Vivo: ఈ ఫోన్‌ కెమెరా ఎగురుతుందట..?

స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి వచ్చాక క్షణాల్లో ఫొటోలు, వీడియోలు తీసి తమకు నచ్చిన వారితోనో లేదా సామాజిక మాధ్యమాల్లోనో షేర్‌ చేస్తున్నాం. దీంతో మొబైల్ తయారీ కంపెనీలు ఫ్లిప్‌, పాప్‌అప్‌ వంటి వాటితోపాటు యూజర్‌ ఫ్రెండ్లీ ఫీచర్స్‌తో స్మార్ట్‌ఫోన్ కెమెరాలను అందిస్తున్నాయి. తాజాగా వివో కంపెనీ సరికొత్త మొబైల్‌ఫోన్ కెమెరాను తీసుకొస్తుందట...

Published : 04 Jul 2021 23:15 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి వచ్చాక క్షణాల్లో ఫొటోలు, వీడియోలు తీసి తమకు నచ్చిన వారితోనో లేదా సామాజిక మాధ్యమాల్లోనో షేర్‌ చేస్తున్నాం. దీంతో మొబైల్ తయారీ కంపెనీలు ఫ్లిప్‌, పాప్‌అప్‌ వంటి వాటితోపాటు యూజర్‌ ఫ్రెండ్లీ ఫీచర్స్‌తో స్మార్ట్‌ఫోన్ కెమెరాలను అందిస్తున్నాయి. తాజాగా వివో కంపెనీ సరికొత్త మొబైల్‌ఫోన్ కెమెరాను తీసుకురానుందట. ఈ ఫోన్‌ కెమెరా డ్రోన్‌ కెమెరా తరహాలో ఎగురుతుందని సమాచారం. ప్రస్తుతం ప్రయోగాల దశలో ఉన్న ఈ కెమెరా ఫీచర్‌ను భవిష్యత్తులో రాబోయే ఫోన్లలో అందివ్వనున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ కెమెరాను ఫోన్ కింది భాగంలో అమరుస్తారట. అలానే అవసరమైనప్పుడు తొలగించి డ్రోన్‌ తరహాలో దీనిని ఎగరెయ్యొచ్చు.   

(Photo Credit: LetsGoDigital)

వివో డ్రోన్‌ కెమెరాలో మొత్తం నాలుగు ప్రొపెల్లర్లు, ప్రత్యేక బ్యాటరీ, రెండు కెమెరాలు, రెండు ఇన్‌ఫ్రారెడ్‌ సెన్సార్స్‌ ఉంటాయి. అయితే ఇది ఎలా పనిచేస్తుంది..కెమెరాల సామర్థ్యం గురించిన వివరాలను వెల్లడించలేదు. ఎయిర్ పిక్స్‌ ఫ్లైయింగ్ కెమెరాను పోలి ఉండటంతోపాటు.. ఇందులోని ఆటోమేటిక్ ఫాలో మోడ్‌ ద్వారా స్వయంచాలితంగా ఎగిరే ఫీచర్‌ కూడా ఇవ్వనున్నట్లు సమాచారం. వివో ఫ్లైయింగ్ కెమెరా..ఎయిర్‌ పిక్స్‌ కంటే తక్కువ సైజ్‌లో ఉంటుందని తెలుస్తోంది. అలానే వివో ఈ ఫోన్ కెమెరాను ఎప్పుడు విడుదల చేస్తుందనే దానిపై కూడా స్పష్టమైన సమాచారం లేదు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని