WhatsApp: వాట్సాప్ బిజినెస్ కొత్త ఫీచర్.. మెసేజ్ రిప్లైసులువుగా, వేగంగా!

వాట్సాప్ బిజినెస్‌ ఖాతాదారులకు మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. దీని సాయంతో బిజినెస్ ఖాతాదారులు తమ కస్టమర్లకు సులువుగా, వేగంగా రిప్లై ఇవ్వొచ్చు.

Published : 20 Dec 2021 18:11 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బిజినెస్ ఖాతాదారులకు వాట్సాప్‌ మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. క్విక్‌ రిప్లైస్‌ పేరుతో తీసుకొస్తున్న ఈ ఫీచర్‌తో యూజర్స్ సులువుగా, వేగంగా కస్టమర్ల మెసేజ్‌లకు రిప్లై ఇవ్వొచ్చని వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్‌ వాట్సాప్‌ బీటా ఇన్ఫో (వాబీటాఇన్ఫో) తెలిపింది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ బీటా యూజర్స్‌కు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు తెలిపింది. పరీక్షల అనంతరం పూర్తిస్థాయిలో యూజర్స్ అందరికీ పరిచయం చేయనున్నట్లు సమాచారం. క్విక్ రిప్లైస్‌ ఫీచర్‌తో వాట్సాప్ బిజినెస్ యూజర్స్ ఖాతాదారులు తరచుగా అడిగే ప్రశ్నలకు సులువుగా, వేగంగా సమాధానాలు పంపొచ్చు. టెక్ట్స్‌ మెసేజ్‌లతోపాటు మీడియా ఫైల్స్‌ను కూడా బిజినెస్ ఖాతాదారులు ఈ ఫీచర్‌ ద్వారా యూజర్స్‌తో షేర్ చేసుకోవచ్చు. 

ఈ ఫీచర్‌ కోసం వాట్సాప్‌ బిజినెస్‌ ఖాతాదారులు సెట్టింగ్స్‌లో మోర్ ఆప్షన్స్‌లోకి వెళ్లి బిజినెస్ టూల్స్‌పై క్లిక్ చేయాలి. అందులో క్విక్‌ రిప్లైస్‌ కనిపిస్తుంది. దాన్ని ఓపెన్‌ చేస్తే యాడ్‌ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేసి మీరు పంపాలనుకుంటున్న మెసేజ్‌ లేదా మీడియా ఫైల్‌ను యాడ్‌ చేసి సేవ్‌ చేస్తే సరిపోతుంది. తర్వాత మీరు ఏ మెసేజ్‌కు క్విక్‌ రిప్లై ఇవ్వాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్‌ చేసి కీబోర్డులో ‘/’ సింబల్‌ టైప్ చేస్తే సరిపోతుంది. అలానే మీరు తరచుగా పంపాలనుకునే రిప్లైస్‌ను యాడ్‌ ఆప్షన్‌ ద్వారా సేవ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌ వాట్సాప్ బిజినెస్ ఖాతాదారులకు ఎంతో ఉపయోగపడుతుందని వాబీటాఇన్ఫో తెలిపింది. 

Read latest Gadgets & Technology News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని