Xiaomi cooling Tech: షావోమీలో కొత్త కూలింగ్‌ టెక్నాలజీ.. అదేంటంటే?

చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం షావోమీ తన ఫోన్లలో కొత్త టెక్నాలజీని తీసుకువస్తున్నట్లు ప్రకటించింది

Published : 10 Nov 2021 09:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం షావోమీ తన ఫోన్లలో కొత్త టెక్నాలజీని తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఆ కంపెనీ ఫోన్లలో ప్రాసెసర్‌ హీట్‌ని తగ్గించి కూల్‌ చేయొచ్చని తెలిపింది. దీనికి ‘లూప్‌ లిక్విడ్‌ కూల్‌’అని పేరు పెట్టింది. మొబైల్‌ ఫోన్లలో తలెత్తే హీట్‌ సమస్యను తొలగించేలా హాట్‌ ఎయిర్‌ను, కూలింగ్‌ లిక్విడ్‌ సర్క్యులేషన్‌ను వేరుచేసేలా టెక్నాలజీని రూపొందించింది. ఏరోస్పేస్‌ టెక్నాలజీల్లో వాడిన కూలింగ్‌ సిస్టమ్స్‌నే ఇందులో ఉపయోగించినట్లు షావోమి తెలిపింది. దీన్ని వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ప్రవేశపెట్టాలని కంపెనీ యోచిస్తోంది.

లూప్‌ లిక్విడ్‌ కూల్‌ టెక్నాలజీ అనేది హీట్‌ను సృష్టించే కన్వెన్షనల్‌ వేపర్‌ ఛాంబర్‌పై  పనిచేస్తుంది. క్యాపిల్లరీ ప్రభావంతో హీట్‌కు గురయ్యే వాటిపై కూలింగ్‌ లిక్విడ్‌లను పంపించి ప్రాసెసర్‌ కూల్‌ అయ్యేలా చూస్తోంది. లూప్ లిక్విడ్‌కూల్ టెక్నాలజీలో ఎవాపరేటర్‌, కండెన్సర్‌, రిఫిల్‌ ఛాంబర్‌, గ్యాస్, లిక్విడ్‌ పైప్‌ సిస్టమ్స్‌ ఉంటాయి. స్మార్ట్‌ఫోన్‌ను ఎక్కువ సమయం వాడినప్పుడు ఎవాపరేటర్‌ రిఫ్రిజిరెంట్ గ్యాస్‌గా మారి ఆవిరైపోతుంది. గ్యాస్, ఎయిర్‌ కండెన్సర్‌కు వ్యాపిస్తుంది. అక్కడ ఎయిర్‌ మరింత లిక్విడ్‌గా మారుతుంది. ఈ లిక్విడ్‌ రిఫిల్ ఛాంబర్‌లోని చిన్న ఫైబర్‌లకు వచ్చి చేరుతుంది. ఇది స్వీయ-నిరంతర వ్యవస్థ (సెల్ఫ్‌ సస్టెయిన్‌ సిస్టమ్‌)గా మారుతుంది. ఈ నూతన టెక్నాలజీ మొబైల్‌ ఉష్ణోగత్రను స్థిరంగా ఉంచుతూ కూలింగ్‌ సిస్టమ్‌ పనితీరును మెరుగుపరుస్తుందని షావోమి భావిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని