6G Network: 5Gకి 50 రెట్ల వేగంతో 6G... ఎప్పుడొస్తుందంటే?
6జీ నెట్వర్క్ స్పీడు, ఫీచర్లు, ప్రత్యేకతలు మీ కోసం...
ఇంటర్నెట్ డెస్క్: 5G... ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ చూసినా ఈ మాటే వినిపిస్తోంది. మొబైల్ నెట్‌వర్క్‌లో దీనినో విప్లవంగా చెబుతున్నారు. ఇప్పుడిప్పుడే 5G మొబైల్స్ మన దేశంలోకీ వస్తున్నాయి. అయితే దేశంలో 5G అందుబాటులోకి రాకపోయినా... 6G ముచ్చట్లు మొదలయ్యాయి. 6G ఫీచర్లు, స్పీడ్ ఇవీ అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. అవేంటో చదివేయండి!
మన దేశంలో 5జీ సర్వీసులు వచ్చే ఏడాది కల్లా అందుబాటులోకి వస్తాయని సమాచారం. దీనిపై స్పష్టమైన సమాచారం లేనప్పటికీ... 6జీకి సంబంధించిన పనులు దేశంలో మొదలయ్యాయనేది తాజా సమాచారం. ఇప్పటివరకు వస్తున్న సమాచారం ప్రకారం చూస్తే... 5జీ కంటే 6జీ వేగం 50 రెట్లు అధికంగా ఉంటుందని తెలుస్తోంది. కొత్త తరం నెట్‌వర్క్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు ప్రారంభించిందట. 6జీ నెట్‌వర్క్‌కు సంబంధించిన సాంకేతిక అవకాశాలను పరిశీలించమని సీ-డాట్‌కు టెలీకామ్ డిపార్ట్మెంట్ (డాట్) ఆదేశించిందని తెలుస్తోంది.
ఇప్పటికే దక్షిణ కొరియా, చైనా, యూఎస్‌లో 5జీ అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 6జీ సేవలను ప్రపంచ దేశాలతోపాటు మన దేశంలోనూ ఏక కాలంలో ప్రారంభించేలా కేంద్రం ప్రయత్నాలు చేస్తోందట. శాంసంగ్, ఎల్జీ, హువావే లాంటి సంస్థలు ఇప్పటికే 6జీ మీద ప్రయోగాలు చేస్తున్నాయని సమాచారం. టెక్ నిపుణుల అంచనా ప్రకారం 2028 - 2030 మధ్యలో 6జీ నెట్వర్క్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. తొలుత జపాన్‌లో తీసుకొస్తారట. ఆ తర్వాత దక్షిణ కొరియా, చైనా, ఫిన్లాండ్లో వస్తుందని సమాచారం.
ప్రస్తుతం దేశంలో విరివిగా వినియోగిస్తున్న 4 జీ నెట్వర్క్ వేగం 100 ఎంబీపీఎస్. అయితే వచ్చే ఏడాది అందుబాటులోకి వస్తుంది అంటున్న 5జీ వేగం 20 జీబీపీఎస్. ఇందులో డేటా డౌన్లోడ్ వేగం 3.7 జీబీపీఎస్. ఎయిర్టెల్, వీఐ, జియో చేసిన ప్రయోగాల్లో గరిష్ఠంగా డౌన్లోడ్ వేగం 3 జీబీపీఎస్ వరకు నమోదైంది. ఇక 6జీ స్పీడ్ చూస్తే... ఏకంగా 1000 జీబీపీఎస్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. బెర్లిన్‌లో ఇటీవల ఎల్జీ 6జీ ట్రయల్స్‌ను విజయవంతంగా నిర్వహించింది. ఈ క్రమంలో 6జీబీ మెమొరీ ఉన్న ఓ సినిమాను 6జీ నెట్‌వర్క్‌పై 51 సెకన్లలోనే డౌన్లోడ్ చేశారట.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మానవ రోబో దండు!
రోబో అనగానే ఏం గుర్తుకొస్తుంది? లోహ చట్రంతో కదిలే మర యంత్రమో, కదిలే లోహం బొమ్మో మదిలో కదలాడుతుంది. రబ్బరు కండరాలతో చేసినదైతే మనిషి మాదిరిగానూ కనిపిస్తుంది. చూపు, మాట మనిషిని పోలి ఉంటాయి. -
paul alexander: ఇనుప ఊపిరితిత్తి!
ఓ పొడవైన పెట్టె. శరీరమంతా అందులోనే. తల మాత్రమే బయటకు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 72 ఏళ్లు అందులోనే గడిపితే? అమెరికాకు చెందిన పాల్ అలెగ్జాండర్ అలాగే గడిపారు -
గూగుల్ సెర్చ్ తెలివిగా..
స్మార్ట్ఫోన్లలో గూగుల్ సెర్చ్‌ను వాడనివారుండరంటే అతిశయోక్తి కాదు. కానీ తేలికగా, త్వరగా ఆయా అంశాలను శోధించటానికి కొన్ని చిట్కాలు ఉన్నాయనే సంగతి తెలుసా? అలాంటి కొన్ని ఉపాయాల గురించి తెలుసుకుందాం. -
భళారే డిజిటల్ విచిత్రం!
ఒకప్పటి కన్నా స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల సామర్థ్యం, వేగం పుంజుకున్న మాట నిజం. కానీ ఆకారంలో పెద్దగా మారింది లేదు. ఒకసారి అంచులు చిన్నగా.. మరోసారి కెమెరా బంప్‌లు పెద్దగా ఉండటం తప్పించి దాదాపు అలాగే కనిపిస్తుంటాయి. -
కృత్రిమ మేధ గుండె కాయ
కృత్రిమ మేధ.. కృత్రిమ మేధ.. కృత్రిమ మేధ. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎక్కడ చూసినా ఈ పేరే మార్మోగుతోంది. -
ఇక ఏఐ సినిమా!
పదాల కూర్పు ఆధారంగా చిటికెలో ఫొటోలు, చిత్రాలు, సంగీతం, పాటలను పుట్టిస్తున్న కృత్రిమ మేధ (ఏఐ) మరో అడుగు ముందుకేసింది. ఏకంగా వీడియోలనూ సృష్టించే స్థాయికి చేరుకుంది. విప్లవాత్మక ఛాట్‌జీపీటీని రూపొందించిన ఓపెన్ఏఐ సంస్థ కొత్తగా తీసుకొచ్చిన జనరేటివ్ కృత్రిమ మేధ (జెన్ఏఐ) మోడలే దీనికి నిదర్శనం. -
ఈ విశ్వ కిరణాలు..
విశ్వ కిరణాలు.. కాస్మిక్ రేస్. అంతరిక్షం ఆవలి నుంచి దూసుకొచ్చే ఇవి నిరంతరం అతి వేగంగా.. దాదాపు కాంతి వేగంతో సమానంగా విశ్వమంతటా ప్రయాణిస్తుంటాయి. వీటి మీద మొదటి నుంచీ శాస్త్రవేత్తలకు ఎంతో ఆసక్తి. ఎందుకంటే అంతరిక్షంలో పుట్టుకొచ్చిన చోటు, ఢీకొట్టిన వస్తువులను బట్టి ఇవి విశ్వానికి సంబంధించిన ఎన్నో విషయాలను వివరిస్తాయి. -
ప్రేమ శాస్త్రం!
ప్రేమ ఎందుకు పుడుతుందో, ఎవరి మీద పుడుతుందో తెలియదు. ఒకరికి నచ్చిన వ్యక్తి మరొకరికి నచ్చకపోవచ్చు. ఒకరికి అసలే నచ్చనివారు మరొకరికి ప్రాణం కన్నా మిన్నగా అనిపించ్చొచ్చు. -
ఫోల్డర్ మాయలు
విండోస్ పీసీలో రోజూ ఫోల్డర్లను వాడుతూనే ఉంటాం. కొత్త ఫైళ్లను స్టోర్ చేయటం, డేటాను వరుసగా పెట్టుకోవటం.. ఇలా ఎన్నింటికో వీటిని ఉపయో గిస్తుంటాం. మరి అదృశ్య ఫోల్డర్‌ను సృష్టించుకోగలరా? ఒకేసారి బోలెడన్ని ఫోల్డర్ల పేర్లను మార్చుకోగలరా? ఖాళీ ఫోల్డర్లను గుర్తించగలరా? ఇలాంటి కొన్ని చిత్రమైన ఫోల్డర్ చిట్కాల గురించి తెలుసుకుందాం. -
అమెజాన్ అడుగున బంగారు నేల
అమెజాన్ అనగానే దట్టమైన అడవులే గుర్తుకొస్తాయి. మనుషులు దూరటానికి వీల్లేని అక్కడ ఒకప్పుడు పెద్ద పట్టణమే ఉండేదని ఇటీవల తేలటం అందరినీ ఆశ్చర్యపరచింది -
ఏఐ టెక్కులు!
అసలే కృత్రిమ మేధ (ఏఐ) యుగం. ఆపై ప్రపంచంలోనే అతి పెద్ద ఎలక్ట్రానిక్ వస్తు ప్రదర్శన. ఇక చెప్పేదేముంది? ఏ పరికరాన్ని చూసినా ఏఐమయమే. హెల్త్ ట్రాకర్ల దగ్గరి నుంచి వాహనాల వరకూ అన్నింటికీ అదే ఆలంబన. -
Cyber Crime: నయా సైడర్!
నేటి సైబర్ యుగంలో నేరాలూ మారిపోతున్నాయి. ఆన్లైన్ మోసాలు కోకొల్లలు. డెబిట్, క్రెడిట్ కార్డు వివరాలు చోరీ చేసి మన ప్రమేయమేమీ లేకుండానే నేరగాళ్లు షాపింగ్ చేయటం తెలిసిందే -
కొత్త టెక్ లోకం
డిజిటల్ పరిణామం ఆగేది కాదు. ఇదో నిరంతర ప్రక్రియ. గత ఏడాదిని గతి తిప్పిన ట్రెండ్స్ కొత్త సంవత్సరాన్నీ పరుగులు తీయించనున్నాయి. మెషిన్ ఇంటెలిజెన్స్ జోరందుకోనుంది. వాస్తవ, కాల్పనిక ప్రపంచాల మధ్య హద్దులు చెరగటం ఖాయంగా కనిపిస్తోంటే.. నిరంతర అంతర్జాల పరిణామ ప్రక్రియ మన జీవితాలను గణనీయంగా శాసించేలా రూపుదిద్దుకుంటోంది. -
ఇస్రో ఏఐ వత్సరం 2024
ఇది మనదేశం జాబిల్లిని తాకి ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచిన సంవత్సరం.ఇది కృత్రిమ మేధ ప్రయోగశాలలను దాటుకొని నిత్య జీవన వ్యవహారాల్లోకి విరివిగా చొచ్చుకొచ్చిన సంవత్సరం.శాస్త్ర, సాంకేతిక రంగాలు ఒకదాంతో మరోటి పోటీ పడుతూ కొత్త వత్సరంలోకి అడుగిడుతున్న వేళ సాధించిన ఘనతలను సమీక్షించుకోవటం ముదావహం. -
స్థానిక మేధ
కృత్రిమ మేధ (ఏఐ) తీరు మారుతోంది. ఆంగ్లం గడపను దాటుకొని స్థానిక భాషలపై దృష్టి సారిస్తోంది. ఆయా భాషల వైవిధ్యం, యాసలు, సంస్కృతులకు అనుగుణంగా రూపాంతరం చెందుతోంది. -
గాజు బిందువు ఇంద్రజాలం
ఎప్పుడైనా గాజు కన్నీటి చుక్కల గురించి విన్నారా? అవి స్టీలు కన్నా దృఢంగా ఉంటే? బుల్లెట్ దెబ్బనైనా తట్టుకుంటే? సైన్స్ సూత్రాలనూ ధిక్కరిస్తే? అంత విచిత్రమైన గాజు బిందువు లేంటని అనుకుంటున్నారా? అవే ప్రిన్స్ రూపర్ట్స్ డ్రాప్స్. -
వృక్షో రక్షతి రక్షితః
జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ఛార్లెస్ డార్విన్ అప్పుడెప్పుడో కన్న కల ఎట్టకేలకు సాకారమైంది. ప్రపంచంలో మనకు తెలిసిన అన్ని మొక్కల జాబితాను రూపొందించాలనే ఆయన ఆశయాన్ని రాయల్ బొటానిక్ గార్డెన్స్ ఇటీవల సాకారం చేసింది. -
వాతావరణతరంగ శోధన
భూమి, అంతరిక్ష వాతావరణం మధ్య జరిగే చర్యల మీద అధ్యయనం చేయటం దీని ఉద్దేశం. -
ఏఐయ్యారే!
సాంకేతిక రంగంలో కృత్రిమ మేధ (ఏఐ) సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. ఛాట్‌జీపీటి సమస్త సమాచార సారాంశాన్ని చిటికెలో ముందుంచుతోంది. -
వర్షం కృత్రిమం
ఉక్కపోస్తే ఫ్యాన్ వేసుకుంటాం. చుట్టుపక్కల గాలిని మనవైపు తిప్పుకొంటాం. ఇంట్లో ఉష్ణోగ్రత పెరిగితే ఏసీ వేసుకుంటాం. వేడి గాలిని చల్లబరచి హాయిని అనుభవిస్తాం -
Phone Hacking: ఫోన్ హ్యాక్ అయ్యిందా?
ప్రభుత్వ ప్రాయోజిత అటాకర్లు ఐఫోన్ల మీద దాడి చేసే అవకాశముందని ఇటీవల యాపిల్ సంస్థ ప్రముఖ ప్రతిపక్ష నేతలు, పాత్రికేయులను హెచ్చరించటం తీవ్ర కలకలం సృష్టించింది. ఒక్క మనదేశానికి చెందినవారికే కాదు.. 150 దేశాల్లోకి వ్యక్తులకూ ఈ నోటిఫికేషన్లు అందాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం యాపిల్‌కు నోటీసులు జారీ చేసి, వివరణ కోరింది.