Tech‌: MI నుంచి 2 ఆడియో ఉత్పత్తులు

స్మార్ట్‌ఫోన్లతో పాటు ఆడియో, స్మార్ట్‌ ఉత్పత్తులను ఎప్పటికప్పుడు మార్కెట్లోకి విడుదల చేస్తూ ఆకట్టుకుంటోంది షావోమి. బోట్‌, రియల్‌మీ వంటి పోటీ సంస్థలకు సవాల్‌ విసురుతూ మరో రెండు ఆడియో ఉత్పత్తులన.......

Updated : 12 Aug 2022 12:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్మార్ట్‌ఫోన్లతో పాటు ఆడియో, స్మార్ట్‌ ఉత్పత్తులను ఎప్పటికప్పుడు మార్కెట్లోకి విడుదల చేస్తూ ఆకట్టుకుంటోంది షావోమి. బోట్‌, రియల్‌మీ వంటి పోటీ సంస్థలకు సవాల్‌ విసురుతూ మరో రెండు ఆడియో ఉత్పత్తులను ఆ కంపెనీ తీసుకొచ్చింది. ఇందులో ఒకటి నెక్‌బ్యాండ్‌ బ్లూటూత్‌ ఇయర్‌ఫోన్స్‌ కాగా.. ఇంకోటి ఎంఐ పోర్టబుల్‌ బ్లూటూత్‌ స్పీకర్‌.

ఇటీవల బ్లూటూత్‌ ఇయర్‌ఫోన్స్‌ వాడకం భారీగా పెరిగింది. సౌకర్యవంతంగా ఉండడంతో ఎక్కువమంది ఈ తరహా ఇయర్‌ఫోన్లవైపు మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఎంఐ నెక్‌బ్యాండ్‌ ఇయర్‌ఫోన్‌ ప్రోను తీసుకొచ్చింది. 2019లో తీసుకొచ్చిన నెక్‌బ్యాండ్‌ బ్లూటూత్‌ ఇయర్‌ఫోన్స్‌కు అప్‌డేటెడ్‌ మోడల్‌ ఇది. దీని ధరను రూ.1,799గా ఆ కంపెనీ నిర్ణయించింది. ఇందులో యాక్టివ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ ఫీచర్‌ను జోడించింది. ఒకసారి ఛార్జ్‌ చేస్తే 20 గంటల పాటు పనిచేస్తుందని కంపెనీ తెలిపింది. 10ఎంఎంఎ డైనమిక్‌ డ్రైవర్స్‌ ఉపయోగించారు.

పోర్టబుల్‌ బ్లూటూత్‌ స్పీకర్ల శ్రేణిలో ఎంఐ నుంచి వచ్చిన రెండో ప్రొడక్ట్‌ ఇది. ఈ స్పీకర్‌ 16W (8W+ 8W) ఔట్‌పుట్‌ అందిస్తుంది. ఐపీఎక్స్‌ 7 రేటింగ్‌ కలిగిన వాటర్‌ రెసిస్టెన్స్‌ సదుపాయం ఉంది. ఒకసారి ఛార్జ్‌ చేస్తే 13 గంటల పాటు వినియోగించొచ్చు. ఇందులోని ఇన్‌బిల్ట్‌ మైక్రోఫోన్‌ ద్వారా దీన్ని హ్యాండ్స్‌ ఫ్రీ డివైజ్‌గా వినియోగించుకోవచ్చు. దీని ధరను కంపెనీ 2,499గా నిర్ణయించింది. ఈ రెండు ఉత్పత్తుల అమ్మకాలు సోమవారం నుంచే (ఫిబ్రవరి 22) నుంచి ప్రారంభిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని