WhatsApp: ఇకపై వాట్సాప్‌ యాప్‌లోనుఫొటో ఎడిట్!

వాట్సాప్ యాప్‌ యూజర్ల కోసం కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది. ప్రస్తుతం డెస్క్‌టాప్ వెర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే మొబైల్‌ యూజర్లకు పరిచయం చేయనుంది. 

Updated : 17 Jan 2022 18:19 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మొబైల్‌ యూజర్లకు వాట్సాప్‌ మరో కొత్త ఫీచర్‌ను పరిచయం చేయనుంది. ఇప్పటి వరకు డెస్క్‌టాప్‌ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్న డ్రాయింగ్ టూల్‌/ఫొటో ఎడిట్‌ టూల్‌ను త్వరలో మొబైల్ వెర్షన్‌లో కూడా తీసుకొస్తున్నట్లు వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్ వాట్సాప్‌ బీటా ఇన్ఫో (వాబీటాఇన్ఫో) తెలిపింది. మొబైల్‌ వాట్సాప్‌లో రెండు వెర్షన్లలో ఈ టూల్‌ను తీసుకొస్తున్నట్లు సమాచారం. ఇందులో ఒకటి ఫొటోల కోసం కాగా, రెండోది వీడియోలను ఎడిట్‌ చేసేందుకని వాబీటాఇన్ఫో వెల్లడించింది. ఈ టూల్‌తో యూజర్లు తాము ఇతరులకు పంపే ఫొటోలను క్రాప్‌ చేయడంతోపాటు, ఫొటోలపై ఎమోజీలు, జిఫ్‌, టెక్ట్స్‌ను యాడ్‌ చేయొచ్చు. వీడియోలకు ఈ టూల్ ఎలా ఉపయోగపడుతుందనేది తెలియాల్సివుంది. 

ఇవేకాకుండా వాట్సాప్‌ డెస్క్‌టాప్ యూజర్ల కోసం యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ (యూఐ)లో మార్పులు చేయడంతోపాటు, చాట్ బబుల్స్‌ అనే కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది. అలానే చాట్‌ బార్‌ రంగులు కూడా మార్చుకునేందుకు వీలుగా కొత్త అప్‌డేట్‌ను పరిచయం చేయనుంది. వీటితోపాటు బ్యాక్‌గ్రౌండ్‌ వాయిస్‌ మెసేజ్‌, చాట్‌ లిస్ట్‌లో మార్పులు, అడ్వాన్స్‌డ్‌ సెర్చ్‌ వంటి కొత్త పీచర్లను వాట్సాప్ తీసుకురానుంది. మిగతా మెసేజింగ్‌ యాప్‌లతో పోలిస్తే గత కొద్ది నెలలుగా వరుస కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ వాట్సాప్ వినియోగాన్ని మరింత యూజర్‌ ఫ్రెండ్లీ యాప్‌గా మార్చే ప్రయత్నం చేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు