార్తలు వచ్చాయి. తొలుత 5G టెక్నాలజీతో వివో S9, వివో V21 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లను వినియోగదారుల కోసం తీసుకురానుంది. V21 ప్రొ స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కోమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 765G చిప్‌సెట్‌తో వస్తోందని, అయితే ధర కాస్త ఎక్కువగా ఉండే అవకాశముందని టెక్ వర్గాలు పేర్కొన్నాయి. అలానే వివో V21, వివో V21E స్మార్ట్‌ఫోన్లు 4G టెక్నాలజీతో రానున్నాయి.


వివో తీసుకురాబోయే స్మార్ట్‌ఫోన్లు ఇవేనా..?

* వివో X60 సిరీస్‌
* వివో X50 సిరీస్‌
* వివో V21
* వివో S9 (5G)

* ఇతర కేటగిరీల్లో నాలుగు మోడళ్లు


వివో X50 ప్రొ+ ప్రత్యేకతలు...

* స్నాప్‌డ్రాగన్ 865 ప్రాసెసర్‌
* 4315 mAh ఫాస్ట్‌ఛార్జింగ్
* 16.66 సెం.మీ స్క్రీన్‌
* కెమెరా: 50+8+13+8 ఎంపీ, 32 ఎంపీ ఫ్రంట్‌ 
* ధర: రూ. 53,090 (దాదాపు)
* విడుదల: మార్చి 18 (అంచనా)
* 5G సపోర్ట్
* నలుపు, గోధుమ రంగుల్లో లభించే అవకాశం


వివో X60 



 

* ప్రాసెసర్‌: శామ్‌సంగ్‌ 1080 ఆక్టా కోర్‌
* కెమెరా: 48+13+13 ఎంపీ, 32 ఎంపీ రేర్‌ కెమెరా
* డిస్‌ప్లే: 16.66 సెం.మీ (6.56 అంగుళాలు)
* బ్యాటరీ: 4500  mAh
* ర్యామ్‌: 8 GB
* 5G సపోర్ట్‌
* ధర: రూ.32,290 (దాదాపు)
* విడుదల తేదీ: మార్చి 26 (అంచనా)
* లభించే రంగులు: నలుపు, నీలం, తెలుపు 


పాతిక వేల రూపాయల్లో...


 

 
* ఫోన్‌: వివో V21
* ప్రాసెసర్‌: ఆక్టాకోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 720G
* డిస్‌ప్లే: 16.36 సెం.మీ (6.44 అంగుళాలు)
* బ్యాటరీ: 4000 mAh
* కెమెరా: 64+13+8+2 ఎంపీ, 20 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా
* 4G సపోర్ట్‌
* విడుదల: ఫిబ్రవరి 26 (అనధికారం)
* ధర: రూ.24,999
* రంగులు: నలుపు, గోల్డ్‌


5G సపోర్ట్‌తో వివో S9 స్మార్ట్‌ఫోన్

* ప్రాసెసర్‌: మీడియాటెక్‌ డెమెన్సిటీ 1100 ఆక్టాకోర్
* రేర్‌ కెమెరా: 64+8+2 ఎంపీ
* ఫ్రంట్‌ కెమెరా: 44 ఎంపీ+8 ఎంపీ
* డిస్‌ప్లే: 16.36 సెం.మీ (6.44 అంగుళాలు)
* ర్యామ్‌: 8 GB
* బ్యాటరీ: 4000 mAh
* విడుదల: మార్చి 9 (ప్రకటించాల్సి ఉంది)
* ధర: రూ.29,990 (అంచనా)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు