Whatsapp Business: వాట్సాప్‌ సెర్చింగ్ ఇకమరింత ఈజీ!

ప్రముఖ మెసేంజర్‌ వాట్సాప్‌ మరో సరికొత్త ఫీచర్‌ తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. అడ్వాన్సడ్‌ సెర్చ్‌ ఫీచర్‌ను..

Published : 10 Jan 2022 13:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ మెసేంజర్‌ వాట్సాప్‌ మరో సరికొత్త ఫీచర్‌ తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. బిజినెస్‌ అకౌంట్‌ యూజర్లను దృష్టిలో పెట్టుకొని అడ్వాన్సడ్‌ సెర్చ్‌ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. దీని ద్వారా వ్యాపార ఖాతా నిర్వాహణ మరింత సులభతరం కానుంది. ఈ మేరకు బిజినెస్‌ అకౌంట్‌ యూజర్లు వారి సంబంధిత వినియోగదారుల కాంటాక్ట్‌లు, మెసేజ్‌లను వెతకడం మరింత విస్తృతం కానుంది. వాట్సాప్‌ సెర్చ్‌ బార్‌పై క్లిక్‌ చేయగానే.. శోధనను ఫిల్టర్‌ చేసేలా కాంటాక్ట్‌లు (contacts), నాన్‌ కాంటాక్ట్‌లు (non-contacts), అన్‌రీడ్‌ (unread) ఆప్షన్లు ఉండనున్నాయి. త్వరలో ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌ బిజినెస్‌ అకౌంట్‌ యూజర్లకు మాత్రమే ఈ కొత్త ఫీచర్‌ను వాట్సాప్‌ అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. 

ఇప్పటికే వాట్సాప్‌ సాధారణ ఖాతాతో పాటు బిజినెస్‌ అకౌంట్‌లో సెర్చింగ్‌కు సంబంధించి మరో ఫీచర్‌ అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. ఫొటోలు, వీడియో, లింక్‌, ఆడియో, డాక్యుమెంట్లను నేరుగా సెర్చ్‌ చేసేలా ఈ ఫీచర్‌ యూజర్లకు తోడ్పడుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని